Jump to content

DURGA GUDI FLYOVER


Recommended Posts

  • Replies 685
  • Created
  • Last Reply
Guest Urban Legend

Cheppinanta easy kadu ilanti constructions...it would take time...need to be patient if you want  quality product

 

cool...

mundhu telusu ga ivvani..atleast design change chesinappudu aina  :peepwall:

 

and once completed as collector said super ga vuntadhi ...

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...
దుర్గా ఫ్లై ఓవర్‌ యూటీ డిజైన్‌లో మార్పులు
 
636208448003310902.jpg
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): దుర్గా ఫ్లైఓవర్‌ అనుసంధాన యూటీ పనుల డిజైన్ల మార్పునకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రానికి నివేదించింది. యూటీకి రెండు వైపులా అప్రోచ పనులను గోడకట్టి మట్టితో నింపే బదులు స్లాబ్‌ విధానం విషయమై డిజైన్ల మార్పునకు ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల పుష్కరాల సందర్భంలో ఘాట్ల పర్యవేక్షణకు వచ్చినపుడు యూటీ పనులను పరిశీలించారు. ఇటీవలి కాలంలో దుర్గా ఫ్లై ఓవర్‌, నాలుగు లేన్ల రోడ్ల విస్తరణకు సంబంధించి ఆయన సమీక్షించారు.
 
            యూటీ పనులు పూర్తయిన నేపథ్యంలో అప్రోచ్ పనులకు స్టేట్‌ హైవేస్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. యూటీకి రెండువైపులా అప్రోచ్ పనులు చేపట్టాల్సి ఉంది. అప్రోచలకు ముందుగా వాల్స్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మట్టిని పోసి వైబ్రేషన ఇచ్చిన తర్వాత హాట్‌మిక్స్‌, వెట్‌మిక్స్‌ వేసిన తర్వాత బీటీ వేయాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల కింద ఉన్న ప్రాంతం అంతా మూసుకుపోతోంది. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా సూచించారు. అప్రోచను శ్లాబ్‌ పద్ధతిలో వేయాలని సూచించారు. శ్లాబ్‌ పద్ధతిలో దిగువ మూసుకు పోవటం ఉండదు. పిల్లర్లు ఉండటంతో ఆ ప్రాంతం అంతా ఖాళీగా ఉంటుంది.
 
స్థలం వినియోగానికి సీఎం ప్రతిపాదన
శ్లాబ్‌ ప్రతిపాదన వెనుక ముఖ్యమైన విషయమే ఉంది. ప్రకాశం బ్యారేజీ నుంచి కనకదుర్గ వారధి వరకు కృష్ణానది వెంట రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు పనుల్లో భాగంగా ముందుగా ఘాట్ల నిర్మించారు. మిగిలిన దశల్లో అనేక పనులు నిర్వహించాల్సి ఉంది. దసరా ఉత్సవాలు, మ్యూజిక్‌ ఫెస్టివల్స్‌, ఇతరత్రా కార్యక్రమాలను ఇటీవల కాలంలో ఘాట్ల దగ్గరే నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో యూటీ పరిధిలోకి వచ్చే ప్రాంతం అనేక అవసరాలకు ఉపయోగపడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అందరూ ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకోవటానికి వీలుగా, ఘాట్లకు వెళ్ళేవారికి ఇబ్బంది కలగకుండా ఉండటానికి అప్రోచలను శ్లాబ్‌ విధానంలో వేయాలని సీఎం సూచించారు. దీంతో ప్రతిపాదనను కేంద్రానికి కూడా పంపించారు. డిజైన్లను మార్చటం వల్ల కొంత అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉంది. అనుమతులు రావటానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
 
కృష్ణలంక ఫైర్‌ స్టేషన్ అప్రోచ్ పనులకు రెడీ
కృష్ణలంక జాతీయ రహదారిపై అండర్‌ టన్నెల్‌ (యూటీ) పనులు పూర్తయ్యాయి. యూటీకి అనుబంధంగా కింద వాల్‌నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ వాల్‌ నిర్మాణ పనులు పూర్తి చేయాలంటే ట్రాఫిక్‌ లేకుండా ఉండాలి. ట్రాఫిక్‌ లేకుండా చేయాలంటే అప్రోచ పనులను పూర్తిచేయాల్సి ఉంది. ఇప్పటికే అప్రోచ పనులను చేపట్టారు. త్వరలో అప్రోచ పనులు పూర్తి చేసి రాకపోకలకు అనుమతించనున్నారు. పైన రాకపోకలు సాగుతున్న సందర్భంలో కింద యూటీ మార్గంలో వాల్‌ నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తారు.

 
ఫిబ్రవరి నాటికి పిల్లర్లు పూర్తి
వచ్చే నెలాఖరు నాటికి మిగిలిన మూడు పిల్లర్ల నిర్మాణం పూర్తి కానుంది. కృష్ణానదిలో ఒక పిల్లర్‌ పెండింగ్‌లో ఉంది. కృష్ణా కెనాల్‌లో రెండు పిల్లర్లు వేయాల్సి ఉంది. కాల్వను కట్టేసిన తర్వాత ఈ రెండు పిల్లర్ల పనులు చేపట్టనున్నారు. పిల్లర్ల నిర్మాణం పూర్తయిన తర్వాత మార్చిలో శ్లాబ్‌ పనులు చేపట్టటానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
క్షేత్రస్థాయి పరిశీలన తర్వాతే గడువు పెంపు
దుర్గా ఫ్లై ఓవర్‌ పనులు పూర్తి చేసేందుకు మరో ఆరు నెలల సమయాన్ని కోరిన కాంట్రాక్టు సంస్థ ‘సోమా’ ప్రతిపాదనను స్టేట్‌ హైవేస్‌ ఇంజనీరింగ్‌ అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. ఇంజనీరింగ్‌ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తర్వాత సహేతుకమని అనిపిస్తే అథారిటీకి సిఫార్సు చేస్తారు. అప్పుడు స్టేట్‌ హైవేస్‌ నుంచి ప్రభుత్వానికి గడువు పెంపునకు ప్రతిపాదన వస్తుంది.
Link to comment
Share on other sites

Guest Urban Legend

good,atlast ki complete avutundi

Adhi river loki 4 Lane road extension at Temple....flyover kaadhu

But part of this project

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...