Jump to content

Andhra pradesh Police Academy in Achampet,Amaravati.

sonykongara

Recommended Posts

అచ్చంపేటలో.. అన్నీ ఒకే చోట!
అకాడమీ, శిక్షణ కేంద్రాలు, ఫైరింగ్‌ రేంజీ
అక్కడే పోలీసు నిలయం
ఏడీజీపీ సురేంద్రబాబు
gnt-panel4a.jpg

ఈనాడు, అమరావతి: శాఖాపరంగా మరింత మెరుగ్గా సేవలు అందించేందుకు ఏపీ పోలీసు అకాడమీ, పోలీసు రవాణా శిక్షణ సంస్థ, గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ శిక్షణ కేంద్రాలు, ఫైరింగ్‌ రేంజీని ఒకే చోట నెలకొల్పనున్నామని ‘ఆక్టోపస్‌’ విభాగం చీఫ్‌, అదనపు డీజీపీ ఎన్‌వీ సురేంద్రబాబు అన్నారు. విజయవాడ పోలీసు కమిషనర్‌ గౌతం సవాంగ్‌ 12 రోజుల పాటు సెలవు వెళ్లిన నేపథ్యంలో ఇన్‌ఛార్జి సీపీగా సురేంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గురువారం ఆయన విలేకరుల మాట్లాడారు. ప్రధాన విభాగాలన్నీ ఒకేచోట ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. గుంటూరు జిల్లాలోని అచ్చంపేట వద్దే ఇవన్నీ ఏర్పాటవుతాయని వివరించారు. కార్యాలయాలు, సిబ్బంది నివాస సముదాయాలను ఇందులోనే నెలకొల్పుతారు. దీనికోసం 2700 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. దీనికి అవసరమైన అటవీభూమిని డీనోటిఫై చేయాలని కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి చేసిందన్నారు. భూమిని కేటాయించగానే కేంద్ర, రాష్ట్ర నిధులతో పకడ్బందీ ప్రణాళికతో వీటిని నిర్మించనున్నట్లు తెలిపారు. ఒకేచోట వివిధ సంస్థల ఏర్పాటు వల్ల సమర్థంగా వనరుల పంపకం, సద్వినియోగం సాధ్యపడుతుందన్నారు. గ్రేహౌండ్స్‌- ఆక్టోపస్‌ల ప్రధాన కార్యాలయం రాజధాని పరిసరాల్లోనే వస్తుందన్నారు. ఏపీలో శిక్షణ కేంద్రాలు నిర్మించేదాకా హైదరాబాద్‌లో ఉన్న శిక్షణ వసతులనే వినియోగించుకుంటామని చెప్పారు.

