Jump to content

rajanani

Members
 • Content Count

  576
 • Donations

  $0.00 
 • Joined

 • Last visited

About rajanani

 • Rank
  Advanced Fan

Profile Information

 • Gender
  Array
 • Location
  Array

Recent Profile Visitors

1,113 profile views
 1. 2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున నర్సాపురం నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గోకరాజు గంగరాజు మొదట్నుంచి బీజేపీకి సన్నిహితంగా ఉంటూ కీలకనేతగా ఉన్నారు. బీజేపీ కంటే ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీతోనూ సన్నిహితంగా ఉండేవారు. ప్రస్తుత కేంద్ర మంత్రి అమిత్ షా ఎప్పుడు ఏపీకి వచ్చినా గోకరాజు అతిథి గృహంలోనే బస చేసేవారు. అమిత్ షాకు గోకరాజు సన్నిహితుడు.
 2. అ'హల్య 'మ'నిషిగా మారడానికి 'రా'యిలా వేచి 'వ'నవాసంలో రాముడి కాలు తగిలి 'తి'రిగి అహల్య అయినట్టు అమరావతి అమరావతిగానే మారుతుంది అది నాయుడి రాకకోసం వేచి చూస్తుంది. అమరావతి నుండి దొంగలా వచ్చిన ఇంద్రుడి నిందతో శాశ్వతంగా అహల్య రాయిగానే పడివుండలేదు. from Twitter
 3. శంకుస్థాపన స్థలం వద్ద ప్రణమిల్లిన బాబు గుంటూరు: ఏపీ రాజధాని అమరావతి పర్యటనలో ఉన్న చంద్రబాబు..ఉద్దండరాయుడిపాలెం వద్ద గతంలో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. స్థానిక రైతులు, మహిళలు పూలు జల్లుతూ ఆయనకు స్వాగతం పలికారు. ప్రపంచం గర్వించే రాజధాని నిర్మాణం కొనసాగించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. రాజధాని నిర్మాణం ఆపడం అంటే.. 33వేల ఎకరాల భూమిని త్యాగం చేసిన రైతులను అవమానించడమే అని వారు పేర్కొన్నారు. అనంతరం వారందరితో కలిసి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశానికి వెళ్లి.. అక్కడ చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ పర్యటన అందుకే: బాబు 5 కోట్ల ఆంధ్రుల కోసం చేపట్టిన రాజధాని నిర్మాణాన్ని కుట్రపూరితంగానే వైకాపా సర్కారు నిలిపివేసిందని చంద్రబాబు ఆరోపించారు. వైకాపా దురుద్దేశం తప్ప.. ఇక్కడ పనులు ఆపడానికి కారణాలేమీ కనిపించడం లేదన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన కట్టడాలను అర్ధాంతరంగా ఎలా ఆపివేశారో?దీనిపై వైకాపా కుట్రలేంటో చాటేందుకే అమరావతిలో పర్యటిస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.
 4. మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాత్రికి రాత్రే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడణవీస్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్‌ పవార్‌ రాజీనామా చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఫడణవీస్‌ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. రేపు సాయంత్రం 5 గంటల్లోపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఫడణవీస్‌ రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బలపరీక్షకు ముందే ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్ వ్యూహాత్మకంగా చక్రం తిప్పారు. కుటుంబసభ్యులతో అజిత్ పవార్‌పై ఒత్తిడి తేవడంతో ఆయన వెనక్కి తగ్గారు. ఉపముఖ్యమంత్రికి రాజీనామా చేశారు. దీంతో భాజపా పరిస్థితి డోలాయమానంలో పడింది. ఈ కారణంగా దేవేంద్ర ఫడణవీస్‌ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఫడణవీస్‌ మీడియా ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. ఒక్క భాజపానే 105 సీట్లలో గెలిచింది. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమయ్యాం. అయితే శివసేననే అధికారం కోసం బేరసారాలు జరిపింది. ఆ పార్టీ చెబుతున్నట్లుగా మేం ఎలాంటి హామీలు ఇవ్వట్లేదు. శివసేన నిర్ణయం కోసం భాజపా వేచి చూసినప్పటికీ.. అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ తర్వాత ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్‌ పవార్‌ భాజపాకు మద్దతిచ్చేందుకు ముందుకొచ్చారు. అయితే చివరి నిమిషంలో ఆయన కూడా వెనక్కి తగ్గారు. కూటమిలో కొనసాగలేనని, రాజీనామా చేస్తానని అజిత్‌ చెప్పారు. ఎమ్మెల్యేలను చీల్చలేనని, బేరసారాలకు పాల్పడలేనని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మా దగ్గర సరిపడా సంఖ్యా బలం లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేం. అందుకే