Jump to content

ఇక నాకు ఉగాదులు లేవు.. ఉషస్సులులేవు


NTRISMYGOD

Recommended Posts

దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు చెప్పినట్లు

" ఇక నాకు ఉగాదులు లేవు.. ఉషస్సులులేవు
నేను హేమంత కృష్ణానంత శర్వరిని
నాకు కాలం ఒక్కటే కారు రూపు
నా శోకమ్ము వలెనే ..నా బ్రతుకు వలె.. నా వలెనె"

అనిపిస్తూ ప్రతి తారకరాముని అభిమానిని చీకట్లు కమ్మేసిన రోజు ఇది..

మా కథకి ఒక్కడే నాయకుడు
స్థితిగతులు మారినా,ఎక్కడున్నా,ఏమవుతున్నా జీవితకాలపు కథానాయకుడు నందమూరి తారకరాముడు మాత్రమే..

ఉవ్వెత్తున ఉప్పెనలా విరుచుకుపడ్డ ఉష్ణ రక్త కాసారం ఆయన
జడపదార్థమైఉన్న జాతి నిద్దుర వదిలించి జాగృతం చేసిన వైతాళికుడాయన..


నాణేనికి ఒక వైపు
--------------------
పోత పోసిన గ్రీకు శిల్పం
దివ్య మంగళ స్వరూపం

జానపథ గాథల్లోని ధీరోదాత్త నాయకుడు
పురాణపాత్రలకి ప్రాణం పోసిన దైవాంశ సంభూతుడు
చరిత్రలోని చక్రవర్తులెలా ఉంటారో తెర మీద చూపించిన చరితార్థుడు

నేపథ్యంలో 
"శ్రీ రాఘవం దశరథాత్మజమప్రమేయం 
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దయాళతాక్షం
రామం నిశాచర వినాశకరం " అనే శ్లోకం వినిపిస్తుండగా రాజస శాంత గంభీర మందస్మిత అభినయాలని ఒకే ఒక్క హావ భావ విన్యాసం తో పలికిస్తూ త్రేతాయుగపు సాకేతరామునిగా కన్నుల పండువగా నడిచి వచ్చే తారకరాముడు

"జెండాపై కపిరాజు" పద్యానికి కురుసభలో రాయబార సన్నివేశంలో ద్వాపరయుగపు శ్రీ కృష్ణునిగా చిలిపిగా, వయ్యారంగా, కవ్విస్తూ అద్భుతం గా అభినయించిన తారకరాముడు

"దారుణి రాజ్య సంపద మదోన్మత్తము" అంటూ సాగే పద్యానికి మాయజూద సన్నివేశంలో పౌరుష రౌద్ర ఆవేశభరిత నటనతో భీముని పాత్ర కి ప్రాణప్రతిష్ట చేసిన తారకరాముడు

"దేశమదేల యన్న దేశంబు తెలుగేను
యెల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి
యేను తెలుగు వల్లభుండ తెలుగొకొండ
దేశ భాషలందు తెలుగు లెస్స"
అంటూ సాగే పద్యంలో ఆంథ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయని పాత్రలో ఇమిడిపోయిన తారకరాముడు

మయసభలో అవమానానికి గురైన రారాజు గా "పాంచాళీ పంచభర్తృక " అంటూ అలవోకగా ఉచ్చ స్థాయి లో ఈసడింపుగా పదప్రయోగం చేస్తూ అత్మాభిమానం ప్రదర్శించిన తారకరాముడు

కలియుగదైవం శ్రీవెంకటేశ్వరునిగా నటించి ప్రతి చిత్ర ప్రదర్శనాశాలని మందిరం గా మార్చివేసిన యుగపురుషుడు తారకరాముడు

సినీపరిశ్రమలో తిరుగులేని కథానాయకుడిగా వెలుగొందుతున్న సమయంలో పేడిగా బృహన్నల పాత్రలో రసజ్ఞుల మన్ననలందుకున్న తారకరాముడు

అగ్ర కథానాయకునిగా ఉన్న రోజుల్లో ఏ మాత్రం ఆకర్షణ లేని కురుపితామహుడు భీష్ముని పాత్రలో నిర్వికారం,శాంతం,ధర్మం, సౌజన్యం వంటి లక్షణాలని ప్రతిఫలింపచేసిన తారకరాముడు