Link to comment
Share on other sites

  • పుట్లగూడెం - పులిచింతల మధ్య అటవీ ప్రాంతం ఎంపిక 
  •  రాజధానికి 50 కిలోమీటర్ల పరిధిలో 2700 ఎకరాలు గుర్తింపు 
  •  అప్పాకు దీటుగా అన్ని శిక్షణా కేంద్రాలు ఒకేచోట..
పోలీస్‌ శిక్షణ విభాగాలకు గుంటూరు జిల్లా కేంద్రం కానుంది. హైదరాబాద్‌లోని ఏపీ పోలీసు అకాడమీని తలదన్నేలా అచ్చంపేట మండలంలో నూతన అకాడమీ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు పుట్లగూడెం నుంచి పులిచింతల మధ్య 2700 ఎకరాల్లో ఉన్న అటవీ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. అన్ని విభాగాల శిక్షణ కేంద్రాలను ఇక్కడే నిర్మించనున్నారు.
గుంటూరు : రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ పోలీసు అకాడమీతో పాటు మిగిలిన అన్ని విభాగాల శిక్షణా కేంద్రాలను ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ఏడాదిన్నరగా పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో డీజీపీ రాముడు, ఇతర ఉన్నతాధికారులు అచ్చంపేట అటవీప్రాంతాన్ని పరిశీలించి వెళ్లారు. అచ్చంపేట పరిధిలోని అటవీ ప్రాంతమే అనువుగా ఉంటుందని నిర్ధారించారు. ఆక్టోప్‌స, గ్రేహౌండ్స్‌కు శిక్షణ ఇవ్వాలంటే అటవీప్రాంతంలో కొండలు, గుట్టలు ఉండాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో అచ్చంపేట అటవీప్రాంతం గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ శిక్షణకు సరిగ్గా సరిపోతుందని పోలీసు అధికారులు అంటున్నారు. మరోవైపు ఆహ్లాదకర వాతావరణం, పక్కనే కృష్ణానది ఉండడంతో నీటి సదుపాయం పుష్కలంగా ఉంటుందని అధికారులు అంటున్నారు.
డీనోటిఫైకు కేంద్రానికి ప్రతిపాదనలు..
ఈ నేపథ్యంలో అచ్చంపేటకు సమీపంలోని పుట్లగూడెం నుంచి పులిచింతల మధ్య 2700 ఎకరాల్లో ఉన్న అటవీ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. అటవీప్రాంతం కావడంతో ఆ భూమిని డీనోటిఫై చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్రం నుంచి కూడా సాధ్యమైనంత త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల కావచ్చని పోలీసు అధికారులు భావిస్తున్నారు. కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చిన వెంటనే ఏపీ పోలీసు అకాడమీ, ఏపీఎస్పీ బెటాలియన్లు, పోలీసు ట్రాన్స్‌పోర్టు అకాడమీ, గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ తదితర విభాగాల శిక్షణ కేంద్రాలకు అవసరమైన భవనాలు, క్వార్టర్స్‌, పరిపాలనా కేంద్రాలను నిర్మించాలని భావిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.7500 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఆ మొత్తం కూడా కేటాయించినట్లుగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం గుర్తించిన అటవీప్రాంతం ఏపీ రాజధానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక వైపు పులిచింతల ప్రాజెక్టు ఉంది. ఈ నేపథ్యంలో రాజధాని నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు ఈ మార్గం దగ్గరగా ఉండనుంది. ఈ నేపథ్యంలో అచ్చంపేట అటవీప్రాంతంలో పోలీసు అకాడమీకి అనుమతి లభించినట్లయితే పులిచింతల వద్ద ఏపీ, తెలంగాణ రాషా్ట్రలను కలిపేలా మరో బ్రిడ్జి నిర్మించే అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నారు.
Link to comment
Share on other sites

  • 2 years later...

వెంకటాయపాలెం వద్ద పోలీస్‌ అకాడెమీ

గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ ప్రధాన కేంద్రాలూ...

ఈనాడు - అమరావతి

గుంటూరు జిల్లా అచ్చంపేట సమీప వెంకటాయపాలెం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు రక్షణ, భద్రతా విభాగాలకు కేంద్రస్థానం కాబోతోంది. చుట్టూ కొండలు, దట్టమైన అటవీప్రాంతం ఉండడంతో వ్యూహాత్మకంగా ఈ ప్రదేశం ఎంతో అనుకూలమని దీన్ని ఎంపిక చేశారు. ఏపీ పోలీస్‌ అకాడెమీ, గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ విభాగాల ప్రధాన కేంద్రాల వంటివన్నీ అక్కడే రాబోతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన భద్రత, శిక్షణ సంస్థలకు ప్రధాన కేంద్రాలను ఏర్పాటుచేసుకోవలసి ఉంది. వెంకటాయపాలెం ప్రాంతం అనుకూలమైనదిగా చాన్నాళ్ల క్రితమే గుర్తించారు. కానీ అదంతా అటవీ ప్రాంతం కావడంతో డీనోటిఫై చేసేందుకు కేంద్రప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. రాజధాని అవసరాల నిమిత్తం రాష్ట్రప్రభుత్వం విజ్ఞప్తి మేరకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) పరిధిలోని రెండు బ్లాకుల్లో 2,089.09 హెక్టార్ల అటవీభూమిని డీనోటిఫై చేసేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఇటీవలే అంగీకరించింది. వీటిలో ఒక బ్లాకు రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లి వద్ద, మరోటి వెంకటాయపాలెం వద్ద ఉంది. ఉండవల్లిలో 251.77 హెక్టార్లు, వెంకటాయపాలెం వద్ద 1,835.32 హెకార్ట అటవీభూమిని కేంద్రప్రభుత్వం డీ నోటిఫై చేయనుంది. డీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నప్పుడే.. ఆయా ప్రాంతాల్లో చేపట్టనున్న ప్రాజెక్టుల గురించి రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనలు అందజేసింది.

