Jump to content

DURGA GUDI FLYOVER


Recommended Posts

Guest Urban Legend
1 minute ago, Saichandra said:

Konchem bane ayinattu unnayi ga works,jan ki ayipoddi emo

hope so ...center govt ivvakapothey state ye ichi complete chestharu 

Link to comment
Share on other sites

  • Replies 685
  • Created
  • Last Reply
మందగించిన కనకదుర్గా ఫ్లై ఓవర్‌ పనులు
01-07-2018 10:32:44
 
636660379626365856.jpg
  • రెండు సవాళ్లు!
  • మందగించిన కనకదుర్గా ఫ్లై ఓవర్‌ పనులు
  • కెనాల్‌కు నీటి విడుదలతో ..
  • జూలై 10 నాటికి కెనాల్‌ పోర్షన్‌ పూర్తికి ప్రయత్నాలు
  • రివర్‌ పోర్షన్‌పై స్పష్టత ఇవ్వని కాంట్రాక్టు సంస్థ
  • నాలుగు దశలుగా పనులు పూర్తికి ప్రణాళికలు
  • కాస్త స్పీడ్‌ పెరిగాల్సిందే..!
కనకదుర్గా ఫ్లైఓవర్‌కు సంబంధించి కీలకమైన కెనాల్‌, రివర్‌ పోర్షన్‌ పనుల్లో జాప్యం కనిపిస్తోంది. కాలువలకు నీటిని వదలటం, కృష్ణానదికి పట్టిసీమ నీరు వస్తుండటంతో భారీ యంత్రాలతో పనులు చేపట్టడం ఇబ్బందిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెనాల్‌ పోర్షన్‌ను జూలై 10 నాటికి పూర్తి చేస్తామంటున్న కాంట్రాక్టు సంస్థ రివర్‌ పోర్షన్‌వైపు మాత్రం స్పష్టత ఇవ్వకపోవటంతో అనుమానాలు తలెత్తుతున్నాయి.
 
 
విజయవాడ(ఆంధ్రజ్యోతి): ‘కనకదుర్గా ఫ్లై ఓవర్‌ పనులు స్పీడ్‌ పెరగాలి. ఆగస్టు నాటికి పూర్తిచేయాలి.‘ అని ప్రభుత్వం డెడ్‌లైన్‌ నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం రూ.10 కోట్ల నిధులను కాంట్రాక్టు సంస్థకు అప్పుగా కూడా ఇచ్చింది. కాంట్రాక్టు సంస్థ ముందు ఇప్పుడు రెండు సవాళ్లు ఉన్నాయి. ఒకటి కృష్ణా తూర్పు ప్రధాన కాలువ... రెండు కృష్ణానది. ఖరీఫ్‌ సీజన్‌ కావటంతో కాలువలోకి నీటిని వదిలారు. కాలువకు నీటిని కట్టేసిన తర్వాత కెనాల్‌ పోర్షన్‌ పనులు జరిగాయి. కెనాల్‌లో మొత్తం నాలుగు స్పాన్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంది. మూడు స్పాన్లను ఇప్పటికే పూర్తి చేశారు. నాల్గవ స్పాన్‌, వింగ్స్‌ పనులను పూర్తిస్థాయిలో జూలై 10వ తేదీలోపు కాంట్రాక్టు సంస్థ సోమా ఆర్‌అండ్‌బీ స్టేట్‌ హైవే అధికారులకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కెనాల్‌ నీటి ప్రవాహం ఉధృతంగా లేదు కాబట్టి పనులు పూర్తిచేస్తామని చెప్పినట్టు సమాచారం. దీనిని బట్టి కెనాల్‌ ఉధృతి పెరిగితే.. పనులు ఆగిపోయే అవకాశం ఉంది.
 
