Jump to content

పనితీరుతో ఆకట్టుకుంటున్న బాలకృష్ణ


Mani

Recommended Posts

హిందూ పురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ మిగతా ఎమ్మెల్యేల కంటే కాస్త భిన్నంగా వెళ్తున్నారు..గతంలో ఎందరో సినీనటులు ప్రజాప్రతినిధులు, మంత్రులుగా పనిచేసినా బాలకృష్ణ మాదిరి నియోజకవర్గాన్ని సందర్శించడం చాలా తక్కువేనని వ్యాఖ్యానాలు విన్పిస్తున్నాయి.గతంలో సినీనటులను మోజుతో గెలిపించేవారు.. ఆ తర్వాత వారు ఆ నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కన్పించేవి కావు..అయితే అందరికంటే భిన్నంగా బాలకృష్ణ నెలలో నాలుగైదు రోజులు హిందూపురంలోనే గడుపుతున్నారు. స్థానిక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన హిందూపురం ప్రజలకు ఏదో ఒకటి చేయాలని తలంపుతో బాలకృష్ణ ఉన్నట్లు సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు..కేవలం హిందూపురమే కాకుండా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరైనా టిడిపి ప్రజాప్రతినిధులు పిలిస్తే వెళ్తున్నారు. గతంలో బాలకృష్ణపై ప్రత్యర్థులు పలురకాలుగా వ్యాఖ్యానించేవారని, కనీసం మాట్లాడరని కూడా విమర్శలు వచ్చేవి. ఇప్పుడు బాలకృష్ణ తీరు చూస్తుంటే అదంతా దుష్ప్రచారమేనని హిందూపురంనకు చెందిన ఓ వ్యక్తి వ్యాక్యానించారు. రాష్ట్రంలో టిడిపికే చెందిన మిగతా ఎమ్మెల్యేలకంటే మంచిపనితీరు కన్పిస్తున్నట్లు కన్పిస్తోంది. తన పనితీరుతో ప్రభుత్వ సర్వేలో కూడా మెరుగైన స్థానం పొందిన విషయం తెలిసిందే..సినిమాల్లో తనకంటూ ప్రత్యేకత సాధించన బాలయ్య రాజకీయాల్లోనూ రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఆ దిశగా సఫలం కావాలని ఆశిద్ధాం..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...