Jump to content

Anil013

Members
  • Content Count

    382
  • Donations

    $0.00 
  • Joined

  • Last visited

Everything posted by Anil013

  1. అమరావతి: మహేశ్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా గుర్తుందా.. ఆ సినిమాలోని ఓ సీన్‌లో వాహనదారులకు సీఎం భరత్ విధించే ఫైన్‌లు గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు ఏపీలో అంత స్థాయి జరిమానాలు కాదు గానీ.. దాదాపుగా భారీ జరిమానాలకు రంగం సిద్ధమైంది. వాహన జరిమానాలు పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో ప్రకారం.. బైక్ నుంచి 7 సీటర్ కార్ల వరకూ ఒకే విధమైన జరిమానా విధించనున్నట్లు జగన్ సర్కార్ స్పష్టం చేసింది.సెల్‌ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ.10000, రేసింగ్‌లో మొదటిసారి పట్టుబడితే రూ.5 వేలు, రెండోసారికి రూ.10 వేల జరిమానా విధించనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా మొదటిసారి పట్టుబడితే రూ.2వేలు, రెండోసారి పట్టుబడితే రూ.5 వేలు జరిమానా విధించనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. పర్మిట్ లేని వాహనాలు నడిపితే రూ.10 వేలు, ఓవర్‌లోడ్‌కు రూ.20 వేలు జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం పెంచిన ట్రాఫిక్ చలాన్ల వివరాలు బైక్‌ నుంచి 7 సీటర్‌ వాహనాల వరకు ఒకే విధమైన జరిమానా సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ. 10 వేల ఫైన్‌ రేసింగ్‌కు‌ పాల్పడితే మొదటిసారి రూ.5 వేలు, రెండోసారి రూ.10 వేలు రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకపోతే మొదటిసారి రూ.2 వేలు ఫైన్‌ రెండోసారి పట్టుబడితే రూ.5 వేలు జరిమానా విధింపు వాహనాలకు పర్మిట్‌ లేకపోతే రూ.10 వేలు, ఓవర్‌లోడ్‌కు రూ.20 వేలు వాహన బరువు చెకింగ్‌ కోసం ఆపకపోతే రూ.40 వేలు ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే రూ.10 వేలు జరిమానా అనవసరంగా హారన్‌ మోగిస్తే మొదటిసారి రూ. వెయ్యి, రెండోసారి రూ.2 వేలు వేగంగా వాహనం నడిపితే రూ. వెయ్యి జరిమానా విధింపు
×