 
వింగ్స్‌ మాటేమిటి?
కృష్ణానదిలో చేపట్టాల్సిన పోర్షన్‌కు సంబంధించి చూస్తే పిల్లర్‌ వర్క్‌ ఎప్పుడో పూర్తయింది. ఇప్పటికే రెండు స్పాన్లు పూర్తిచేశారు. మిగిలిన స్పాన్‌ పనులతో పాటు వింగ్స్‌ కూడా అమర్చాల్సి ఉంది. మిగిలిన బ్యాలెన్స్‌ స్పాన్‌ పనులతో పాటు వింగ్స్‌ ఏర్పాటుకు నదిలో చదును చేసిన ప్రాంతంలో భారీ యంత్రాలు దిగాల్సి ఉంది. వేలాది టన్నుల బరువు ఉండే ఐరన్‌ గడ్డర్లను నేల మీద నుంచి పై వరకు ఏర్పాటు చేయాలి. నది ప్రవాహం వల్ల కుంగు తుందేమోనన్న మీమాంస కలుగుతోంది. స్పాన్స్‌పై వింగ్స్‌ ఏర్పాటు చేయాలంటే.. నాలుగు స్పాన్స్‌ మీదనే వింగ్స్‌ అమర్చ గలిగే వ్యవస్థ మాత్రమే కాంట్రాక్టు సంస్థ ‘సోమా’ కు ఉంది.
 
ముందుకు కదలని ‘వై’ షేప్‌ పిల్లర్స్‌
‘వై’ షేప్‌ పిల్లర్ల పనులు మిగిలే ఉన్నాయి. మొత్తం ఆరు ‘వై’ షేప్‌ పిల్లర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ నుంచి కృష్ణానదిలోకి పిల్లర్లు టర్న్‌ అవుతాయి. ఈ టర్న్‌ అయ్యే దగ్గర ప్రధానంగా రెండు వై పిల్లర్స్‌ వేయాలి. అక్కడి నుంచి మోడల్‌ గెస్ట్‌హౌస్‌ నుంచి అశోక స్తంభం వరకు మిగిలిన నాలుగు వై పిల్లర్లు ఏర్పాట ుచేయాలి. ప్రస్తుతం ఇవి భూమిమీదనే ఉన్నాయి. హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ దగ్గర మాత్రమే రెండు పిల్లర్ల పనులు ప్రారం భించారు. వీటిలో ఒక పిల్లర్‌ పనులు ప్రారంభమయ్యాయి. సాధారణ పిల్లర్ల మీద తలలు వై ఆకారం ఉంటుంది. భూగర్భంలో మంచినీటి పైపులు ఉండటం వల్ల రెండు పిల్లర్ల మధ్య దూరం పెంచటానికి వై పిల్లర్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. వై పిల్లర్‌ వల్ల రెండువైపులా చెరో 8 మీటర్ల చొప్పున మొత్తం 16 మీటర్ల వెడల్పు వస్తుంది. దీంతో స్పాన్‌ నిడివి పెరుగుతుంది.
 
వింగ్స్‌ అమరిక పూర్తి
ద్విచక్రవాహనాలు, కార్లకు ట్రాఫిక్‌ క్లియరెన్స్‌ ఇవ్వటానికి వీలుగా కుమ్మరిపాలెం సెంటర్‌ నుంచి హెడ్‌వాటర్‌ వర్క్స్‌ వరకు యుద్ధప్రాతిపదికన చేపట్టిన స్పాన్‌, వింగ్స్‌ పనులు దాదాపు పూర్తయ్యాయి. వింగ్స్‌ అమర్చిన తర్వాత.. వింగ్‌కు-వింగ్‌కు మధ్య ఉంచిన కొంత గ్యాప్‌ను కాంక్రీట్‌తో పటిష్టత పరుస్తున్నారు. ఇవి తుది దశలో ఉన్నాయి.
 
 
నాలుగు దశలుగా పనులు
కాం ట్రాక్టు సంస్థ నాలుగు దశల్లో తాను చేపట్టే పనుల వివరాలను అధికారులకు తెలియజేసింది. జూలై 10 నాటికి కెనాల్‌ పోర్షన్‌ను పూర్తి చేయగానే.. నిధుల సమస్య నుంచి బయట పడటానికి వింగ్స్‌ అమర్చటం ప్రారంభిస్తుంది. ఫ్లై ఓవర్‌ పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి బకాయిలు ప్రస్తుతం ఏమీ లేవని తెలుస్తోంది. వింగ్స్‌ కూడా అమర్చితేనే నిధులొస్తాయి. ఈ పనులు చేపడితే 7 స్పాన్లకు ఒక్కోదానికి రూ.2 కోట్ల చొప్పున రూ.14కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మూడవ దశలో రివర్‌లోనూ, నాల్గవ దశలో అశోకస్థంభం, మోడల్‌ గెస్ట్‌హౌస్‌ల దగ్గర స్పాన్‌, వింగ్స్‌ పనులు ప్రారంభిస్తామని తెలిపింది.
 
