Jump to content

AP Government’s transitional headquarters


sonykongara

Recommended Posts

  • 3 weeks later...
సచివాలయ సుందరీకరణకు రూ. 4 కోట్లు
 
అమరావతి: వెలగపూడిలోని సచివాలయ భవనాలను సుందరం గా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. సచివాలయ ప్రాంగణంలో ఉన్న ఐదు భవనాలను మరింత సుందరంగా చేసేందుకు అంచనాలు రూపొందిస్తోంది. చిన్న చిన్న పనులు చేయడం ద్వారా సుందరంగా తీర్చిదిద్దుతారు. భవనాల ముందు భాగంలో కొంత, పై భాగంగా కొంత, అవసరమైన చోట్ల కొంత భాగాలను సుందరీకరణ చేయడం ద్వారా మొత్తం భవనాలను ఆకర్షణీయంగా తయారుచేయాలని సీఆర్‌డీఏ సంకల్పించింది. ఇందుకోసం రూ.4 కోట్ల నిధులను కేటాయించింది. సీఎం కార్యాలయం ఉండే భవనంతో సహా మంత్రులుండే మిగతా నాలుగు భవనాల్లోను ఈ సుందరీకరణ పనులు చేపడతారు.
Link to comment
Share on other sites

తాత్కాలిక సచివాలయానికి కళాత్మక హంగులు
 
636312959045050960.jpg
(ఆంధ్రజ్యోతి, అమరావతి)
వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ సముదాయాన్ని అతి స్వల్ప వ్యవధిలో నిర్మించి, ఘనకీర్తిని పొందిన సీఆర్డీయే దానికి కళాత్మక హంగులను సమకూర్చడం ద్వారా మరింత ఆకర్షణీయంగా మలచేందుకు చర్యలు తీసుకుంటోంది. 6 లక్షల చదరపుటడుగుల విస్తీరం కలిగిన ఈ కాంప్లెక్స్‌లో ముఖ్యమంత్రి, మంత్రులు సహా సెక్రటేరియట్‌ అధికారవ్యవస్థ సౌకర్యవంతంగా పని చేసుకునేందుకు అవసరమైన సకల ఆధునిక వసతులు కల్పించిన విషయం విదితమే. అంతవరకూ బాగానే ఉన్నా నిత్యం సామాన్యులు మొదలుకుని ప్రముఖుల వరకు ఎందరెందరో వివిధ పనులపై సందర్శించే ఈ కాంప్లెక్స్‌ మరీ సాదాసీదాగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సచివాలయంలోని వివిధ బ్లాక్‌లను వివిధ కళాకృతులతో అలంకరించాలని సీఆర్డీయే నిర్ణయించింది. తరతరాలుగా రాజధాని ప్రాంతంతోపాటు రాష్ట్రంలోని పలు ప్రదేశాల్లో విలసిల్లిన సంస్కృతీ సంప్రదాయాలు, చరిత్రకు అద్దం పట్టేలా ఇవి ఉండాలన్నది సీఆర్డీయే అభిప్రాయంగా తెలుస్తోంది. అదే సమయంలో అధునాతన కళాత్మక రూపాలకూ తాత్కాలిక సచివాలయంలో స్థానం కల్పించే ప్రతిపాదన కూడా ఉందని తెలిసింది. మొత్తం రూ.2.49 కోట్ల అంచనా వ్యయంతో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఈ సంస్థ సదరు మొత్తంతో వాటి రూపకల్పన నుంచి సరఫరా, అమర్చాలనుకుంటోంది. వీటిని చేపట్టాలనే ఆసక్తి ఉన్న వ్యక్తులు, సంస్థల నుంచి టెండర్లు కోరిన సీఆర్డీయే వాటి దాఖలుకు జూన 8వ తేదీ వరకూ గడువునిచ్చింది.
 ట్రాఫిక్‌ ఐలాండ్లు, గ్రీనరీ నిర్వహణకు..
విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లే మార్గమధ్యలో జాతీయ రహదారిని కోట్లాది రూపాయల వ్యయంతో సుందరీకరించిన సీఆర్డీయే దాని నిర్వరణకు సంబంధించిన టెండర్లను కూడా ఆహ్వానించింది. రామవరప్పాడు రింగ్‌ వద్ద హైవేకు, గతేడాది అందుబాటులోకి తెచ్చిన ఇన్నర్‌ రింగ్‌రోడ్డుకు మధ్యన రైవస్‌ కాలువ కట్టతోపాటు అదే ప్రాంతంలో ఉన్న 3 ట్రాఫిక్‌ ఐలాండ్లలో పచ్చదనం అభివృద్ధి, నిర్వహణకు రూ.32.25 లక్షలతో టెండర్లను పిలిచింది.
గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి రామవరప్పాడు రింగ్‌ వరకు చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి మధ్యన, ఇరుపక్కలా దాదాపు 1278 సిమెంట్‌ కుండీల్లో ఇప్పటికే అభివృద్ధి చేసిన పచ్చదనం నిర్వహణకు మరొక రూ.10.78 లక్షల అంచనా వ్యయంతో బిడ్లను కోరింది. ఈ రెండు పనులకు సంబంధించిన టెండర్ల దాఖలుకు వచ్చే నెల 1వ తేదీ వరకూ గడువునిచ్చింది.
 