వెంకటాయపాలెంలో వచ్చేవి..

వెంకటాయపాలెం వద్ద ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అకాడెమీ, ఏపీ స్పెషల్‌ పోలీసు బెటాలియన్‌, షూటింగ్‌ రేంజ్‌, గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ హెడ్‌క్వార్టర్లు, మిలిటరీ స్టేషన్‌, రైల్వే భద్రతాదళం అకాడెమీ, సీఆర్‌పీఎఫ్‌ కాంప్లెక్స్‌, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విభాగం వంటివి ఏర్పాటుచేయనున్నట్టు రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. అక్కడ రూ.3,470కోట్ల పెట్టుబడులు వస్తాయని, 15వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపింది. మొత్తంగా ఈ ప్రాజెక్టుల వల్ల 15లక్షల మంది లబ్ధి పొందుతారని పేర్కొంది.

ఉండవల్లిలో..

తాడేపల్లి మండలం ఉండవల్లిలో 421.77హెక్టార్ల అటవీ భూములున్నాయి. వీటిలోనే చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఉండవల్లి గుహలూ ఉన్నాయి. గుహలున్న ప్రాంతంతో కలిపి సుమారు 170 హెక్టార్ల భూమి పురావస్తుశాఖ అధీనంలో ఉంది. అది పోగా.. మిగతా 251.77 ఎకరాల్ని వాణిజ్య అవసరాలకు వినియోగించుకునేలా డీనోటిఫై చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ ప్రాంతాన్ని వాణిజ్య కార్యకలాపాలకు వేదికగా తీర్చిదిద్దుతామని, బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ ఏర్పాటుచేస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించింది. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌, టయర్‌-4 డేటా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నిర్మిస్తామని, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేస్తామంది. ఇక్కడ రూ.593.43కోట్ల పెట్టుబడులు వస్తాయని, ఈ ప్రాజెక్టుల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 20వేల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపింది.

అడిగింది 25 బ్లాకులు..

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 25 బ్లాకుల్లోని 12,444.89 హెకార్టఅటవీభూమిని రాజధాని అవసరాల కోసం డీనోటిఫై చేయాల్సిందిగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ తొలి దశలో రెండు బ్లాకులకే కేంద్రం అనుమతినిచ్చింది. మిగతా వాటికి.. అవసరమైనప్పుడు విడివిడిగా ప్రతిపాదనలతో రావాలని సూచించింది. అన్నింటికీ ఒకేసారి అనుమతులివ్వలేమంది. కేంద్రం డీనోటిఫై చేసిన అటవీ భూముల్లో.. రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులను ఐదేళ్లలోగా ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. పనులు జరుగుతున్నాయో లేదో కేంద్ర అటవీశాఖ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. రాష్ట్రప్రభుత్వం కోరినట్టుగా 25బ్లాకుల్ని ఒకేసారి డీనోటిఫై చేసినా ఐదేళ్లలో అవన్నీ పూర్తిచేయడం కష్టమని, ఆయా బ్లాకులవారీగా ప్రతిపాదనలతో రావాలని కేంద్రం సూచించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఎంత అటవీ భూమినిస్తే, అంతే భూమిని ప్రత్యామ్నాయ వనీకరణ కోసం రాష్ట్రప్రభుత్వం వేరేచోట చూపాల్సి ఉంటుంది. ఇప్పుడు డీనోటిఫై చేస్తున్న 2,089.09 హెక్టార్లకు సంబంధించి కడప, ప్రకాశం జిల్లాల్లో ప్రత్యామ్నాయ భూముల్ని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి ఇవ్వనుంది. అక్కడ అడవుల అభివృద్ధికి రూ.210కోట్లు కూడా రాష్ట్రం ఇవ్వాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.

