Jump to content

DURGA GUDI FLYOVER


Recommended Posts

  • Replies 685
  • Created
  • Last Reply
Guest Urban Legend

new collector rocking le  :terrific:

rojuki chala suprise visits chestunnadu,

 

cheppadu ga ye roju etu vasthano naakey teliyadhu ani ...manollaki ila vuntey ne correct

Link to comment
Share on other sites

దుర్గగుడి ఫ్లై ఓవర్‌ పనుల్లో కీలక ఘట్టం... Super User 02 May 2017 Hits: 784  

kanakduraga-flyover-02052017.jpg
share.png

దుర్గగుడి ఫ్లై ఓవర్‌ పనుల్లో కీలక ఘట్టం శ్లాబ్‌ బిగింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఆరువరుసల ఫ్లైఓవర్ కు స్లాబ్ పనులు మొదలుపెట్టారు. చివరి ఘట్టమైన స్పైన్స అండ్‌ వింగ్స్‌ పనులు ప్రారంభమయ్యాయి. భవానిపురం కాస్టింగ్‌ డిపోలో తయారైన శ్లాబ్‌లను బిగించేందుకు వీలుగా పిల్లర్‌ టు పిల్లర్‌ దృఢమైన బారికేడ్లతో ఐరన్ డయాఫ్రమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. భారీ ట్రాలీలపై శ్లాబ్‌ విడిభాగాలను భవానీపురం నుంచి కుమ్మరిపాలెం వద్దకు తీసుకు వచ్చారు. భారీ క్రేన్ల సహాయంతో డయాఫ్రమ్‌ పైకి చేర్చటం మొదలుపెట్టారు. అక్కడ పిల్లర్‌ నుంచి పిల్లర్‌కు శ్లాబ్‌ భాగాలను కొలత ప్రకారం పిల్లర్‌ క్యాప్స్‌పై అమర్చుతున్నారు. ఇందుకోసం అత్యంత ఆధునికమైన భారీ క్రేన్లను ఉపయోగిస్తున్నారు.

ఈ అమరికలో ఏమాత్రం పొరపాటు దొర్లినా శ్లాబ్‌ భాగం కిందకు పడిపోయి విరిగిపోయే అవకాశాలున్నాయి. అందుకే ఈ పనులు చాలా కీలకమైనవి. రామవరప్పాడు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ఫ్లై ఓవర్‌ విషయంలో గతంలో జరిగిన పొరపాట్లకు ఇక్కడ తావివ్వకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ అంశంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఐరనడయా ఫ్రేమ్‌ ఏర్పాటు కూడా ఈ జాగ్రత్తలో భాగమే. ఒకవేళ వాసిలో తేడా వచ్చి.. బిగింపులో శ్లాబ్‌ భాగం కింద పడిపోకుండా ఐరన్ డ యాఫ్రమ్‌పై ఒరుగుతుంది. దీనివల్ల మళ్ళీ దానిని సవ్యంగా బిగించటానికి అవకాశం కలుగుతుంది.

 

ఇంజనీరింగ్‌ అద్భుతం..

సీతాకోక చిలుక(బటర్‌ ఫ్లై) అమరికను పోలిన సాంకేతిక విధానంలో దుర్గగుడి ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇదో ఇంజనీరింగ్‌ అద్భుతమనే చెప్పాలి. ఆరు నెలలుగా సింగిల్‌ పిల్లర్ల నిర్మాణం మాత్రమే చేపట్టడం.. ఆ పిల్లర్‌ చిన్నపాటి కాంక్రీట్‌ క్యాప్స్‌ మాత్రమే ఏర్పాటు చేయటంతో పైన డబుల్‌ లేనకు మించి అవకాశం ఉంటుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి ఇది ఆరు వరసల ఫ్లై ఓవర్‌ అన్న సంగతిని గుర్తించాలి. పిల్లర్‌ క్యాప్స్‌ రెండు వరసల శ్లాబ్‌ ఉంటుంది. అటు, ఇటు చెరో రెండు వరసలు దీనికి అటాచ అవుతాయి. ఇలా మొత్తం ఆరు లేన్లు చిన్నపాటి పిల్లర్‌ క్యాప్‌పైన ఇమిడి ఉండటం గమనార్హం. సీతాకోక చిలుక మధ్య భాగాన్ని దుర్గగుడి ఫ్లై ఓవర్‌లో మనం స్పైన్ అంటాము. స్పైన్‌లో భాగంగా మెయిన్ శ్లాబ్స్‌ అమర్చుతారు. సీతాకోక చిలుక రెక్కల మాదిరిగా.. దుర్గగుడి ఫ్లై ఓవర్‌ మధ్య భాగానికి రెండు వైపులా రెక్కల మాదిరిగా మిగిలిన శ్లాబ్‌ భాగాలను అమర్చుతారు.

