Jump to content

TDP MPTC - Eenadu Article


Recommended Posts

Andhra Jyothi lo Krishna Dt lo 24 ekagreevam ani vesadu.. TDP - 17 YCP - 3 ....thatha emo motham 3 ekagreevam ani vesadu..edi nammalo...

 

 

BTK bro, as per Sakshi. ,Kurnol,Kadapa, Praksam lo we are doing bad..  rest  of areas we are doing good/better 

 

 

YSRC 66, TDP ki 59 emo set cesadu Brahmi-8.gif

Link to comment
Share on other sites

vijai....aada soodu...ekagreevaala list lo okkati kooda godavari zillala list lo ledhu....

 

kaneesam maa bochchi lo 25 paisa anna undhi....inka aalla account open seyyakundaane maa meedha paddaadu rulzu...

 

krishna - godavari zilla vaallavi Bava - maradhala sarasaalu annattu....GSB6.gif?1370457845

vizag and west godavari update avvaledanta annai. main lo rasadu eenadu lo..........

Link to comment
Share on other sites

ee kurnool lo antha cheri gabbu lepinattu vunnaru Brahmi-8.gif

టీడీపీకి గోనె గండ్లు
 
Published at: 25-03-2014 04:20 AM
 
 
 
 

ఆంధ్రజ్యోతి - కర్నూలు :

ఎమ్మిగనూరు టీడీపీలో అసంతృప్తులు అధికమవుతున్నారు. నియోజకవర్గ నాయకులు అనుసరించిన ఒంటెద్దు పోకడతో పార్టీ శ్రేణుల్లో అయోమ యం నెలకొంది. దీంతో ఎమ్మిగనూరు రాజకీయం టీడీపీ జిల్లా నేతలకు తలనొప్పిగా మారుతోంది. సోమవారం జడ్పీటీసీ, ఎంపీటీసీల ఉపసంహరణ సమయంలో గోనెగండ్లలోని బలమైన టీడీపీ వర్గానికి చెందిన 10 మంది ఎంపీటీసీ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఫలితంగా ఐదు ఎంపీటీసీ స్థానాలు వైసీపీకి ఏకగ్రీవమయ్యా యి. స్వయంగా ఎమ్మిగనూరు టీడీపీ ఇన్‌చార్జి జ యనాగేశ్వరరెడ్డి వ్యవహరించిన తీరే ఇందుకు కారణమని ఆ పార్టీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. పార్టీ నేతలను సమన్వయ పరచడంలో ఏర్పడిన లోపా న్ని ఎత్తి చూపిస్తున్నాయి.

గోనెగండ్లలో జరిగిందిలా..

గోనెగండ్ల మండల కన్వీనర్‌గా నాగేష్ నాయు డు పార్టీ వ్యవహారాలను చూస్తున్నారు. కొంత కా లం కిందట గాజులదిన్నెకు చెందిన హనుమంతు అనే నాయకుడు పార్టీలో కొత్తగా చేరారు. ప్రస్తుతం జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ లో జడ్పీడీసీ అభ్యర్థిగా హనుమంతు నామినేషన్ వేశారు. హనుమంతుకు జడ్పీటీసీ అవకాశం కల్పిస్తామంటూ గతంలో నియోజవర్గ ఇన్‌చార్జి జయనాగేశ్వరరెడ్డి హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇదే కోవలో గోనెగండ్ల మండల కన్వీనర్ నాగేష్‌నాయుడు దీన్ని వ్యతిరేకించారు. పార్టీని నమ్ముకున్న పాత నాయకులకు అవకాశం కల్పించాల్సిందిగా ఇన్‌చార్జిని కోరినట్టు సమాచారం. దీనికి నాగేశ్వరరెడ్డి అంగీకరించకుండా హనుమంతుకు జడ్పీటీసీ అభ్యర్థిగా బీ ఫా రం అందించినట్టు తెలిసింది. దీంతో నాగేష్‌నాయుడు వర్గం తీవ్ర అసంతృప్తికి గురైంది. నాయుడు వర్గానికి చెందిన 10మంది ఎంపీటీసీ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. హెచ్ కైరవాడి, గంజర్ల, గోనెగండ్ల 1,2,3,4,5, పెద్దమరివీడు, కులమాల, తిప్పనూరు స్థానాల్లో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈ పరిస్థితి వైసీపీకి అనుకూలంగా మారిం ది. దీంతో హెచ్ కైరవాడి, కులమాల, పెద్దనేలటూరు, వేముగోడు, పెద్దరివీడు స్థానాలు వైసీపీకి ఏకగ్రీవంగా ఆ పార్టీ ఖాతాలోకి చేరాయి. నాగేశ్వరరెడ్డి ఒంటెద్దుపోకడను సహించలేని గోనెగండ్ల మండల కన్వీనర్ నాగేష్‌నాయుడు తన పదవికి రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నట్టు సమాచారం. పార్టీలోనే ఉండి కార్యకర్తగా సేవచేస్తానని చెబుతున్నట్టు తెలిసింది.