Link to comment
Share on other sites

రాష్ట్రంలో గ్రేహౌండ్స్‌ కేంద్రం 
రూ.219 కోట్లతో ఏర్పాటుకు కేంద్ర హోంశాఖ ఆమోదం 
  ఇప్పటికే అమరావతిలో   250 ఎకరాల కేటాయింపు
ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 9(3) కింద చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యాధునిక గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర హోంశాఖ ఆమోదముద్ర వేసింది. గురువారం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుచేశారు. రాష్ట్ర విభజన కారణంగా అది తెలంగాణకు వెళ్లిపోవడంతో  దానికి సమానమైనస్థాయిలో అత్యాధునిక శిక్షణ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. దీనిపై 2016 డిసెంబర్‌ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు జరుగుతూ వచ్చాయి. ఎట్టకేలకు గురువారం దానికి ఆమోదముద్ర వేశారు. అమరావతి సమీపంలో 250 ఎకరాల్లో రెండు యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. గుంటూరు జిల్లాలో మొత్తం పోలీసు హెడ్‌క్వార్టర్స్‌, ప్రత్యేక విభాగాల ఏర్పాటుకు 2014లో రాష్ట్ర ప్రభుత్వం 2,700 ఎకరాల పలుచబడ్డ అటవీప్రాంతాన్ని గుర్తించింది. దీని మళ్లింపునకు కేంద్ర అటవీశాఖ ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. ఇందులో 250 ఎకరాలను గ్రేహౌండ్స్‌ కేంద్రానికి కేటాయించింది.  హైదరాబాద్‌ తరహాలో పూర్తిస్థాయి మౌలిక వసతులతోకూడిన గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటుచేయాలంటే రూ.853.37 కోట్లు ఖర్చవుతుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అంచనావేసింది. కేంద్రం మాత్రం ప్రస్తుతం రూ.219 కోట్ల ప్రాజెక్టుకే ఆమోదముద్ర వేసింది.

Edited by sonykongara
Link to comment
Share on other sites

ఏపీకి గ్రేహౌండ్స్‌ యూనిట్‌
02-03-2018 02:59:59
219 కోట్లతో ఏర్పాటుకు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో గ్రేహౌండ్స్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.219 కోట్లతో దీన్ని ఏర్పాటు చేయడానికి గురువారం కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల క్రితం కేంద్ర హోంశాఖ, ఆర్థికశాఖ అధికారులతో ఢిల్లీలో ఏపీ డీజీపీ ఎం మాలకొండయ్య ఈ అంశంపై చర్చలు జరిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం తెలంగాణకు చెందిన క్రమం లో ఏపీలో కొత్తగా గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 9(3)లో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల మధ్య చర్చోపచర్చల తర్వాత ఒక యూనిట్‌ ఏర్పాటుకు కేంద్రం ఆమోదించింది.
 
దీని ఏర్పాటుకు సాధ్యమైనంత త్వరగా నిధులు ఇవ్వాలని, యూనిట్‌ ఏర్పాటుకు అవసరమైన మౌలికసదుపాయాలు, ఇతర సౌకర్యాలు కల్పనకు సహకరించాలని రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. రూ.858.37 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టడానికి వివరణాత్మక నివేదికను కేంద్ర హోంశాఖకు పంపింది. అదే సమయంలో పోలీసు ప్రధాన కార్యాలయం, పోలీసు విభాగానికి సంబంధించిన ఇతర అవసరాల కోసం 2014లోనే రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు డివిజన్‌లో 2700 ఎకరాల భూమిని గుర్తించింది. గతంలో కేంద్ర హోంశాఖ అధికారుల బృందం హైదరాబాద్‌లోని గ్రేహౌండ్స్‌ కేంద్రానికి వచ్చి ఈ అంశంపై చర్చించింది. తర్వాత 2016 డిసెంబరులో ఆ బృందం ఏపీలో పర్యటించి గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు భూముల వివరాలివ్వాలని విజ్ఞప్తి చేసింది.
 
