Jump to content

సీఎం రెస్ట్‌హౌస్‌కు రహదారుల విస్తరణ


sonykongara

Recommended Posts

 హోం >> ఆంధ్రప్రదేశ్

సర్వే షురూ.. సీఎం రెస్ట్‌హౌస్‌కు రహదారుల విస్తరణ

Updated :03-09-2015 14:24:51 print_icon.gif

 
  • రాజధానిలో రహదారుల సర్వే
  • సర్వేయర్లను కేటాయించాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశాలు
  • ఏడుగురికి డిప్యుటేషన్‌
  • నెల రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యం 

గుంటూరు, ఆంధ్రజ్యోతి: రాజధాని ప్రాంతంలో రహదారుల సర్వేకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కృష్ణానది కరకట్టపై ఉండవల్లి సమీపంలో సీఎం రెస్ట్‌హౌస్‌ను ప్రారంభించిన దృష్ట్యా ఉండవల్లి జంక్షన్‌ - ఎర్రబాలెం, మంగళగిరి - రాయపూడి రహదారుల విస్తరణపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఇప్పటికే రహదారులు, భవనాల శాఖ రెండు రోడ్ల విస్తరణకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించిన నేపథ్యంలో సర్వే పనులు పూర్తి చేయాల్సిందిగా కలెక్టర్‌ కాంతీలాల్‌ దండే జిల్లా సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ కార్యాలయాన్ని ఆదేశించారు.

రెస్ట్‌హౌస్‌కు తొలి ప్రాధాన్యం
నవ్యాంధ్ర రాజధానిలోనే వారానికి నాలుగు, ఐదు రోజులు అందుబాటులో ఉంటానని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు.అందుకు తగ్గట్టుగానే విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉంటున్నారు. గత శనివారం ఉండవల్లిలోని రెస్టుహౌస్‌లో పాలు పొంగించి శాసో్త్రక్తంగా గృహప్రవేశం చేశారు. ఈ వారం అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో సీఎం హైదరాబాద్‌లోనే ఉన్నారు. వచ్చే వారంలో ఆయన తిరిగి విజయవాడకు వస్తారు. ఆ సందర్భంలో రాత్రి ఉండవల్లి రెస్టుహౌస్‌లోనే బస చేసే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. సీఎం కాన్వాయ్‌ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించేందుకు వీలుగా సమీపంలోని రహదారులను విస్తరించాలని నిర్ణయించారు. ఉండవల్లి జంక్షన్‌ నుంచి మంగళగిరి మండలం ఎర్రబాలెం వరకు ఒక రహదారి ఉంది. దీనిని తక్షణం విస్తరించాలని నిర్ణయించారు. మంగళగిరి నుంచి రాయపూడి వరకు మరొక రహదారి ఉంది. దీని విస్తరణ కూడా అవసరమని జిల్లా యంత్రాంగం తేల్చింది.

సర్వేయర్లకు డిప్యుటేషన్‌
రహదారుల విస్తరణలో సర్వేయర్ల పాత్ర కీలకం కావడంతో తక్షణం తుళ్లూరుకు ఇద్దరు, తాడేపల్లికి ఇద్దరు, మంగళగిరికి ముగ్గురు సర్వేయర్లను డిప్యుటేషన్‌పై పంపించాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. స్పందించిన సర్వే ఏడీ తుళ్లూరుకు సీహెచ్‌ పున్నం రాజు (పెదనందిపాడు), టీ శ్రీనివాసరావు (పెదకూరపాడు) సర్వేయర్లను నియమించారు. తాడేపల్లికి జీ వెంకటేశ్వర్లు (ప్రత్తిపాడు), వీ దుర్గారావు (బెల్లంకొండ) సర్వేయర్లను పో స్టింగ్‌ చేశారు. మంగళగిరికి సీహెచ్‌ మల్లికార్జునరావు (పెదకాకాని), ఎస్‌ కిశోర్‌కుమార్‌ (ఫిరంగిపురం), వీ శేషగిరిరావు (రాజుపాలెం) సర్వేయర్లను డిప్యుటేషన్‌ చేశారు. ఏడుగురు సర్వేయర్లను ఆయా మండల తహసీల్దార్లు రిలీవింగ్‌ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రిలీవ్‌ అయిన్‌ వెంటనే సర్వేయర్లును సంబంధిత తహసీల్దార్ల వద్దకు వెళ్లి రిపోర్టింగ్‌ చేయాలని ఆదేశించారు.
 
