Jump to content

గోదావరి, కృష్ణ నీరు సముద్రం పాలు కావొద్దు-KCR.


Kiriti

Recommended Posts

ప్రతి బొట్టూ సద్వినియోగం.. తెలంగాణ సస్యశ్యామలం

ప్రాణహిత, గోదావరి, కృష్ణ నీరు సముద్రం పాలు కావొద్దు

సద్వినియోగానికి అధ్యయనం.. కాళేశ్వరం వద్దా బ్యారేజీ

కంతనపల్లిని వంద టీఎంసీలకు పెంచుదాం: కేసీఆర్‌

వరంగల్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): గోదావరి నదిపై ఇంకా ఎక్కడెక్కడ ఆనకట్టలను కట్టే అవకాశం ఉందో పరిశీలించాలని సాగునీటి శాఖ ఇంజనీర్లకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సూచించారు. మన ప్రాంతంలోని నదుల నుంచి పారే ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రాణహిత, ఇంద్రావతి, గోదావరి, కృష్ణా నదుల నీరు సముద్రం పాలు కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా అవసరమైన అధ్యయనాలు చేయాలన్నారు. కాళేశ్వరం వద్ద బ్యారేజీ కట్టేందుకు అవసరమైన సమగ్ర అధ్యయనం చేయాలన్నారు. వరంగల్‌ జిల్లా కంతనపల్లి ప్రాజెక్టు స్థలాన్ని ఆదివారం ఉదయం ఆయన సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించారు. కంతనపల్లి ప్రాజెక్టు సామర్థ్యాన్ని 50 టీఎంసీల నుంచి 100 టీఎంసీలకు పెంచేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆయన అడిగిన వివరాలను అందించలేకపోయిన ఇంజనీర్లపై అసహనం వ్యక్తం చేశారు.

అనంతరం చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు అతిథి గృహంలో జిల్లా అధికారులు, ఇంజనీర్లతో దాదాపు నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సాగు, తాగునీటి సమస్యలను తీర్చే పీవీ నరసింహారావు కంతనపల్లి ప్రాజెక్టు, జే.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతలను ప్రాధాన్య అంశాలుగా గుర్తించి వేగంగా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. కంతనపల్లి వద్ద 250 మెగావాట్ల ఉత్పత్తి ద్వారా విద్యుత్‌ సమస్యలను అధిగమించాలన్నారు. భారీ అంచనాలతో చేపట్టిన దేవాదులను నిర్ణీత సమయం దాటిపోయినా పూర్తి చేయలేకపోయామని, ఇప్పటి వరకు జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని ప్రాజెక్టుల నిర్మాణాల్లో వేగం పెంచాలని స్పష్టం చేశారు.

 

Link to comment
Share on other sites

Pattiseema Water pi other states ki Rights vundavu.

 

Pattisemma Water  ----          Godavari River nunchi Samudram loki Waste ga pothunna Water.

 

Ippudu Godavari River lonchi Samudram loki Water waste ga pokunda, KCR Godavari River meedha Projects construct chesthadu anta.

Link to comment
Share on other sites

veedu Dam ante entlo bathroom lo wall kattinattu anukuntunnadu anukunta........

 

Krishna meeda Jurala paina leda kinda kadithe almatti nunchi vache water aa matram chalavu......Srisailam ki vache water motam tungabadra nunche kada....

 

eka Godavari meeda kattina MH vallu water evvali kada......polavam ki pakkane kattatam kudaradu kada...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...