ఆగష్టు 15కి పూర్తి చెయ్యాలి అని లక్ష్యం ఉన్నా, కీలకమైన పనులు, కృష్ణా నిదిలో పిల్లర్లు లాంటి క్లిష్టమైన పనులు ఉండటం వలన, తొందర పడుకుండా పనులు చేస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా నిర్మాణం పూర్తి చేసి ఫ్లైఓవర్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకోవచ్చే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు క్రింద వీడియోలో చూడవచ్చు. అలాగే పనులు జరుగుతున్న ఫోటోలు చూడవచ్చు....

Link to comment
Share on other sites

Guest Urban Legend

e four lane bridge ah starting/ending lo ah pillar(thumbnail lo pillar) meedha yeppati nuncho doubt naaku

bottle neck avvudhemo akkada ? :sleep:

 

allowing bikes on 4 lane bridge

look at that pillar at the end ...bottle neck endho ah design

Link to comment
Share on other sites

 
close.png
amaravati-logo.jpg
 

బుధవారం, మే 24, 2017

  ఆ గడువేందిరో... ఈ గొడవేందిరో! 
దుర్గగుడి పైవంతెనపై కొనసాగుతున్న సందిగ్ధత 
amr-top1a.jpg
amr-top1b.jpgఇదీ రాజధాని నగరంగా గుర్తింపు పొందిన విజయవాడలో నిర్మాణం చేపట్టిన ఆరు వరసల కనకదుర్గ పైవంతెన తీరు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పరిస్థితుల్లో ఈ వంతెనను శీఘ్రగతిన నిర్మాణం చేయాలని గుత్తేదారులను ఆదేశించింది. కానీ ఎంత త్వరగా నిర్మించాలని భావించినా అంత జాప్యం అవుతోంది. 15 ఆగస్టు 2017 ముహూర్తం తేదీని నిర్ణయించి గుత్తేదారులను, అధికారులను హడావుడి చేశారు. గత కలెక్టరు బాబు.ఎ. దీనిపై నిత్యం సమీక్షించారు. కానీ అదిసాధ్యం కాదని తేలిపోయింది. కనీసం అక్టోబరు 2నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబునాయుడు ఇటీవల రహదారుల సమీక్షలో ఆదేశించారు. కానీ తమకు గడువు మరో ఏడాది పెంచాలని గుత్త సంస్థ రహదారులు, భవనాల శాఖకు లేఖ రాసింది. ఈ వంతెన నిర్మాణాన్ని రాష్ట్ర ర.భ.శాఖలోని జాతీయ రహదారులు విభాగం పర్యవేక్షిస్తోంది. ప్రభుత్వమే లక్ష్యం నిర్దేశిస్తే గడువుపెంచాలని ఆ ప్రభుత్వానికే లేఖ రాయడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ నవరాత్రి ఉత్సవాలు అక్టోబరులో జరుగనున్నాయి. దీనికి రాష్ట్రం నలుమూలలనుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. కనీసం అప్పటికే వంతెన పూర్తి చేస్తే ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుందని భావిస్తున్నారు. కానీ వచ్చేఏడాది మార్చినాటికి గడువు కావాలని గుత్త సంస్థ కోరుతోంది. అప్పటి వరకు పూర్తయ్యే అవకాశాలు లేవని తేల్చి చెప్పినట్లు తెలిసింది.

