Jump to content

a random thought


Recommended Posts

ఆస్తికత్వం Vs నాస్తికత్వం

----------------------------

ఒక తల్లి గర్భంలో ఇద్దరు కవలలు మాట్లాడుకుంటూ

ఉంటారు.

మొదటి శిశువు : మనం ఇక్కడనుండి వెళ్లిపోయాకా ఉండే జీవితం

మీద నీకు నమ్మకం ఉందా?

రెండో శిశువు : ఆ... ఎందుకు లేదు? ఖచ్చితంగా ఇక్కడనుండి

వెళ్లిపోయాకా ఇంకా చాలా ఉండే ఉంటుంది. బహుశా ఇక్కడ మనల్ని

మనం ఆ జీవితానికి తగ్గట్టు మలుచుకుంటున్నామేమో...

మొదటి శిశువు : ఛ ఛ, అలాంటిదేమీ ఉండదు. అయినా అసలు ఇది

కాకుండా ఇంకా ఏమి ఉంటుంది?

రెండో శిశువు : నాకు తెలియదు. కాని అక్కడ ఇంతకన్నా ఎక్కువ

కాంతి ఉంటుంది. బహుశా అక్కడ మనం మన కాళ్లతో

నడుస్తూ, నోటి ద్వారా ఆహారం తీసుకుంటూ ఉంటామేమో. ఇంకా

ప్రస్తుతం మనం అర్థం చేసుకోలేనివి ఇంకా చాలా ఉంటాయి.

మొదటి శిశువు : మనం కదలడమా? నోటి ద్వారా ఆహారం

తీసుకోవడమా?? అసంభవం... మనకు కావలసినదంతా మన బొడ్డు

ద్వారానే మనకు అందుతుంది. కాని అది చాలా తక్కువ పొడవు

ఉంటుంది. కాబట్టి ఇక్కడనుండి బయటకు వెళ్లిపోయాకా

ఉండడం అస్సలు కుదరదు.

రెండో శిశువు : కాని అక్కడ ఇలా ఉండకపోవచ్చు. మనకి బొడ్డు

అవసరం కూడా ఉండదేమో...

మొదటి శిశువు : అదంతా మూర్ఖత్వం. అయినా బయట ఏమైనా

ఉంటే అక్కడ నుంచి ఎప్పుడైనా, ఎవరైనా తిరిగి వచ్చారా? గర్భం

నుండి బయటకు వెళ్ళడం అంటే అది మన అంతం. ఆ తర్వాత

అంతా చీకటి, నిశ్శబ్దం. అంతే... ఇంక ఏమీ ఉండదు.

రెండో శిశువు : సర్లే... నాకు తెలియదులే. కానీ మనం అక్కడకు

వెళ్ళాకా మన అమ్మని కలుస్తాం. మనల్ని తనే

చూసుకుంటుంది.

మొదటి శిశువు : అమ్మా...! నువ్వు అమ్మని కూడా

నమ్ముతున్నావా!? ఇది నిజంగా వెటకారం. నిజంగా అమ్మ అని

ఎవరైనా ఉంటే, ఎక్కడ ఉందో చెప్పు?

రెండో శిశువు : తను మన చుట్టూ ఉంటుంది. మనం

తనలోనే ఉన్నాం. అసలు అమ్మ లేకుండా మనం ఉంటున్న

ప్రపంచం లేదు.

మొదటి శిశువు : నేను తనని ఎప్పుడూ చూడలేదు. అది చాలు

తను లేదు అని చెప్పడానికి.

రెండో శిశువు : ఒక్కోసారి... నువ్వు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు,

వినే దాని మీద దృష్టి నిలిపినప్పుడూ తన ఉనికి నీకు

తెలుస్తుంది. పై నుంచి తన మాటలు కూడా వినిపిస్తాయి.

 

copied fro facebook

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...