ముఖ్యమంత్రిపదవికి రాజీనామా చేస్తున్నా. రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా సమర్పిస్తా. ప్రతిపక్షంలో ఉండి ప్రజా గొంతుక వినిపిస్తా’ అని ఫడణవీస్‌ చెప్పారు. నాలుగు రోజుల ముఖ్యమంత్రి ఎంత అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టారో.. అంతే ఊహించని రీతిలో ఫడణవీస్‌ ఆ పీఠం నుంచి కిందికి దిగారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నాలుగురోజుల్లోనే ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మీడియా సమావేశంలో తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను వెల్లడించిన ఫడణవీస్‌.. రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా లేఖను సమర్పించనున్నట్లు తెలిపారు. ఇక తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని.. ప్రజావాణిని వినిపిస్తామని వెల్లడించారు.
 5. తెలుగుదేశం పార్టీని వదిలి పెట్టకపోతే మీ ప్రాణాలకు హామీ ఇవ్వలేమని ఒక ఎమ్మెల్యేను బెదిరించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వ్యాపారాలు, గనులు ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపైకి విజిలెన్స్‌ అధికారులను ఉసిగొల్పుతున్నారు. కిందిస్థాయి నాయకులపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. ఆర్థిక శాఖకు చెందిన ఒక అధికారి సెలవుపై వెళ్లిపోవడానికి సమాయత్తం అవుతున్నారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సైతం జనవరి తర్వాత తాను ఎమ్మెల్యేగా మాత్రమే ఉండాలనుకుంటున్నానని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు ప్రచారం జరుగుతోంది. ‘‘ఉద్యోగులకు జీతాలు చెల్లించిన తర్వాత మా శాఖ వద్ద రెండు లక్షల రూపాయలు ఉన్నాయి. మీ శాఖ వద్ద లక్ష మాత్రమే ఉంది. అంటే నీ కంటే నేనే రిచ్‌’’ అని ఒక శాఖ అధికారి మరో శాఖ అధికారిని ఉద్దేశించి వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఆర్థిక వ్యవహారాలలో ఇదే ధోరణి కొనసాగితే ఆర్థిక ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడినా ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదని ఒక సీనియర్‌ అధికారి అభిప్రాయపడ్డారు. చంద్రబాబును తిట్టిపోసిన ప్రస్తుత అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ఇప్పుడు సమర్థించడాన్ని దిగజారుడుతనం అని అనకుండా ఎలా ఉండగలం తాను పంచె కట్టుకుని తిరిగినంత మాత్రాన తెలుగు భాష– సంస్కృతి బతికిపోయినట్టేనని ఆయన భావిస్తున్నారేమో తెలియదు. ఢిల్లీలో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని పట్టుకుని హిందీ అకాడమీ అధ్యక్ష పదవిని పొందిన వైఎల్‌పీ.. నిన్నటివరకూ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును తిట్టిపోసి.. జగన్మోహన్‌రెడ్డి వద్ద మార్కులు సంపాదించడం ద్వారా అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి పొందారు. ప్రెస్‌ డే కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొంటున్నారని తెలిసి, ఆ కార్యక్రమానికి హాజరవ్వడానికి జగన్మోహన్‌రెడ్డి నిరాకరించిన విషయం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు తెలుసో? లేదో?
 6. నిరారక్షత నిర్మూలించాలనుకున్న ప్రసిద్ధి సంఘ సస్కర్త దీవిత పరమార్ధం అయిన రాజిక సౌద్యాన్యాన్ని పునర్నిర్మించడంలో విఫలమవుతున్న కారణంగా #YouAreTransferred
 7. Eenadu అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మికంగా బదిలీ అయ్యారు. గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా ఆయన్ను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి (పొలిటికల్‌) ప్రవీణ్‌ ప్రకాశ్‌ పేరుతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తక్షణమే రిలీవ్‌ అయి.. సీసీఎల్‌ఏకి బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. మరో ఐదు నెలల సర్వీసు ఉండగానే ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేయడం గమనార్హం. బిజినెస్‌ రూల్స్‌ మార్పిడి విషయంలో సీఎం కార్యాలయ కార్యదర్శి, జీఏడీ పొలిటికల్‌ కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్‌ ప్రకాశ్‌తో నెలకొన్న వివాదం నేపథ్యంలోనే ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ జరిగినట్టు తెలుస్తోంది. గత