Jump to content

AP Government’s transitional headquarters


sonykongara

Recommended Posts

సచివాలయ తరలింపు ముహూర్తం షాట్‌కు రంగం సిద్ధం
 
636027671472508347.jpg
  • మధ్యాహ్నం 2.59 గంటలకు 5వ బ్లాక్‌ ప్రారంభ ముహూర్తం 
హైదరాబాద్‌, అమరావతి, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): సచివాలయ తరలింపు ముహూర్తం షాట్‌కు రంగం సిద్ధమైంది. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం ఐదో బ్లాక్‌లోని కింది అంతస్తును బుధవారం మధ్యాహ్నం 2.59 గంటలకు లాంఛనంగా ప్రారంభిస్తారు. మొదటి దశలో తాత్కాలిక సచివాలయానికి వెళ్లనున్న వైద్య ఆరోగ్యశాఖ, గృహ నిర్మాణ శాఖ, కార్మిక శాఖ, పంచాయతీరాజ్‌ శాఖల కార్యాలయాలను సంబంధిత శాఖల మంత్రులు అక్కడ ప్రారంభిస్తారు. అనంతరం సచివాలయ ఉద్యోగులు మంత్రుల సమక్షంలో లాంఛనంగా విధులు నిర్వర్తించనున్నట్లు సమాచారం. ఈ మేరకు 28gnt35.jpgగ్రౌండ్‌ఫ్లోర్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 50 చదరపుటడుగుల విస్తీర్ణంలో ఉద్యోగుల కోసం చాంబర్లు సిద్ధమయ్యాయి. వాటికి ఫాల్స్‌ సీలింగ్‌ చేసి లైట్లు అమర్చారు. ఏసీలు నిరంతరం పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. అలాగే, ఉన్నతాధికారులకు ప్రత్యేక చాంబర్లు నిర్మించారు. ప్రతి శాఖ అధికారి చాంబర్‌కు పక్కనే కంప్యూటర్‌ ఆపరేటర్ల గదులు నిర్మించారు. ఇతర సెక్షన్‌ ఉద్యోగులకు హాల్‌లో చాంబర్లు ఏర్పాటు చేశారు. వాటిలో బుధవారం ఉదయానికల్లా టేబుళ్లు వేసి, కంప్యూటర్లను అమర్చనున్నారు. ఫ్లోర్‌ చుట్టూ అద్దాల తలుపులు, కిటికీలు అమర్చారు. సచివాలయానికి నిరంతరం విద్యుత సరఫరా అయ్యేలా ప్రాంగణంలోనే పవర్‌ షిఫ్టింగ్‌ స్టేషన్‌ను నిర్మించారు. ఐదో బ్లాక్‌ వరకూ ప్రస్తుతానికి మందడం సబ్‌స్టేషన్‌ నుంచి మంగళవారం సాయంత్రం విద్యుత సరఫరా ఇచ్చారు. విజయవాడ నుంచి ఇక్కడికి చేరుకునే ఉద్యోగుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా ఐదు మెట్రో బస్సులను ఏర్పాటు చేసింది. ఇవి తాడేపల్లి, మందడం మీదుగా సచివాలయానికి చేరుకుంటాయి. సాయంత్రం తిరిగి 5.15 గంటలకు తిరిగి విజయవాడకు బయల్దేరతాయి. కాగా.. సచివాలయ ప్రాంగణంలో ఐదువేల మొక్కలను నాటాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. ఈ మేరకు రాజధాని నర్సరీల్లో పెంచిన ఐదడుగుల ఎత్తున్న మొక్కలను తీసుకొచ్చి ప్రాంగణంలో నాటుతున్నారు.
 
హైదరాబాద్‌ నుంచి బస్సుల్లో..
వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం ఐదో బ్లాక్‌ ప్రారంభోత్సవానికి.. హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయం నుంచి దాదాపు 200 మందికి పైగా ఉద్యోగులు హాజరుకానున్నారు. వీరందరినీ తీసుకెళ్లడం కోసం 5 బస్సులు సిద్ధం చేశారు. బుధవారం ఉదయం 6 గంటలకు ఏపీ సచివాలయం నుంచి ఇవి బయల్దేరుతాయి. ఈ 200 మంది ఉద్యోగుల్లో వైద్యఆరోగ్యశాఖ, గృహనిర్మాణ శాఖ, కార్మిక శాఖ, పంచాయతీరాజ్‌ శాఖల ఉద్యోగులతో పాటు ఇతర సచివాలయ శాఖల ఉద్యోగులు కూడా ఉన్నారు. మధ్యాహ్నం ఆ 4 శాఖల కార్యాలయాల ప్రారంభోత్సవం ముగిశాక సాయంత్రం 4 గంటలకు ఉద్యోగులు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. గురువారం యథావిధిగా ఏపీ సచివాలయంలో విధులు నిర్వహిస్తారు. కాగా, సచివాలయ ఉద్యోగులు పూర్తిస్థాయిలో ఎప్పుడు తరలివెళ్లాలనే దానిపై ఆయా శాఖల ఉన్నతాధికారులు సీఎస్‌ ఎస్పీ టక్కర్‌ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు.
 