 
68 శాతం పనులు పూర్తి
కనకదుర్గ ఫ్లై ఓవర్‌కు సంబంధించి ఇప్ప టివరకు 68 శాతం మేర పనులు పూర్తయ్యాయి. మొత్తం 57 శాతం పనులకు సంబంధించి బిల్లులు కూడా మంజూరయ్యాయి. ఇంటర్‌ లింకింగ్‌ చేయాల్సిన పనులు బ్యాలెన్స్‌ ఉండటం వల్ల మిగిలిన వాటికి బిల్లులు రాలేదని తెలుస్తోంది. ఇప్పటివరకు రూ.169 కోట్ల మేర బిల్లులు చెల్లింపు జరిగినట్టు తెలుస్తోంది. దుర్గా ఫ్లైఓవర్‌ మొత్తంగా స్పాన్స్‌కు వింగ్స్‌ పూర్తికాగానే క్రాష్‌ బారియర్స్‌ పనులు చేపట్టాలని కాంట్రాక్టు సంస్థ భావిస్తోంది. ఫ్లై ఓవర్‌కు రెండువైపులా సైడ్‌ వాల్స్‌తో పాటు మధ్యలో సెంట్రల్‌ డివైడర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
Link to comment
Share on other sites

కనకదుర్గా ఫ్లై ఓవర్‌ అప్రోచ్‌ నిర్మాణం మొదలు
11-07-2018 06:59:48
 
636668891871422050.jpg
  • సబ్‌స్టేషన్‌ దగ్గర పద్మావతి ఘాట్‌ వెంబడి తవ్వకాలు
  • భవానీపురంలో బ్యాలెన్స్‌ వింగ్స్‌ పనులకు సంసిద్ధం
  • కృష్ణానది, కెనాల్‌ పోర్షన్‌ పనులు సమాంతరంగా..
విజయవాడ: కనకదుర్గా ఫ్లై ఓవర్‌ బ్యాలెన్స్‌ పనులు దశల వారీగా చేపట్టేందుకు ఆర్‌అండ్‌బీ స్టేట్‌ హైవేస్‌ అధికారులు, కాంట్రాక్టు సంస్థ ‘సోమా’కు నిర్దేశించారు. ఫ్లై ఓవర్‌ పనులు వేగంగా చేపట్టడానికి వీలుగా స్టేట్‌ హైవేస్‌ అధికారులు ఈ దిశగా కాంట్రాక్టు సంస్థకు కార్యాచరణను నిర్దేశించారు. ప్రధానంగా అప్రోచ్‌ పనులు, అశోక్‌ పిల్లర్‌ ఏరియా, భవానీపురం ఏరియాలలో స్పాన్‌, వింగ్స్‌ పనులకు టార్గెట్‌ను నిర్దేశించటం జరిగింది. కాంట్రాక్టు సంస్థ కూడా వెంటనే కార్యరూపంలోకి దిగింది. రాజీవ్‌గాంధీ పార్కు దగ్గర జాతీయ రహదారిపై అప్రోచ్‌ పనులకు కాంట్రాక్టు సంస్థ శ్రీకారం చుట్టింది. అప్రోచ్‌ పనుల కోసం ఒకవైపు పద్మావతి ఘాట్‌ వెంబడి అలైన్‌మెంట్‌ ప్రకారం ఇచ్చిన మార్కింగ్‌కు అనుగుణంగా తవ్వకాలు ప్రారంభించారు. ప్రస్తుతం వర్షాలు కురవటం బురదబురదగా ఉండటంతో తాత్కాలికంగా పనులు నిలుపుదల చేశారు. ఇంకా కొంత లోతు తవ్విన తర్వాత అప్రోచ్‌ రోడ్డుకు సైడ్‌ వాల్‌ నిర్మాణ పనులు చేపడతారు. అప్రోచ్‌ సైడ్‌వాల్స్‌ను కాంక్రీట్‌ ప్లేట్స్‌తో ఒకదానికొకటి జత చేస్తారు.
 
