Jump to content

DURGA GUDI FLYOVER


Recommended Posts

Single pillar meeda six lane road aaa :atwitsend:

 

Design vadulu :blink:

monna andhulo work chese maa relative kaliste chepparu..mumbai lo single pillar meedha four lane vundhanta..ikkademo six lane road..anni hurdles ni daatukunta vastundhi le..no worries..
Link to comment
Share on other sites

  • Replies 685
  • Created
  • Last Reply
  • 2 weeks later...

flyover 6 lanes. kinda 4 lanes. flyover inka pillars stage lo ne vundhi

ila lanes wise kakunda..measurements wise...flyover width entha ani doubt...and at present india lo highest width flyover with single pillar entha anedi asking..!!
Link to comment
Share on other sites

Guest Urban Legend

e four lane bridge ah starting/ending lo ah pillar(thumbnail lo pillar) meedha yeppati nuncho doubt naaku

bottle neck avvudhemo akkada ? :sleep:

Link to comment
Share on other sites

  • 2 weeks later...
కీలక దశలో ఫ్లై ఓవర్ పనులు
 
636280152868101087.jpg
  • స్పైన్స్, వింగ్స్‌ పనులు ప్రారంభం
  • పిల్లర్లపై శ్లాబులు ఎక్కించేందుకు భారీగా ఏర్పాట్లు
  • నాలుగు రోజుల్లో కాస్టింగ్‌ డిపో నుంచి రానున్న శ్లాబులు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): దుర్గగుడి ఫ్లై ఓవర్‌ పనుల్లో కీలక ఘట్టం శ్లాబ్‌ బిగింపు ప్రక్రియ ప్రారంభమైంది. చివరి ఘట్టమైన స్పైన్స అండ్‌ వింగ్స్‌ పనులు ప్రారంభమయ్యాయి. కాస్టింగ్‌ డిపోలో తయారైన శ్లాబ్‌లను బిగించేందుకు వీలుగా పిల్లర్‌ టు పిల్లర్‌ దృఢమైన బారికేడ్లతో ఐరన్ డయాఫ్రమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. భారీ ట్రాలీలపై శ్లాబ్‌ విడిభాగాలను భవానీపురం నుంచి కుమ్మరిపాలెం వద్దకు తీసుకు వచ్చిన తర్వాత.. భారీ క్రేన్ల సహాయంతో డయాఫ్రమ్‌ పైకి చేరుస్తారు. అక్కడ పిల్లర్‌ నుంచి పిల్లర్‌కు శ్లాబ్‌ భాగాలను కొలత ప్రకారం పిల్లర్‌ క్యాప్స్‌పై అమర్చుతారు. ఈ అమరికలో ఏమాత్రం పొరపాటు దొర్లినా శ్లాబ్‌ భాగం కిందకు పడిపోయి విరిగిపోయే అవకాశాలున్నాయి. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ఫ్లై ఓవర్‌ విషయంలో గతంలో జరిగిన పొరపాట్లకు ఇక్కడ తావివ్వకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ అంశంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఐరనడయా ఫ్రేమ్‌ ఏర్పాటు కూడా ఈ జాగ్రత్తలో భాగమే. ఒకవేళ వాసిలో తేడా వచ్చి.. బిగింపులో శ్లాబ్‌ భాగం కింద పడిపోకుండా ఐరన్ డ యాఫ్రమ్‌పై ఒరుగుతుంది. దీనివల్ల మళ్ళీ దానిని సవ్యంగా బిగించటానికి అవకాశం కలుగుతుంది.
 
 
ఇంజనీరింగ్‌ అద్భుతం..
సీతాకోక చిలుక(బటర్‌ ఫ్లై) అమరికను పోలిన సాంకేతిక విధానంలో దుర్గగుడి ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇదో ఇంజనీరింగ్‌ అద్భుతమనే చెప్పాలి. ఆరు నెలలుగా సింగిల్‌ పిల్లర్ల నిర్మాణం మాత్రమే చేపట్టడం.. ఆ పిల్లర్‌ చిన్నపాటి కాంక్రీట్‌ క్యాప్స్‌ మాత్రమే ఏర్పాటు చేయటంతో పైన డబుల్‌ లేనకు మించి అవకాశం ఉంటుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి ఇది ఆరు వరసల ఫ్లై ఓవర్‌ అన్న సంగతిని గుర్తించాలి. పిల్లర్‌ క్యాప్స్‌ రెండు వరసల శ్లాబ్‌ ఉంటుంది. అటు, ఇటు చెరో రెండు వరసలు దీనికి అటాచ అవుతాయి. ఇలా మొత్తం ఆరు లేన్లు చిన్నపాటి పిల్లర్‌ క్యాప్‌పైన ఇమిడి ఉండటం గమనార్హం. సీతాకోక చిలుక మధ్య భాగాన్ని దుర్గగుడి ఫ్లై ఓవర్‌లో మనం స్పైన్ అంటాము. స్పైన్‌లో భాగంగా మెయిన్ శ్లాబ్స్‌ అమర్చుతారు. సీతాకోక చిలుక రెక్కల మాదిరిగా.. దుర్గగుడి ఫ్లై ఓవర్‌ మధ్య భాగానికి రెండు వైపులా రెక్కల మాదిరిగా మిగిలిన శ్లాబ్‌ భాగాలను అమర్చుతారు.

కృష్ణా కెనాల్‌, కృష్ణానదిలో బ్యాలెన్స పనులు షురూ

మరో మూడు పిల్లర్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. నిన్నటి వరకు కృష్ణా తూర్పు ప్రధాన కాల్వలో నీరు ప్రవహిస్తుండటం వల్ల వీలుపడలేదు. ప్రస్తుతం వేసవి కావటం.. కాలువను కట్టేయడంతో కాలువలో పిల్లర్‌ పనులను సమాంతరంగా చేపడుతున్నారు. కృష్ణానదిలో మరో రెండు పిల్లర్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. వీటి పనులను కూడా శ్లాబ్‌ పనులతో సమాంతరంగా చేపట్టాలని నిర్ణయించారు.
 
 
నూతన సంవత్సరారంభానికి ఫ్లై ఓవర్‌
నూతన సంవత్సరం(2018) ఆరంభానికి ముందుగా దుర్గగుడి ఫ్లైఓవర్‌ పూర్తిస్థాయిలో సిద్ధం కానున్నది. ఫ్లై ఓవర్‌ను ఆరునెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించి ప్రజల్లో అభాసుపాలైన కృష్ణాజిల్లా యంత్రాంగం ఆగస్టు 15న ప్రారంభిస్తామని మళ్ళీ గందరగోళ ప్రకటనలు చేస్తోంది. వాస్తవానికి పిల్లర్‌ క్యాప్స్‌పై శ్లాబ్‌పనులు పూర్తి చేయటానికి కనీసం ఎనిమిది నెలల సమయం పడుతుందని విశ్వసనీయ సమాచారం. డిసెంబర్‌ నాటికి పూర్తయ్యే అవకాశం ఉన్నందున నూతన సంవత్సరంలో దుర్గగుడి ఫ్లైఓవర్‌ను రాష్ట్ర ప్రభుత్వం వేడుకలా ప్రారంభించనుంది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...