నందవరంలోనూ ఇదే తీరు..

ఎమ్మిగనూరు టీడీపీ ఇన్‌చార్జి జయనాగేశ్వరరెడ్డి నందవరం మండలంలోనూ ఇదేరీతిన వ్యవహరించారనే విమర్శలున్నాయి. ముందుగా మాజీ జడ్పీటీసీ ఈరన్నగౌడును జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేయాల్సిందిగా నాగేశ్వరరెడ్డి చెప్పినట్టు సమాచారం. దీంతో ఈరన్నగౌడు నామినేషన్ దాఖలు చేశారు. ఇదే కోవలోనే మండల టీడీపీ కన్వీనర్ నా గరాజుగౌడు భార్య పుష్పవతిని కూడా నామినేషన్ వేయాల్సిందిగా నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి చెప్పినట్టు సమాచారం. ఆమె కూడా జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. సోమవారం నాగేశ్వరరెడ్డిని ముందుగా నామినేషన్ వేసిన ఈరన్నగౌడు బీఫారం అడిగినట్టు సమాచారం. చివరకు పుష్పవతికి బీఫారం అందడంతో ఈరన్నగౌడు తీవ్ర అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది. తాము పార్టీకి రాజీనామా చేస్తామని డోన్ ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తి, పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు వారు ఫోన్లో తెలిపినట్టు సమాచారం.

జిల్లా నేతల ఆరా..

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టీడీపీకి కొరవడిన సమన్వయంపై జిల్లా నేతలు కేఈ కృష్ణమూర్తి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరా తీశారు. గోనెగండ్ల, నందవరం టీడీపీ నేతలను పిలిపించుకుని సర్దుబాట్లు చేసేలా చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. నియోజకవర్గ ఇన్‌చార్జిగా జయనాగేశ్వరరెడ్డి వ్యవహరించాల్సిన తీరును ఆయనకు బోధించినట్టు సమాచారం.

పార్టీ ద్రోహానికి పాల్పడ్డారు: బీవీ జయనాగేశ్వరరెడ్డి

ఎమ్మిగనూరు: గోనెగండ్ల మండలం టీడీపీ నా యకుడు నాగేశ్ నాయుడు వైసీపీ నాయకులతో కు మ్మక్కై 10మంది టీడీపీ అభ్యర్థులను బెదిరించి, డబ్బు ఆశ చూపి నామినేషన ్లను విత్‌డ్రా చేయించారని టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జి బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఎంపీపీగా నాగేశ్‌నాయుడుకే అవకాశం కల్పించానన్నారు. అలాగే గోనెగండ్ల మండలంలో అత్యధికంగా ఉన్న కురువ సామాజీక వర్గానికి చెందిన వారికి జడ్పీటీసీగా అవకాశం ఇ చ్చారని తెలిపారు. ఇది సమష్టి నిర్ణయమేనని తెలిపారు. అలాగే సోమవారం పార్టీ కార్యాలయం నుంచి బీ ఫారాలు తీసుకెళ్లారని తెలిపారు. ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం నాగేశ్ నాయుడు వైసీపీ నాయకులతో కుమ్మక్కై అభ్యర్థులకు బీ ఫారాలు ఇ వ్వకుండా బలవంతంగా ఎంపీడీవో ఆఫీసులో తిష్ట వేసి విత్ డ్రా చేయించి పార్టీకి తీవ్ర ద్రోహం చేశారన్నారు. సాయంత్రం 5గంటల వరకు సైతం విత్‌డ్రాలు చేసుకోవడాన్ని బట్టి చూస్తే వైసీపీతో ముందుగానే కుమ్మక్కైయ్యారని అర్థమవుతోందని అన్నారు.

 

EE mathram kuda care teesukopothe elaa

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...