ఎందుకు జాప్యం..! రాష్ట్రంలోనే తొలిసారి ఆరువరసలతో నిర్మాణం చేపట్టిన కనకదుర్గ వంతెన జాప్యానికి చాలా కారణాలు ఉన్నాయి. సాంకేతిక ఇబ్బందులతో పాటు కూలీల కొరత ఉన్నట్లు తెలిసింది. ఈ రెండు ప్యాకేజీల మొత్తం రూ.430కోట్లు. రోడ్డు అయిదు కిలోమీటర్లు నాలుగు వరసలు, 2.50 కిలోమీటర్లు పైవంతెన నిర్మించాల్సి ఉంది. పైవంతెన స్తంభాలు 47 నిర్మాణం చేయాల్సి ఉండగా 34 పూర్తయ్యాయి. 13 పునాదుల దశలో ఉన్నాయి. పైవంతెన స్లాబ్‌ సెగ్మెంట్‌లను ముందుగానే గొల్లపూడిలో ముందుగానే తయారు చేసి బిగించాల్సి ఉంది. ప్రస్తుతం ఒక సెగ్మెంటు పూర్తి కావచ్చింది.

మొదట ఈ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన గడువు 12 నెలలు మాత్రమే. ఇంత భారీ వంతెన రోడ్డు నిర్మాణానికి కనీసం 24 నెలలు ఉంటుంది. 2015 మే దీనికి శంకుస్థాపన జరిగింది.

మొదట ఆకృతుల రూపకల్పన జాప్యం జరిగింది. దీంతో పనులు ప్రారంభమే ఆలస్యమైంది. తర్వాత పుష్కరాల పేరుతో రెండు నెలల వరకు పనులు నిలిపివేశారు. ఇతర సాంకేతిక పనుల వల్ల, అంతర్జాతీయ మహిళా సదస్సు కోసం మరో నెల రోజులు పనులు ఆగిపోయాయయి.

రోజుకు కనీసం 300 మంది నిర్మాణ కార్మికులు పనిచేయాల్సి ఉంది. కానీ 100 మందికి మించడంలేదని తెలిసింది. అధికారులు మాఈత్రం రోజుకు 500 మందిని వినియోగించాలని చెబుతున్నారు.

ప్రస్తుతం ఇక్కడ పనిచేసేవారంతా ఒడిషా, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారు. ప్రికాస్టింగ్‌ యార్డులో పనులు చేయాల్సి ఉంది. దీనికి స్థానికులు రావడం లేదని అంటున్నారు. దీనివల్ల ప్రధానంగా జాప్యం జరుగుతున్నట్లు చెబుతున్నారు.

సిమెంటు, స్టీలు కొరత ఉన్నట్లు తెలిసింది. ఒప్పందం ప్రకారం సరఫరా చేయాల్సిన సిమెంటు అందడం లేదు. ప్రస్తుతం ధరలు పెరిగాయి. కానీ గుత్త సంస్థకు పాత ధరకే ఇవ్వాల్సి ఉంది. దీన్ని విస్మరిస్తున్నారు. సక్రమంగా సరఫరా లేదు.

నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద కాలువ వరకు గోడ నిర్మాణం చేయాల్సి ఉండగా దాన్ని మార్చి వయా డక్టు తరహాలో ఫిల్లర్లతో కట్టాలని ఆకృతులు మార్చి కేంద్రానికి ప్రతిపాదించారు. దీనికి రూ.19కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తుందని ప్రతిపాదించారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఇక్కడ అండర్‌పాస్‌ నిర్మించాల్సి ఉంది. పిల్లర్లు వేసి వయాడక్టు తరహాలో నిర్మాణం చేయనున్నారు. దీని ఆకృతులు ఖరారైతే కానీ నిర్మాణం ప్రారంభించే అవకాశం లేదు. మరో అండర్‌పాస్‌ రాజీవ్‌ పార్కు సమీపంలో నిర్మించాలి. ఇక్కడ విద్యుత్తు లైనుకు సంబంధించిన హెచ్‌టీ టవర్‌ అడ్డుగా ఉంది. దీన్ని తొలగించి నిర్మాణం చేయాల్సి ఉంది. దీనికి రూ.4.94 కోట్లు అవసరమని ప్రతిపాదించారు.