 
  • ఐదో బ్లాక్‌లో ఏర్పాట్లు పూర్తి
  • కొలువుదీరనున్న ఐదుశాఖల ఉద్యోగులు
  • సచివాలయానికి ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు
రాజధానిలో మరో ముందడుగు పడింది. చూస్తుండగానే.. తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తవుతోంది. ఇక ఇక్కడి నుంచే పరిపాలన సాగనుంది. ఇందుకోసం తాత్కాలిక సచివాలయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐదోబ్లాక్‌లో తొలుత ఐదు శాఖల ఉద్యోగులు కొలువు తీరనున్నారు. వారికి స్వాగతం పలికేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉద్యోగుల కోసం గుంటూరు, విజయవాడల నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. అమరావతి : నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి పరిపాలన సాగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకోసం ఐదోనెంబర్‌ భవనంలో చాంబర్లు ఏర్పాటు చేశారు. బుధవారం ఐదుశాఖల ఉద్యోగస్తులు వెలగపూడి సచివాలయానికి వచ్చి వారి స్థానాల్లో కొలువుతీరనున్నారు. ఉద్యోగస్తులు రానున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు స్వాగత బ్యానర్‌లు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ చైనా పర్యటనలో ఉండటంతో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉద్యోగస్తులకు స్వాగతం పలకనున్నారు. సచివాలయం చుట్టూ మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు.
 
సిద్ధమైన ఐదో బ్లాక్‌..
తాత్కాలిక సచివాలయంలోని ఐదో బ్లాక్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌ సిద్ధమైంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వైద్య ఆరోగ్యం, కార్మిక, హౌసింగ్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల ఉద్యోగులకు చాంబర్లు సిద్ధం చేశారు. ఉదయానికి కల్లా టేబుల్స్‌ వేయనున్నారు. అన్ని చాంబర్లకు ఏసీలు అమర్చారు.

ఐదో బ్లాక్‌కు ప్రస్తుతానికి మందడం సబ్‌స్టేషన్ నుంచి మంగళవారం సాయంత్రం విద్యుత సరఫరా ఇచ్చారు.
 
 
 
  •  
Link to comment
Share on other sites

అమరావతిలో అపురూప ఘట్టం...
 
636028109760639474.jpg
గుంటూరు : అమరావతి చరిత్రలోనే ఇది అపూర్వ ఘట్టం. ఇప్పటికే సచివాలయంలో కుడికాలు పెట్టిన శాఖలు...పనులు ప్రారంభిస్తున్నది మాత్రం ఇప్పుడే. 2:59 గంటల ముహూర్తం కోసం ఏపీ మొత్తం ఎదురు చూసింది. ఉద్విగ్నభరితంగా, ఎంతో ఉత్సాహంగా ఇక మన పాలన మన దగ్గరి నుంచి అనిపించే అపురూప సన్నివేశం ఆవిష్కృతమైంది. ఏపీ చరిత్రలో సువర్ణాధ్యాయం మొదలైంది. చరిత్ర మలుపు తిరుగుతున్న క్షణాలు ఇవి. ఎన్నేళ్లు పడుతుందో అనుకున్న సమయంలో రెండేళ్లలోనే ఎదురొచ్చిన శుభఘడియలు ఇది. శుభ ముహూర్తాన వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
 
మంత్రి అయ్యన్న పాత్రులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఐదో బ్లాక్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో పంచాయతీరాజ్‌శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. సీఎస్‌ టక్కర్‌, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, పలు శాఖల సెక్రటరీలు, ఉద్యోగులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి ఐదు బస్సుల్లో బయల్దేరి విజయవాడకు చేరుకున్న సచివాలయ ఉద్యోగులకు కనకదుర్గ వారధి దగ్గర ఎన్జీవోలు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. మొత్తం నాలుగు శాఖల కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్, గృహ నిర్మాణం, కార్మిక శాఖకు చెందిన 200 మంది ఉద్యోగులు వెలగపూడికి తరలివచ్చారు.
Link to comment
Share on other sites

వెలగపూడిలో సచివాలయం ప్రారంభం

29brk105a.jpg

అమరావతి: అమరావతిలో మహత్తర ఘట్టానికి అడుగుపడింది. వెలగపూడిలోని నిర్మించిన తాత్కాలిక సచివాలయం ఐదో నంబర్‌ భవనం కింది అంతస్తులో సచివాలయ కార్యకలాపాలు బుధవారం మధ్యాహ్నం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయాన్ని మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. కేవలం 131 రోజుల్లోనే నిర్మాణం పూర్తి చేసుకున్న ఐదో భవనం అమరావతిలో తొలి పరిపాలనా భవనంగా చరిత్రకెక్కింది.

ఉద్యోగులకు ఘనస్వాగతం

అంతకుముందు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సుల్లో చేరుకున్న పంచాయతీరాజ్‌, కార్మిక శాఖల ఉద్యోగులకు వెలగపూడిలో ఘనస్వాగతం లభించింది.

పండగ వాతావరణం

సచివాలయం ప్రారంభం సందర్భంగా వెలగపూడిలో పండగ వాతావరణం చోటుచేసుకుంది. మంత్రులు, ఉన్నతాధికారులు, ఉద్యోగుల సందడితో వెలగపూడి జన జాతరను తలపించింది. వేద మంత్రాల నడుమ మంత్రి అయ్యన్నపాత్రుడు సచివాలయాన్ని ప్రారంభించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. అమరావతి నుంచి విధులు నిర్వర్తిస్తూ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని ఉద్యోగులు చెబుతున్నారు.

Link to comment
Share on other sites

MNC corporate office la ga vundi gaa .. super 

 

Choosina ventane same feeling, yes, inni rojulaki colonial/nizam architecture vadilinchukunnam ani

 

Maa mandal office british era burada kunta laa untundi :lol2:

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...