Jump to content

అభిమానుల కోసం జపాన్ వెళ్లనున్న తారక్


swas

Recommended Posts

తారక్ ఎన్నో విజయాలు , రికార్డ్స్  అతని సొంతం .పెద్ద హీరోలు కూడ టచ్ చేయలేని విజయాలు ఉన్నాయి . కాని తన కంటే వెనక వచ్చిన హీరోలు 50 కోట్లు ఎప్పుడో సాధించగా  యంగ్ టైగర్ మాత్రం  ఈ మధ్య వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమాతో సాధించాడు . మొదటి రోజే ఈ సినిమాకి  మిశ్రమ స్పందన వచ్చినా , తర్వాత పుంజుకొని  సంక్రాంతి కి వచ్చిన అన్ని సినిమాలకంటే గొప్ప విజయాన్ని సాధించింది .

 

యంగ్ టైగర్ కి మన దేశం లోనే కాకుండా  జపాన్ , స్పెయిన్  వంటి దేశాలలో అభిమానులు ఉన్న హీరో గా రజిని తర్వాత నిలిచాడు . ఇప్పటి వరకు రజిని కి మాత్రమె అక్కడ బాగా ఫాలోయింగ్ ఉంది . ఇప్పుడు యంగ్ టైగర్ అతనిని బీట్ చేశాడు .జపాన్ కి చెందిన ఒక సంస్థ  నాన్నకు ప్రేమతో సినిమాని  రజిని సినిమా కంటే ఎక్కువ మొత్తం లో కొనుగోలు చేసింది .

ఇప్పుడు నాన్నకు ప్రేమతో సినిమా ని జపాన్ లో ఫిబ్రవరి 14 న వాలెంటైన్స్ డే   సందర్భంగా  విడుదల చేస్తున్నారు .అంతేకాక ఈ సినిమా జపాన్ బాష లో అనువదించడం మరో విశేషం . ఎంతైనా ఒక తెలుగోడికి ఇంత ఫాలోయింగ్ రావటం  మనం గర్వించ దగ్గ  విషయమే..  

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...