 సీఎస్‌ నివాసం కోసం..
రూ.2.50 కోట్లతో విజయవాడలో నిర్మించదలచిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) అధికారిక నివాసం, క్యాంపు కార్యాలయం కోసం కూడా సీఆర్డీయే టెండర్లు పిలిచింది. వీటి సమర్పణకు వచ్చే నెల 2వ తారీఖును గడువుగా పేర్కొంది.
Link to comment
Share on other sites

  • 3 weeks later...

బుల్లి చెట్టు.. గొడుగు పట్టు

4Yn72Ei.jpg

 

వెలగపూడి సచివాలయం పరిసరాలను సుందరీకరించేందుకు సీఆర్‌డీఏ అధికారులు చైనా నుంచి బొన్సాయ్‌ మొక్కలను తెప్పించారు. సుమారు రూ.3 కోట్లు వెచ్చించి తీసుకొచ్చిన వీటిని మొత్తం 16 ఎకరాల్లో నాటారు. తీరా ఈ చెట్లను నాటిన తర్వాత తెలిసింది ఎండలకు ఎక్కువగా వాడు పడుతున్నాయని. అందుకే వాడిపోకుండా ఇలా గూడులాగా వలలతో రక్షణ చర్యలు చేపట్టారు.

Link to comment
Share on other sites

  • 4 weeks later...

సచివాలయానికి మరో రెండు ద్వారాలు
వాస్తు దృష్ట్యా మార్పులు
tem3.jpg

ఈనాడు అమరావతి: వెలగపూడిలోని సచివాలయానికి ఉత్తరం వైపు మరో రెండు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం బుధవారం కొంత మేర గోడ కూలగొట్టారు. వాస్తు దృష్ట్యా చేస్తున్న మార్పుల్లో భాగంగా కొత్తగా ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు శాసనసభ ఆవరణలోకి ప్రవేశించేందుకు కూడా మరో ద్వారం ఏర్పాటు చేస్తున్నారు. సచివాలయం ఆవరణలోకి ప్రవేశించేందుకు ప్రస్తుతం తూర్పు వైపు రెండు ద్వారాలు, దక్షిణంవైపు ఒక ద్వారం, పడమర దిక్కుకి మరో ద్వారం ఉన్నాయి. వాస్తు నిపుణుల సూచన మేరకు ప్రస్తుతం ఉత్తరంవైపు కూడా రెండు ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. సచివాలయం ఆవరణకు వెలుపల ఉత్తరం వైపు ఒక రహదారిని కూడా నిర్మించనున్నారు. ప్రస్తుతం సచివాలయానికి మూడు పక్కలా రహదారులున్నాయి. నాలుగోవైపు కూడా రహదారి నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇది వరకు తూర్పు వైపున ఉన్న ఒకటో నెంబరు గేటు ద్వారా సచివాలయంలోకి ప్రవేశించేవారు. ఇటీవల ఆయన రెండో నెంబరు ప్రవేశ ద్వారం ద్వారా వస్తున్నారు. వాస్తు దృష్ట్యానే ఈ మార్పు చేసినట్టు సమాచారం. శాసనసభ ఆవరణలోకి ప్రవేశించేందుకు ప్రస్తుతం ఈశాన్య దిక్కున ఉన్న గేటుకి అభిముఖంగా వాయవ్య మూలన మరో గేటు ఏర్పాటు చేయనున్నారు.

రాష్ట్ర వార్తలు
Link to comment
Share on other sites

బాబు కట్టిన అమరావతికి టికెట్‌ ఇవ్వండి!