విద్యాధరపురంలోని మినీ క్యాస్టింగ్‌ యార్డులో ఇప్పటికే వీటిని తయారు చేశారు. వీటిని తీసుకు వచ్చి బిగిస్తారు. అప్రోచ్‌ రోడ్డుకు రెండో వైపు పూర్తిగా రోడ్డు మార్జిన్‌ వెంబడి సైడ్‌ వాల్‌ వస్తుంది. దీనివల్ల దారి మూసుకుపోతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని గతంలో ప్రతిపాదించిన మేరకు రాజీవ్‌గాంధీ పార్కులో రోడ్డు వెంబడి కొంత భూమిని స్వాధీనం చేసుకోవటం జరిగింది. ఈ భూమిలో కొన్ని నిర్మాణాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిని తొలగించే పనులు చేపడుతున్నారు. ప్రొక్లెయిన్‌తో భవనాలను పగులగొడుతున్నారు. నిర్మా ణాలు కూలగొట్టిన తర్వాత ఈ ప్రాంతాన్ని చదును చేసి బీటీ రోడ్డు వేస్తారు. దీని వల్ల అప్రోచ్‌తో ముడిపడిన సమస్య తొలుగు తుంది. రథం సెంటర్‌ నుంచి కెనాల్‌ బ్రిడ్జి మీదుగా కార్పొరేషన్‌ నుంచి వచ్చే వాహనాలు బస్‌స్టేషన్‌ వైపు ఈ ప్రాంతంలో తేలిగ్గా ఫ్రీ లెఫ్ట్‌ తీసుకుంటాయి. రెండవ ఫేజ్‌లో.. అశోక్‌ స్తంభం ప్రాంతంలో కృష్ణానది నుంచి రోడ్డు మీదకు వచ్చే పిల్లర్ల మీద స్పాన్స్‌ బిగింపు పనులు చేపట్టడానికి కాంట్రాక్టు సంస్థ రంగం సిద్ధం చేసింది. స్పాన్స్‌ను బిగించటానికి వీలుగా ఐరన్‌ కేజ్‌లను తీసుకువచ్చి ఆ ప్రాంతంలో ఉంచింది. వీటిని పిల్లర్‌ - పిల్లర్‌ అమర్చిన తర్వాత వీటిపై సింగిల్‌ స్పైన్స్‌ను పైకి ఎక్కిస్తారు. వీటిని కలిపి స్పాన్‌గా రూపాంతరం చేస్తారు.
 
మూడవ ఫేజ్‌లో... భవానీపురం అప్రోచ్‌ దగ్గర నుంచి కుమ్మరిపాలెం వరకు స్పాన్స్‌తో వదిలివేసిన చోట వింగ్స్‌ బిగించటానికి రంగం సిద్ధం చేస్తోంది. క్యాస్టింగ్‌ యార్డు నుంచి వింగ్స్‌ను ఈ ప్రాంతానికి తీసుకు వచ్చింది. కాంట్రాక్టు సంస్థ దగ్గర నాలుగు స్పాన్లను ఒకేసారి చేపట్టడానికి అవవసరమైన వ్యవస్థ మాత్ర మే అందుబాటులో ఉంది. ప్రస్తుతం కృష్ణా రివర్‌లో ఒకచోట, హెడ్‌వాటర్‌ వర్క్స్‌ ఒకచోట వింగ్స్‌ అమర్చుతున్నారు. ఇంకా రెండు వింగ్‌ జాయింట్‌ ఆపరేటర్‌లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి వాటిని భవానీపురం - కుమ్మరిపాలెం వరకు ఉపయోగించాలని కాంట్రాక్టు సంస్థ భావిస్తోంది. నాలుగో ఫేజులో కృష్ణానది, కెనాల్‌లో బ్యాలెన్స్‌ పనులు పూర్తి చే యాల్సి ఉంది. కెనాల్‌లో అశోక్‌ పిల్లర్‌ వైపు వింగ్స్‌ అమర్చుతున్నారు. తక్షణం వీటిని పూర్తి చేయటంతోపాటు అశోక్‌ స్థంభం నుంచి వస్తున్న వింగ్స్‌కు వీటిని జతచేయాల్సి ఉంటుంది. కృష్ణానదిలో వింగ్స్‌ అమర్చటంతో పాటుగా వై - షేప్‌ పిల్లర్స్‌ నిర్మాణ పనులను చేపట్టాల్సి ఉంది. వై - షేప్‌ పిల్లర్ల నిర్మాణానికి ఐరన్‌ ఫ్రేమింగ్‌ను ఇప్పటికే కాంట్రాక్టు సంస్థ సిద్ధం చేసింది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 3 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...