రూ. 34 కోట్లు విడుదల
ఉండవల్లి జంక్షన్‌ నుంచి ఎర్రబాలెం వరకు రహదారిని 10 మీటర్లకు విస్తరించాలని ఆర్‌ అండ్‌ బీ నిర్ణయించినట్లు శాఖ ఎస్‌ఈ కే రాఘవేంద్రరావు తెలిపారు. ఇందుకోసం రూ. 14 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామన్నారు. మంగళగిరి రాయపూడి రహదారి ప్రస్తుతం 5.5 మీటర్లు ఉండగా, ఏడు మీటర్లకు విస్తరిస్తున్నట్లు చెప్పారు. ఈరహదారి అభివృద్ధికి రూ. 20 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. రెండు రహదారుల విస్తరణ పనులకు టెండర్లు పిలిచామని, కాంట్రాక్టర్లను నిర్ణయించేందుకు ప్రభుత్వానికి పంపామన్నారు. ఈ రెండు రహదారుల విస్తరణ జెట్‌ స్పీడ్‌తో కేవలం నెల వ్యవధిలో పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
 

 

Link to comment
Share on other sites

In Undavalli center they agreed to remove Ranga&YSR statues themselves to new place.

 

R&B given them time and they did not follow. They came with police to demolish and then they agreed to remove themselves by Tuesday.

Undavalli lo 700acer daka friday  istharu annaru icchara bro.

Link to comment
Share on other sites

<<<<<<Undavalli lo 700acer daka friday  istharu annaru icchara bro>>>>

 

Undavalli more than locals(of course they are moral force behind for political reasons) there are RICH people that own river bed lands....They are blocking all the efforts.

For them nothing much to loose. If they get to keep those are most valuable lands...

 

There is a high chance river bed RICH people may not handover....Even Jagan promise(of returning back the lands or taking Greenbelt away) is also keeping them in mind and not farmers...

Link to comment
Share on other sites

రహదారుల అభివృద్ధికి చర్యలు

రాజధాని ప్రాంతానికి అన్ని వైపుల నుంచి దారి తీసే రహదారులన్నీ ఇరుకిరుగ్గానే ఉన్నాయి. అమరావతి నిర్మాణంలో పెద్దఎత్తున వినియోగించబోయే ముడిసరుకులు, నిర్మాణ సామగ్రి, అత్యంత భారీ పరికరాలను ఇలాంటి రోడ్లపై అక్కడికి చేర్చడం అసాధ్యమే. కృష్ణానది కరకట్ట రోడ్డు, ఓల్డ్‌ మద్రాస్‌ హైవే నుంచి ఉండవల్లి సెంటర్‌ వద్ద మొదలై పెనుమాక, కృ ష్ణాయపాలెం, మందడం, రాయపూడిల మీదుగా ఉన్న రోడ్డు, ఎర్రబాలెం నుంచి రాజధాని ప్రాంతానికి ఉన్న మరొక రోడ్డుతోపాటు కనకదుర్గమ్మ వారధి నుంచి ప్రస్తుత చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి నుంచి ఓల్డ్‌ మద్రాస్‌ హైవే వరకు విశాలమైన, భారీ బరువులు, ట్రాఫిక్‌ను తట్టుకోగలిగిన రహదారులను అభివృద్ధి పరచాలని సీఆర్‌డీఏ సంకల్పించింది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...