26-07-2017 02:39:36
 
  • బస్‌ కండక్టర్‌ను అడిగిన రైతు
 
అమరావతి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): సచివాలయానికి వచ్చి తమ కష్టాలపై వినతిపత్రం ఇచ్చేందుకు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు విజయవాడ వచ్చారు. విజయవాడ బస్టాండ్‌లో దిగి... పంచారామాల్లో ఒకటైన ‘అమరావతి’కి వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఎక్కడికి వెళ్లాలి అని కండక్టర్‌ అడగ్గానే... ‘అమరావతికి ఒక టికెట్‌’ అని రైతు వందనోటు తీసిచ్చారు. 35 రూపాయల టికెట్‌తోపాటు 65 చిల్లరను కండక్టర్‌ ఇచ్చారు. ‘అదేమిటి... అమరావతి టికెట్‌ 26 రూపాయలే కదా’ అని రైతు ప్రశ్నించారు. కాదు... 35 అని కండక్టర్‌ అన్నారు.
 
‘లేదయ్యా! మా ఊళ్లో వాళ్లు చెప్పారు. విజయవాడ నుంచి అమరావతికి టికెట్‌ 26 రూపాయలే’ అని ఆ రైతు గట్టిగా చెప్పారు. కండక్టర్‌ కొంత అయోమయంలో పడ్డారు. ‘ఇంతకీ ఏ అమరావతికి వెళ్లాలి?’ అని ప్రశ్నించడంతో... ‘అదేనయ్యా... చంద్రబాబు కట్టిన అమరావతికి’ అని రైతు బదులిచ్చారు. కండక్టర్‌కు అసలు విషయం అర్థమైంది. ‘‘మీరు వెళ్లాల్సింది వెలగపూడికి. అక్కడే సచివాలయం ఉంది. అక్కడికైతే టికెట్‌ 26 రూపాయలే’’ అని రైతుకు వివరంగా చెప్పారు. డిజైన్లు, నమూనాలు, సర్కారు వారి ప్రకటనలతో ‘అమరావతి’ సామాన్య ప్రజల్లోకి బలంగా వెళ్లిందనేందుకు ఇదో నిదర్శనం. అమరావతిపై ఏర్పడిన అంచనాలకూ ఈ సంఘటన అద్దం పడుతోంది!
Link to comment
Share on other sites

 

బాబు కట్టిన అమరావతికి టికెట్‌ ఇవ్వండి!

26-07-2017 02:39:36
 
  • బస్‌ కండక్టర్‌ను అడిగిన రైతు
 
అమరావతి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): సచివాలయానికి వచ్చి తమ కష్టాలపై వినతిపత్రం ఇచ్చేందుకు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు విజయవాడ వచ్చారు. విజయవాడ బస్టాండ్‌లో దిగి... పంచారామాల్లో ఒకటైన ‘అమరావతి’కి వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఎక్కడికి వెళ్లాలి అని కండక్టర్‌ అడగ్గానే... ‘అమరావతికి ఒక టికెట్‌’ అని రైతు వందనోటు తీసిచ్చారు. 35 రూపాయల టికెట్‌తోపాటు 65 చిల్లరను కండక్టర్‌ ఇచ్చారు. ‘అదేమిటి... అమరావతి టికెట్‌ 26 రూపాయలే కదా’ అని రైతు ప్రశ్నించారు. కాదు... 35 అని కండక్టర్‌ అన్నారు.
 
‘లేదయ్యా! మా ఊళ్లో వాళ్లు చెప్పారు. విజయవాడ నుంచి అమరావతికి టికెట్‌ 26 రూపాయలే’ అని ఆ రైతు గట్టిగా చెప్పారు. కండక్టర్‌ కొంత అయోమయంలో పడ్డారు. ‘ఇంతకీ ఏ అమరావతికి వెళ్లాలి?’ అని ప్రశ్నించడంతో... ‘అదేనయ్యా... చంద్రబాబు కట్టిన అమరావతికి’ అని రైతు బదులిచ్చారు. కండక్టర్‌కు అసలు విషయం అర్థమైంది. ‘‘మీరు వెళ్లాల్సింది వెలగపూడికి. అక్కడే సచివాలయం ఉంది. అక్కడికైతే టికెట్‌ 26 రూపాయలే’’ అని రైతుకు వివరంగా చెప్పారు. డిజైన్లు, నమూనాలు, సర్కారు వారి ప్రకటనలతో ‘అమరావతి’ సామాన్య ప్రజల్లోకి బలంగా వెళ్లిందనేందుకు ఇదో నిదర్శనం. అమరావతిపై ఏర్పడిన అంచనాలకూ ఈ సంఘటన అద్దం పడుతోంది!

 

:super:

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 1 month later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...