ఈ నేపథ్యంలో అమరావతిలో 250 ఎకరాల విస్తీర్ణంలో 2 యూనిట్లుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. కాగా, రాష్ట్రంలో పూర్తిస్థాయి శిక్షణ కేంద్రం లేకపోవడం వల్ల విశాఖపట్నంలో ఉన్న గ్రేహౌండ్స్‌ ఆపరేషనల్‌ హబ్‌లోనే శిక్షణ తదితర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారామ్‌ అహీర్‌ వెల్లడించారు. ఆపరేషనల్‌ హబ్‌ ఏర్పాటుకు కూడా కేంద్రం నిధులు ఇవ్వలేదని ఆయన చెప్పారు.

Link to comment
Share on other sites

Location for this project is Natural valley surrounded by hills .....super untundi place...

chala remote area with only One ghat road and looks like a "closed trap"".....acre 2 lakh anna konevallu kadu even 2013-14 lo kooda...now became special

https://www.google.com/maps/place/16°39'05.3"N+80°03'01.7"E/@16.6514891,80.0417052,2812m/data=!3m2!1e3!4b1!4m14!1m7!3m6!1s0x3a35098188153585:0xbf98c23997bde719!2sPulichintala+Dam,+Telangana+508246!3b1!8m2!3d16.7713639!4d80.0555062!3m5!1s0x0:0x0!7e2!8m2!3d16.6514692!4d80.05046

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

1 hour ago, surapaneni1 said:

dadapu 4 yrs nunchi cheptunnaru....... matter munduku kadalatla

Edhi cheyyali Anna Funds important.. funds leka edho nettukosthunnaru.. Salaries ki ibandhi lekunda chesthunnaru, Govt sajavuga naduputundhi (ala plan chesukundhi)

Link to comment
Share on other sites

రాజధాని నుంచి గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం తరలిపోతోందా..!
03-03-2018 08:24:34

రాజధానిలో గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం లేనట్టేనా?
పోలీస్‌ అకాడమీ ఎక్కడ ?
గతంలో అచ్చంపేట పరిధిలో 2 వేల ఎకరాల అటవీ భూమి గుర్తింపు
తాజాగా విశాఖపట్నం వద్ద ఏర్పాటు చేసేందుకు యోచన
నవ్యాంధ్రలో గ్రేహౌండ్స్‌ బలగాల శిక్షణ కేంద్రం ఎక్కడ అనేది ఇంతవరకు స్పష్టత రాలేదు. వెంకటాయపాలెం పరిధిలో రెండు వేల ఎకరాల్లో ఏర్పాటు చేయాలన్న ఉన్నతాధికారుల ప్రతిపాదనలకు అటవీశాఖ మోకాలడ్డింది. తాజాగా విశాఖలో ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. గ్రేహౌండ్స్‌ మాత్రమే విశాఖలో ఏర్పాటు చేస్తే మిగిలిన పోలీస్‌ అకాడమీ, ఆక్టోపస్‌లను రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేస్తారా అనేది కూడా స్పష్టం రావాల్సి ఉంది.
 
గుంటూరు: మావోయిస్టు కార్యకలాపాలను సమర్థంగా తిప్పికొట్టగలిగే గ్రేహౌండ్స్‌ బలగాలకు ఏపీలో ఎక్కడ శిక్షణ ఇవ్వాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లవుతున్నా గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఎక్కడన్న దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. రాజధాని పరిధిలో శిక్షణ కేంద్రం ఉండాలని గతంలో ఉన్నతాధికారులు భావించారు. అమరావతి రాజధానికి 65 కిలోమీటర్ల దూరంలో అచ్చంపేట పరిధిలో ఉన్న అటవీ భూమి గ్రేహౌండ్స్‌కు అనువుగా ఉంటుందని గతంలో అధికారులు గుర్తించారు. గ్రేహౌండ్స్‌తో పాటు ఏపీ పోలీస్‌ అకాడమీ (అప్పా), ఆక్టోపస్‌ తదితర విభాగాలను అక్కడే ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరారాబాద్‌లోని గచ్చిబౌలిలో ఏపీ పోలీస్‌ అకాడమీ ఉండేది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కానిస్టేబుల్‌ నుంచి పై స్థాయి అధికారుల వరకు అక్కడే శిక్షణ ఇచ్చేవారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో ఆ స్థాయి కలిగిన శిక్షణా కేంద్రం లేకపోవడం పోలీసులకు శిక్షణ ఇవ్వడం ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం తాత్కాలికంగా అనంతపురంలో పోలీస్‌ అకాడమీ నెలకొల్పారు.
 