పైవంతెన ఆరు ప్రధాన పిల్లర్ల ఆకృతులు ఖారారు కావాల్సి ఉంది. కమాండ్‌ కంట్రోల్‌ రూం దగ్గర ఒకటి.. కాలువలో రెండు, నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో రెండు, ప్రధాన ఫిల్లర్‌ ఒకటి ఆకృతులు ఖరారు కావాల్సి ఉంది. నదిలో, కాలువలో నిర్మాణం చేసే వీటి ఆకృతులను విదేశీ సంస్థతో రూపొందించి పరిశీలనకు పంపారు.

ఇటీవల కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం సమీక్షించడంతో పారావంతెన ప్రారంభించారు. వాహనాలను అనుమతిస్తున్నారు. ఒక వైపు వాహనాలు వెళుతున్నాయి. ఫిల్లర్ల మధ్య గడ్డర్లను ఏర్పాటు చేసి వంతెన పోర్షన్ల స్లాబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

అక్టోబరు నాటికి పూర్తి! 
దీనిపై జిల్లా కలెక్టరు బి.లక్ష్మీకాంతం ‘ఈనాడు’తో మాట్లాడుతూ ఆగస్టునాటికి పూర్తి చేయాలని మొదట నిర్ణయించామన్నారు.కానీ కార్మికుల కొరత, సాంకేతిక సమస్యల వల్ల అక్టోబరు నాటికి పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. కార్మికులను అధికంగా పెట్టాలని సూచించామని వివరించారు. ప్రతి వారం సమీక్షించి గడువులోగా పూర్తి చేస్తామని చెప్పారు. ఇతర సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు తగిన విధంగా కృషి చేసి త్వరితగతిన అనుమతులు వచ్చే విధంగా చూస్తామన్నారు. దసరా ఉత్సవాల నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు.

 
 
 
jillalu.png
Link to comment
Share on other sites

Guest Urban Legend

latest clear video from yesterday, almost entire stretch covered

asusual slow progress ..ah road extension bridge complete chesi manchi pani chesaru

next summer ki aina avvali ani praying

 

Link to comment
Share on other sites

Flyover beams pre-casting position..Edo okati late ayina mundu avutundi....

 

A Gammon gadi road matram CBN tagulukovali malli. Last time AP state contractotr marchandi ante Gadkari gadu ledu valle chespataru ani oka 1 week malli tipparlu tipparu.....mallli week taruvata gayab....

 

 