అమాయకత్వం, నిష్కల్మషం కలబోసిన "పాతాళభైరవి" తోటరాముడైన మా తారకరాముడు

పాత్ర పాత్ర కీ ఆకాశానికి భూమికి ఉన్నంత వైరుధ్యం.. చూపు, నడక, నవ్వు, నటన, వాచకం, మాట పలికే తీరు
----------------------
నాణేనికి రెండో వైపు
----------------------
తాకట్టు లో తెలుగు ఆత్మగౌరవం , స్వరాజ్యం వచ్చినా రాని 'సు'రాజ్యం, మద్రాసి అనే మాయని మచ్చ
జవసత్త్వాలు ఉడిగిన జాతి , పొరలు గ పేరుకుపోయిన పెట్టుబడిదారీ వ్యవస్థ , జవాబుదారి తనం లేని జమానా పాతికేళ్ళ కిందట ' తెలుగుదేశం' ఆవిర్భావానికి కారణాలు అయ్యాయి
జనం గుండె గుడి లో కొలువున్న దేవుడు , తెలుగు వారి రాముడు ,కృష్ణుడు ఐన నందమూరితారక రాముడు సామాజిక అసమానతలని రూపు మాపి , తెలుగు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే వుద్దేశ్యం తో 'తెలుగుదేశం ' పార్టీ ని స్థాపించారు
తొమ్మిది నెలల్లో 
అధికారానికి వచ్చిన తెలుగుదేశం పారదర్శకత , నిజాయతి , సామాజిక బాధ్యత తో కూడిన నూతన రాజకీయాలని తెలుగు వారి ముందు ఆవిష్కరించింది .సుమారు రెండు వందల మందికి విద్యావంతులకి శాసన సభ లో ప్రవేశం కల్పించింది
'సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు' అనే ధర్మ వాక్యంపాటించి పలు సాంఘిక సంక్షేమ కార్యక్రమాల కి ఊపిరిపోసారు ఎన్టీ రామారావు గారు 
మహిళ ల కి ఆస్థి లో సమాన హక్కు ,విద్య వుద్యోగాల్లో ౩౩% అవకాశాలు , కుట్టు వంటి వృత్తి విద్యల్లో ఉచిత శిక్షణ , జీవన భద్రత , మహిళా విశ్వ విద్యాలయ స్థాపన , మండల పాలనా వ్యవస్థ , మెరుగైన రవాణా సౌకర్యాలు , రక్షిత మంచి నీటి పధకాలు, సింగిల్విండో పధకం ద్వారా రైతులకి రుణాలు,ప్రకృతి వైపరీత్యాల సమయం లో రుణ మాఫీలు ,ఉచితం గా పక్కా ఇళ్ళ నిర్మాణం , రెండు రూపాయలకే కిలో బియ్యం , రైతన్న లకి ఉచిత విద్యుత్ .మద్యపాన నిషేధం , జోగినీ దురాచార నిర్మూలన, గరిష్ట భూపరిమితి చట్టం , పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు , వెట్టి చాకిరీ నిషేధం ,అవినీతి లేని అధికార వ్యవస్థ ,స్వయంప్రతిపత్తి గల స్థానిక వ్యవస్థ , రాయలసీమ కి తెలుగు గంగ ద్వారా జలాలు ,సాగు తాగు వసతుల కల్పన, సత్వర న్యాయం కోసం లోకాయుక్త ఏర్పాటు ,ఉన్నత విద్యా ప్రవేశపరీక్షలు ,విద్యారంగం లో ఫీజు రద్దు, వైద్య , తెలుగు విశ్వ విద్యాలయాల ఏర్పాటు , నేత వృత్తుల వారికీ ఆప్కోద్వారా భద్రత , సంస్కుతి పరిరక్షణ కోసం టాంక్బండ్ పై తెలుగు వెలుగుల విగ్రహాల ఏర్పాటు, నక్సలిజం నిర్మూలన,మత కల్లోలాల అణిచివేత , శాంతి భద్రతల రక్షణ వంటి పలు కార్యక్రమాల ద్వారా ఇంటింటిధైవం గా నీరాజనాలు అందుకున్నారు మన అన్న నందమూరి .ఢిల్లీ పెద్దల కళ్లు బైర్లు కమ్మేలా తెలుగు ఆత్మ గౌరవపతాకాన్ని విను వీధుల్లో ఎగరవేశారు ఎన్టీయార్ .

మళ్ళీ పుడతాడా ఇలాంటోడు
ఆ బ్రహ్మకైనా సాధ్యమేనా మరోసారి ఇలాంటోడిని సృష్టించటం 
దేవుళ్ళకైనా ఆయన్ని పౌరాణిక పాత్రల్లో చూస్తే అసూయ కలుగుతుందేమో..
"శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ కమలాక్షునర్చించు కరము కరము" విష్ణువు ని వర్ణించే నాలుకే నాలుకట,, ఆయన్ని పూజించే చేతులే చేతులట,,

మేము చూసిన దేవుడు
మేము నమ్మిన దేవుడు
మా కళ్ళ ముందు నడయాడిన దేవుడు తారకరాముడొక్కడే..

గుడిసె గుడిసెనీ గుడిగా 
మది మదినీ మందిరంగా మలుచుకుని
కోట్లమంది అభిమానులని తన ఆత్మీయ స్మృతుల్లో ఓలలాడిస్తున్న వాడు మా నందమూరి తారకరాముడు..