అచ్చంపేటకు సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకటాయపాలెం రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఏరియాలో ఏపీ పోలీస్‌ అకాడమీ, గ్రేహౌండ్స్‌ శిక్షణ, ఆక్టోపస్‌లకు అటవీ శాఖకు చెందిన రెండు వేల ఎకరాలు కేటాయించాలని పోలీస్‌ శాఖ గతంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. పుట్లగూడెం పరిధిలోని రెండు వేల ఎకరాల స్థలం పోలీస్‌ శాఖకు సంబంధించి అన్ని రకాల శిక్షణకు అనువుగా ఉంటుందని పోలీస్‌ ఉన్నతాధికారులు భావించారు. అప్పటి డీజీపీ జేవీ రాముడు, ఐజీ శివధర్‌ రెడ్డితో పాటు గ్రేహౌండ్స్‌, ఇంటెలిజెన్స్‌ అధికారులు పుట్లగూడెం అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. హైదరాబాద్‌ తరహాలో ఏపీలోనూ రాజధాని ప్రాంతానికి చేరువలో ఉండడమే కాక రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారికి అందుబాటులో ఉంటుందని ఈ ప్రాంతాన్ని అప్పట్లో ఎంపిక చేశారు.
 
ఈ నేపథ్యంలో తాము అక్కడ అటవీ భూమి కేటాయిస్తే రాష్ట్రంలో అంతే విస్తీర్ణంలోని రెవెన్యూ భూమిని తమకు కేటాయించాలని అటవీశాఖ మెలిక పెట్టినట్లు తెలిసింది. దీంతో ఈ ప్రతిపాదన ముందుకు సాగలేదని సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా పోలీస్‌ శాఖ గ్రేహౌండ్స్‌ శిక్షణా శిబిరాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు డీజీపీ మాలకొండయ్య ఇటీవల కేంద్ర హోమ్‌ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రానికి నిధుల కేటాయింపుపై సంప్రదింపులు జరిపారు. సుమారు రూ.250 కోట్ల ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సుముఖత వ్యక్తమైనట్లు తెలిసింది. గ్రేహౌండ్స్‌ శిక్షణా కేంద్రం విశాఖలో ఏర్పాటు చేసే అంశంపై వార్తలు రావడంతో గతంలో రాజధాని జిల్లాలో వాటి ఏర్పాటుకు చేసిన ప్రతిపాదనలు చర్చనీ యాంశమయ్యాయి. కేవలం గ్రేహౌండ్స్‌ మాత్రమే విశాఖలో ఏర్పాటు చేస్తే మిగిలిన పోలీస్‌ అకాడమీ, ఆక్టోపస్‌లను రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేస్తారా అనేది కూడా స్పష్టం కావాల్సి ఉంది. లేదంటే మూడింటినీ అక్కడే ఏర్పాటు చేస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది. పుట్లగూడెం వద్ద గ్రేహౌండ్స్‌, అప్పా, ఆక్టోపస్‌ ఏర్పాటు చేస్తే నీటి సదుపాయంతో పాటు శిక్షణకు అవసరమైన కొండలు, గుట్టలు చక్కగా ఉపయోగపడతాయని కూడా పోలీస్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అచ్చంపేట ప్రాంతమే ఈ మూడు శిక్షణ కేంద్రాలకు అనువుగా ఉంటుందని పోలీస్‌ సిబ్బంది కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూడు శిక్షణా కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Edited by sonykongara
Link to comment
Share on other sites

26 minutes ago, sonykongara said:

ayina badulu ga  kadapa lo  forest department  ki land icchadu ga 5days mundu

Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:

http://epaper.eenadu.net/index.php?rt=index/index#

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...