Link to comment
Share on other sites

ఆకర్షణీయంగా కనకదుర్గమ్మ వారధి కూడలి
 
 
636319062142414694.jpg
  • అమరావతి ముఖ ద్వారాల్లో ఇది ప్రముఖం
  • రెండు నమూనాలను సిద్ధం చేసిన అధికారులు
కనకదుర్గమ్మ వారధి జంక్షన్ ను సుందరంగా తీర్చిదిద్దేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రెండు డిజైన్లను సిద్ధం చేశారు. ఒకటి అమరావతి చారిత్రక వారసత్వాన్ని, బౌద్ధమతానికి దర్పణం పట్టనుండగా, మరొకటి సుందర ఉద్యానవనాన్ని తలపించేలా ఉన్నాయి. వీటిల్లో ఒక దానిని ఖరారు చేసి త్వరలో పనులు ప్రారంభించనున్నారని సమాచారం.(ఆంధ్రజ్యోతి, అమరావతి): రాజధాని అమరావతికి దారి తీసేందుకు మాస్టర్‌ప్లానలో ప్రతిపాదించిన వివిధ దిశల్లోని ముఖ ద్వారాల్లో విజయవాడ కనకదుర్గమ్మ కూడలి అత్యంత ముఖ్యమైనది. ఇక్కడే చెన్నై, కోల్‌కతా, మచిలీపట్నం, హైదరాబాద్‌ల వైపు నుంచి వివిధ జాతీయ రహదారుల మీదుగా వచ్చే వాహనాలు కలుసుకుని తమ గమ్యస్థానాలకు వెళ్తాయి. విజయవాడ పరిసరాల్లోని పలు ప్రదేశాల నుంచి గుంటూరు, తెనాలి, అమరావతి తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాలకూ ఇదే కూడలి. దీంతో ఈ జంక్షన నిత్యం ఎంతో రద్దీగా ఉంటుంది. ఈమధ్యనే ఈ కూడలిలో గుంటూరు వైపు రాకపోకలు సాగించే వాహనాలు నేరుగా వారధిని చేరుకునేందుకు వీలుగా కృష్ణలంక వైపు నుంచి ఒక ఫ్లైవోవర్‌ను నిర్మించారు. ఈ జంక్షనలో అప్పటికే ఉన్న రహదారులకు మధ్యన సువిశాలమైన ట్రాఫిక్‌ ఐల్యాండ్లు ఏర్పడ్డాయి. వీటిల్లో పచ్చదనాన్ని పెంచేందుకు గతంలో ప్రయత్నాలు జరిగినప్పటికీ వాటిల్లోని మొక్కలు పశువుల బారిన పడి, నామరూపాలు లేకుండా పోవడంతోట్రాఫిక్‌ ఐల్యాండ్లన్నీ కళావిహీనంగా కనిపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి ఆదేశాలతో..
రాజధానికి దారి తీసే అన్ని ముఖద్వారాలనూ అత్యంత ఆకర్షణీయంగా రూపొందించాలని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు సందర్భాల్లో అధికారులను ఆదేశించారు. స్పందించిన ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్ధసారథి విజయవాడలోని కనకదుర్గమ్మ వారధి జంక్షనను ముందుగా అభివృద్ధి పరచాలని నిర్ణయించారు. ఏడీసీ అధికారులు, కన్సల్టెంట్ల సమష్టి కృషితో రెండు డిజైన్లు సిద్ధమయ్యాయి.
బౌద్ధానికి ప్రతీకగా ఒకటి..
పచ్చదనంతో ఇంకొకటి..
ఏడీసీ రూపొందించిన రెండు డిజైన్లూ వారధి జంక్షన వద్ద ఉన్న ట్రాఫిక్‌ ఐల్యాండ్లను హరిత శోభితంగా మార్చేవే. ఒకటి గతంలో బౌద్ధానికి సూచికగా భారీ ధర్మచక్రం, ఇతర ఆకర్షణలతో కూడి ఉంది. ఈ నమూనాలో వలయాకారంలో ఉన్న స్థూపంపై పురాతన శిల్పకళను ప్రతిబింబించే మందిరాల మధ్య ధర్మచక్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ స్థూపం చుట్టూ ఆకట్టుకునే పలు రకాల క్రోటన్లు, పూలమొక్కలతోపాటు అక్కడక్కడ పెద్ద చెట్లను సైతం పెంచుతారు. సందర్శకులు నడిచేందుకు వీలుగా వాకింగ్‌ టైల్స్‌తో కూడిన బాటలను ఏర్పాటు చేస్తారు. రెండో డిజైనలో కేవలం చక్కటి పచ్చిక బయళ్లూ, వాటి మధ్యన చెట్ల వరుసలూ మాత్రమే ఉంటాయి. ఈ లాన్లను కూడా ఆకుపచ్చ రంగులో మాత్రమే కాకుండా వివిధ వర్ణాల్లో ఉండే క్రోటన్లు, ఇతర మొక్కలతో రంగురంగుల్లో ఉండేలా చూస్తారు. ట్రాఫిక్‌ ఐల్యాండ్ల స్వరూపానికి అనుగుణంగా పచ్చిక బయళ్లను చక్కటి ఆకృతుల్లో అభివృద్ధి పరుస్తారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...