Jump to content

చంద్రునికో నూలుపోగు...


Rao_Garu

Recommended Posts


నాకు పెద్దాయన అంటే ఎందుకిష్టం? 

ఆయన నాకులం కాదు.. మా ప్రాంతం కాదు.. ఆయన పార్టీ పెట్టినపుడు నేనింకా  పుట్టలేదు కూడా!!  నేను  పుట్టే టైం కి ఆయన సినిమాలు తీయటం కూడా మానేశారు.. నాకు ఊహ తెలిసే సరికి ఆయన స్వర్గస్తులయ్యారు.. అయినా పెద్దాయన అంటే పిచ్చ ప్రేమ!!

 

ఒక మనిషి ప్రభావం జనాల మీద ఎంత ఉందో చెప్పటానికి ఎన్టీఆర్ ఒక ఉదాహరణ!! ప్రతి ఊళ్ళో రామాలయం ఎలా ఉన్టదో, అన్నగారి విగ్రహం కూడా ఖచ్చితంగా ఉంటది అని చెప్పటం అతిశయోక్తి కాదేమో!! ఎక్కడో నిమ్మకూరు లో పుట్టిన ఒక వ్యక్తి, ఇన్ని దశాబ్దాల పాటు (శతాబ్దాల పాటు కూడా కావొచ్చు) తెలుగు ప్రజల్ని,భారతదేశాన్ని  శాసించాడు అంటే ___/\___ అతని సామర్ధ్యం అనితరం.. అతని శక్తి ఒక ఉజ్వలం.. అతనొక సైన్యం..అతనొక ప్రభంజనం.. 

 

ఒక సాధారణ రిజిస్ట్రార్ గా జీవితాన్ని ప్రారంభించి,తెలుగుతెర ఇలవేల్పు గా,దేవుని రూపం తెలియని నాలాన్టోల్లకి ఒక రామున్ని,కృష్ణుణ్ణి,శివున్ని దర్శింపచేసిన భగవానుడు !! ప్రతినాయకులు అని  మనం భావించే రావణుడు,దుర్యోధనుడు లాంటి వాళ్ళ లో కూడా హీరోయిజం చూపెట్టాలంటే  ఎంత ధైర్యం ఉండాలి!!??  ఒక పౌరాణికం ,ఒక సామాజికం,ఒక సాంఘికం ఇలా ఎన్నో ఎన్నో చిత్రాలని తీసి మెప్పించటం అంటే మాటలు కాదు!! ఆయన కథానాయకుడు మాత్రమే కాదు.. మంచి దర్శకుడు,కథకుడు,ప్రతినాయకుడు..  అంతకు మించి ప్రేక్షకుల పల్స్ తెల్సిన అసలుసిసలు మాస్ హీరో!!!   

 

తెలుగువాడి ఆత్మగౌరవం కాపాడటం కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఒక్క అరక తో కుళ్ళు రాజకీయాల్ని దున్నేశాడు.. మాదే రాజకీయం అన్నోల్లని పాతరేసి అసలైన ప్రజావిజయాన్ని రుచి చూపించాడు. 'నీ కాల్మొక్కుతా బాంచెత్' అనే తెలంగాణా ని 'సంకెళ్ళ' నుంచి బంధ విముక్తి చేసాడు..  'కులం' అనే పదాన్నిరీడిఫైన్ చేసి ప్రతి ఒక్కళ్ళకి అవకాశం కల్పించాడు.. రాజకీయం అనే పదానికి 'సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు' అంటూ సరికొత్త నిర్వచనం ఇచ్చాడు.. పాలిటిక్స్ కి ఆయనొక 'యుగపురుషుడు'. 

 

దేవుడు కొంతమందిని మీరు ఆల్ రౌండర్స్ అని రాత రాసి ముందే పంపిస్తాడేమో అనిపిస్తుంది పెద్దాయన్ని చూస్తే!! నువ్వున్న జనరేషన్ లో నేను పుట్టనందుకు బాధపడ్డ సందర్భాలెన్నో!! అన్నా!! నువ్వు మాకు భౌతికంగా మాత్రమే దూరమయ్యావ్.. మా మనసుల్లోంచి కాదు.. మాలాంటి యువకులకి నిన్ను మించిన ఇన్స్పిరేషన్ ఇంకెవరు!! తెలుగుప్రజల వాడిని వేడిని ప్రపంచానికి పరిచయం చేసిన ఓ మహానుభావా నీకు వందనం అభివందనం పాదాభివందనం.. 

 

మళ్ళీ ఎపుడు పుడతావ్ అని ఎదురుచూస్తోంది ఒక ప్రపంచం.... JAI NTR... 

 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 3 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...