ఒక కవి ఆయన గురించి చెప్పిన మాటలు అక్షర లక్షలు 
"లేవు తల్లీ లేవిక జనచైతన్య స్ఫోరకాలు
రావు తల్లీ రావిక ప్రతి పూటా ఉత్సవ ఊరేగింపు వేడుకలు"

ఆ స్ఫూర్తి మత్తు ఇంకా వదల్లేదు..
దూరం గా దుమ్ము లేపుతూ వస్తున్న చైతన్య రథం.. అందులో నుండి లీలగా వినిపిస్తున్న "మా తెలుగు తల్లికి మల్లె పూదండ " పాట..అది విని పొలాలకడ్డం పడి పరిగెడుతున్న జనం.

రథంపై అగ్రభాగాన కూర్చున్న దివ్య మంగళ తేజోమయ విగ్రహం..
దగ్గరకు రాగానే 
ఒకరు వేలు కోసుకుని ఆయనకి రక్త తిలకం దిద్దారు..
టెంకాయలు పగులుతున్నాయి ఆయనే దేవుడని మరోసారి చెప్తూ ..


అన్నా అంటూ ఆత్మీయం గా అరుస్తూ తోడబుట్టిన వాడికన్న ఎక్కువగా భావిస్తూ ఒక లిప్తపాటు ఆయన తమ వైపు చూస్తే చాలనుకునే ఆడపడుచుల ఆర్తి...
ఆ ప్రాభవం ఇంకా వీడలేదు..

అహరహమూ జీవనపర్యంతం"నా తెలుగుతల్లి" అంటూ తెలుగు భాషని కలవరిస్తూ తెలుగుభాషని, తెలుగు సంస్కృతిని అంబారీ ఎక్కించి ప్రపంచ వీథుల్లో తిప్పిన అసలైన తెలుగు తల్లి ముద్దుబిడ్డ ఆయన.

భౌతికం గా ఆయన మనని వీడి 19 ఏళ్ళు గడిచినా ఇంకా ఈ తెలుగు నేల పై ప్రతి చెట్టూ పుట్టా ఊరూ వాడా ఆయన జ్ఞాపకాల్లో తాదాత్మ్యం చెందుతున్నాయంటే అతిశయోక్తి కాదు..

ష్హ్.. సడి చెయ్యొద్దు సుమా.. మారాజు నిద్దరోతున్నాడు..

(మా ప్రతి శ్వాసలో నిండి ఉన్న ప్రాణవాయువు , మా దైవం తారకరామునికి అశ్రుబాష్పాలతో అంజలి ఘటిస్తూ..)

(**కాసారం = సముద్రం, కృష్ణ= చీకటి, శర్వరి = రాత్రి)

Link to comment
Share on other sites

excellent article...... 

ఆ స్ఫూర్తి మత్తు ఇంకా వదల్లేదు..
దూరం గా దుమ్ము లేపుతూ వస్తున్న చైతన్య రథం.. అందులో నుండి లీలగా వినిపిస్తున్న "మా తెలుగు తల్లికి మల్లె పూదండ " పాట..అది విని పొలాలకడ్డం పడి పరిగెడుతున్న జనం.

రథంపై అగ్రభాగాన కూర్చున్న దివ్య మంగళ తేజోమయ విగ్రహం..
దగ్గరకు రాగానే 
ఒకరు వేలు కోసుకుని ఆయనకి రక్త తిలకం దిద్దారు..
టెంకాయలు పగులుతున్నాయి ఆయనే దేవుడని మరోసారి చెప్తూ ..

 

అన్నా అంటూ ఆత్మీయం గా అరుస్తూ తోడబుట్టిన వాడికన్న ఎక్కువగా భావిస్తూ ఒక లిప్తపాటు ఆయన తమ వైపు చూస్తే చాలనుకునే ఆడపడుచుల ఆర్తి...
ఆ ప్రాభవం ఇంకా వీడలేదు..

అహరహమూ జీవనపర్యంతం"నా తెలుగుతల్లి" అంటూ తెలుగు భాషని కలవరిస్తూ తెలుగుభాషని, తెలుగు సంస్కృతిని అంబారీ ఎక్కించి ప్రపంచ వీథుల్లో తిప్పిన అసలైన తెలుగు తల్లి ముద్దుబిడ్డ ఆయన.

భౌతికం గా ఆయన మనని వీడి 19 ఏళ్ళు గడిచినా ఇంకా ఈ తెలుగు నేల పై ప్రతి చెట్టూ పుట్టా ఊరూ వాడా ఆయన జ్ఞాపకాల్లో తాదాత్మ్యం చెందుతున్నాయంటే అతిశయోక్తి కాదు..

ష్హ్.. సడి చెయ్యొద్దు సుమా.. మారాజు నిద్దరోతున్నాడు..

 

...ee words chaduvutunnappudu ....ollu gagurpodichindi .............

Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 1 month later...
  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...