Jump to content

rajanani

Members
 • Content Count

  1,263
 • Donations

  $0.00 
 • Joined

 • Last visited

 • Days Won

  2

Everything posted by rajanani

 1. అర్ణబ్‌ను విచారించేందుకు పోలీసులకు అనుమతి ముంబై: అర్ణబ్‌ను విచారించేందుకు పోలీసులకు అనుమతి అభించింది. ప్రతి రోజూ 3 గంటల పాటు పోలీసులు విచారించవచ్చని అలీబాగ్ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. 2018లో అన్వయ్ నాయక్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రోత్సహించారంటూ ముంబై పోలీసులు ఈ నెల 4వ తేదీ బుధవారం అర్ణబ్‌ను అరెస్టు చేశారు. ఆయనపై కేసు నమోదు చేసి హైకోర్టులో ప్రవేశపెట్టారు. అయితే హైకోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. బెయిల్ కోసం అర్ణబ్ దాఖలు చేసిన పిటీషన్లను కూడా తిరస్కరించింది. ఈ క్రమంలోనే అన్వయ్ కేసులో అర్ణబ్‌ను విచారిచేందుకు ముంబై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే తామేమీ చేయలేమని, అవసరమైతే దిగువ కోర్టుకు వెళ్లమని ధర్మాసనం సూచించింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అలీబాగ్ సెషన్స్ కోర్టుకు వెళ్లడంతో ప్రధాన న్యాయమూర్తి విచారణకు అనుమతించారు. తలోజా జైల్లో ప్రతి రోజూ 3 గంటల పాటు అర్ణబ్‌ను విచారించాల్సిందిగా తీర్పునిచ్చారు.
 2. వేతనాలు, పెన్షన్లకు డబ్బుల్లేవు రుణాలపై బ్యాంకులతో భేటీలు అవి కరుణిస్తేనే చెల్లింపులకు దారి ఉద్యోగుల డీఏ చెల్లింపు నిలిపివేత అమరావతి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 40 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్‌ ఉద్యోగులకు ఇంత వరకు వేతనాలు, పెన్షన్లు అందలేదు. ఖజానాలో పైసా కూడా లేకపోవడమే ఇందుకు కారణం. కొవిడ్‌ విధుల కోసం నాలుగు నెలల క్రితం కొత్తగా భర్తీ చేసుకున్న వైద్యులు ఒక్క నెల జీతమూ అందుకోలేకపోయారు. అప్పుల సమీకరణకు ఉన్న అవకాశాలన్నీ మూసుకుపోవడంతో ఈ నెల ప్రారంభమై వారం గడుస్తున్నా వేతనాలు, పెన్షన్లు పూర్తిస్థాయిలో ఇవ్వలేని పరిస్థితి. మరోవైపు, అప్పుల కోసం బ్యాంకులతో ప్రభుత్వం వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. గురువారం సచివాలయంలో ఐదు బ్యాంకులతో ఆర్థికశాఖ అధికారులు అప్పుల కోసం చర్చలు జరిపారు. తక్షణమే రూ. 6,000 వేల కోట్లు అప్పు కావాలని బ్యాంకులతో మాట్లాడినట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రభుత్వానికి గ్యారంటీ స్పేస్‌ రూ. 6000 కోట్లు మాత్రమే ఉండడంతో ఆ 5 బ్యాంకులు కలిసి ఆ మొత్తం ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలిసింది. శనివారం ఖజానాలో ఆ నిధులు జమ అవుతాయని అధికారులు భావిస్తున్నారు. అవి అందితే సోమవారం నుంచి పెన్షనర్లకు, మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు అందే వీలుంది. చెల్లించలేం: ఆర్థిక శాఖ ప్రస్తుత రేట్లతో జూలై 2021 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏ చెల్లింపులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది. అదేవిధంగా జనవరి 1, 2020 నుంచి వారికి ఇవ్వాల్సిన డీఏ అదనపు వాయిదా చెల్లింపులూ ఆపేసింది. జనవరి 1, 2020 నుంచి జూన్‌ 30, 2021 వరకు చెల్లించాల్సిన బకాయిలు కూడా చెల్లించే పరిస్థితి లేదని తేల్చేసింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. కొవిడ్‌, లాక్‌డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా ఆదాయం పడిపోవడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం జూలై 2021 వరకు డీఏ చెల్లింపు నిలిపేసింది. రాష్ట్రం కూడా అదే పరిస్థితిలో ఉండటంతో కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా ఈనిర్ణయం తీసుకున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 3. సగం మందికి ఇంకా జీతాల్లేవ్..! ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల్లో 40 శాతం మందికిజీతాలు అందలేదు. పెన్షన్లు అందలేదు. కారణం ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడమే. గత నెలాఖరులో ఆర్బీఐ నుంచి రూ. రెండు వేల కోట్లు అప్పులు చేశారు. వాటితో పాటు వచ్చిన కొంత పన్నుల ఆదాయం కలిపి జీతాలు చెల్లించడం ప్రారంభించారు. ఉన్నంత వరకూ ఇస్తూ వస్తున్నారు. అప్పటికి ఇలా ఆరో తేదీకి అరవై శాతం మందికి చెల్లించారు. ఇంకా నలభై శాతం మందికి చెల్లించాల్సి ఉంది. ఓ వైపు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. పోలవరం కోసం ఇవ్వాల్సిన రూ. రెండు వేల రెండు వందల కోట్లు అయినా ఇస్తే ఎలాగోలా సర్దుబాటు చేసుకుందామని ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. మరో వైపు ఏపీ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు.. అప్పుల కోసం బ్యాంకర్లను సచివాలయానికి పిలిచి రాచమర్యాదలు చేసి అప్పు ప్లీజ్ అంటున్నారు. ఇలా ఎస్‌బీఐ క్యాప్‌ను కన్సల్టెంట్‌గా పెట్టుకుని.. కమిషన్లు ఇచ్చి.. ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుచేసి.. ప్రయత్నిస్తే.. రూ. ఆరు వేల కోట్లు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇవి మంజూరు కావాలంటే సవాలక్ష నిబంధనలు ఉన్నాయి. వాటిని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగారుణం వస్తుంది. అప్పుడు మిగిలిన ఉద్యోగులకు పెన్షన్, జీతాలు పంపిణీ చేస్తారు. రాను రాను ఆర్థిక పరిస్థితి భారతంగా మారుతూండటంతో ఉద్యోగులకు మూడు డీఏలు కోత విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల కిందటే.. జగన్ మూడు డీఏలు ఇస్తున్నామని ప్రకటించారు. ఎప్పుడెప్పుడు అమలు చేస్తామో కూడా చెప్పారు. లాక్ డౌన్ పేరుతో కత్తిరించిన జీతం కూడా ఐదు వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడేమో.. మూడు డీఏలు అసలు చెల్లించలేమని చేతులెత్తేశారు. నేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఉద్యోగులకు పెద్ద ఎత్తున నష్టం జరగనుంది. ఉద్యోగుల తరపున మాట్లాడేవారందరూ… “సామాజిక” బాధ్యతగా ప్రభుత్వం వైపే మాట్లాడుతూండటంతో… ఉద్యోగులు అన్యాయమైపోతున్నారు.
 4. Highlight is దశదినకాండ🤣🤣
 5. ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నారు గా. బాగా అయ్యింది వీడికి
 6. జనసేన ఖాతా లో మరో విజయం అన్నమాట
 7. ముంబయి: రిపబ్లిక్‌ టీవీ చీఫ్‌ ఎడిటర్‌ అర్ణబ్‌ గోస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఇంటీరియర్‌ డిజైనర్‌, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారన్న ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విషయంలో రాయిగఢ్‌‌, ముంబయి పోలీసులు ఓ సంయుక్త‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఏపీఐ సచిన్‌ వాజే నాయకత్వంలోని పోలీసు బృందం అర్ణబ్‌ గోస్వామిని అదుపులోకి తీసుకుంది. 2018లో కాన్‌కార్డ్‌ డిజైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ అన్వయ్‌ నాయక్‌, ఆయన తల్లి ఆత్మహత్యలకు సంబంధించిన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వివరించారు. అర్ణబ్‌పై ఐపీసీ సెక్షన్‌ 306, 34 కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, అర్ణబ్‌కు చెందిన రిపబ్లిక్‌ టీవీ టీఅర్పీ రేటింగ్స్‌ కోసం మోసాలకు పాల్పడిందన్న ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
×