Jump to content

50C


NTR_Keka

Recommended Posts

ఎన్టీఆర్ కల తీరినట్లే..!

 

 

టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా హిట్ చిత్రం టెంపర్ సినిమాతో ఎన్టీఆర్, నిర్మాత బండ్ల గణేష్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇలా అందరూ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రూ.50 కోట్ల క్లబ్‌లోకి చేరనున్నాడని ఫిల్మ్‌నగర్ టాక్.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టెంపర్ సినిమా 17 రోజులకు ప్రపంచవ్యాప్తంగా రూ.48 కోట్ల షేర్ రాబట్టింది. సినిమా మూడో వారంలో చాలా థియేటర్లలో రన్ అవుతోంది.

రెండో వారంలో బందిపోటు ప్లాప్ కావడంతో టెంపర్ జోరు బాగా ఉంది. మూడో వారంలో విశాల్ మగమహారాజుతో పాటు రిలీజ్ అయిన చిన్న సినిమాలు ప్లాప్ కావడంతో మూడో వారంలో కూడా టెంపర్ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ లెక్కన చూస్తే మూడో వారం ముగిసే నాటికి టెంపర్ సులువుగా రూ.50 కోట్ల షేర్ మార్క్‌ను క్రాస్ చేయనుందని సమాచారం.

టెంపర్ తర్వాత ఎన్టీఆర్-క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మార్చి 5 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...