వారంలో ప్రవీణ్‌ప్రకాశ్‌ బిజినెస్‌ రూల్స్‌ వ్యవహారంలో వివాదాస్పద జీవో ఒకటి విడుదల చేయడంతో దీనిపై ఆయన వివరణ ఇవ్వాలని కోరుతూ గత నెల 31న సీఎస్‌ కార్యాలయం ప్రవీణ్‌ప్రకాశ్‌కు షోకాజ్‌ నోటీసులు జారీచేసినట్టు సమాచారం. దీనిపై రెండు రోజుల్లో ప్రవీణ్‌ప్రకాశ్‌ వివరణ ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో ఆయన బదిలీ కావడం ప్రభుత్వ వర్గాల్లో సంచలనంగా మారింది. గడిచిన ఎన్నికల తర్వాత ఎన్నికల సంఘం ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎస్‌గా నియమించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన సీఎస్‌గానే కొనసాగుతున్నారు. ఈ బదిలీ వ్యవహారంపై ఎల్వీ సుబ్రమణ్యం ఇంకా స్పందించాల్సి ఉంది.
 8. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేశారు. ఆయనను బాపట్లలో ఉన్న మానవ వనరుల విభాగం ఇన్‌స్టిట్యూట్‌కు బదిలీ చేశారు. ఎల్వీ సుబ్రమణ్యం వెంటనే తన విధులను భూ పరిపాలన విభాగం చీఫ్ కమిషనర్‌కు అప్పగించి.. వెంటనే వెళ్లి తన విధుల్లో చేరాలని జగన్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. చీఫ్ సెక్రటరీ రేసులో నీలం సహానీ, సునీల్ శర్మ ఉన్నట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ అఖిల భారత సర్వీసు అధికారుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఎల్వీ సుబ్రమణ్యం నోటీసు ఇచ్చారు. జగన్ ప్రభుత్వం గత కేబినెట్‌లో ‘వైఎస్ఆర్ అవార్డు’ పేరుతో ఓ కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. అయితే, దానికి సంబంధించిన ఫైల్ మీద ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ సూచించారు. కానీ, ఆ పనిచేయకుండా ప్రవీణ్ ప్రకాష్ నేరుగా కేబినెట్‌లో ప్రవేశపెట్టినట్టు సమాచారం. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎల్వీ సుబ్రమణ్యం.. ప్రవీణ్ ప్రకాష్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆగ్రహంతోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేసినట్టు సమాచారం.
 9. News18 Telugu @News18Telugu జగన్ షాకింగ్ నిర్ణయం.. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంపై బదిలీ వేటు.. అంతర్యుద్ధం ఆరు నెలలకే మొదలు
 10. ప్రపంచ రికార్డు సృష్టించిన మన #జలగడు ప్రపంచం లోనే ఇప్పటివరకూ ఏ ముఖ్యమంత్రి కీ దక్కని అరుదైన గౌరవం దక్కించుకున్న మన #ముఖ్యకంత్రి
 11. https://www.eenadu.net/newsdetails/16/2019/10/30/119034254/Govt-may-float-‘amnesty-scheme-for-unaccounted-gold దిల్లీ: బంగారమంటే ఇష్టపడని వారు ఎవరుంటారు.. మన దేశంలో పసిడి ప్రియులు ఎక్కువే. అయితే ఇటీవల నల్లధనాన్ని పసిడి రూపంలో దాచుకుంటున్న నేపథ్యంలో ఆ బంగారాన్ని బయటకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త క్షమాభిక్ష పథకాన్ని తీసుకురానున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. నిర్ణీత పరిమాణానికి మించి బంగారం ఉంటే తెలియజేసేలా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. నల్లధనాన్ని బంగారం రూపంలో దాచుకునేవారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆదాయపు పన్ను ఆమ్నెస్టీ తరహాలో బంగారం కోసం ప్రత్యేక పన్నుమాఫీ పథకాన్ని తీసుకురానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ పథకం కింద వ్యక్తులు వద్ద నిర్ణీత పరిమితికి మించి ఉన్న బంగారాన్ని వెల్లడించి దానిపై పన్నులు చెల్లించే అవకాశం కల్పిస్తారని సదరు వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఆ పన్ను రేటు ఎంత ఉంటుంది..? పరిమితులకు సంబంధించిన ఇతర నిబంధనలను ఇంకా నిర్ణయించలేదని తెలిపాయి. వ్యక్తి లేదా కుటుంబం వద్ద పరిమితికి మించి బంగారం ఉంటే అది ఎంత మొత్తంలో ఉందో, మార్కెట్‌ ప్రకారం ఎంత విలువ ఉందో ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రశీదు లేకుండా కొనుగోలు చేసిన బంగారంపైనా పన్ను విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్షమాభిక్ష పథకం నిర్దిష్ట కాలపరిమితిలో మాత్రమే వర్తించనున్నట్లు సదరు వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ గడువు ముగిసిన తర్వాత బంగారం నిర్ణీత పరిమితికి మించి దొరికితే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందట! అయితే పెళ్లైన మహిళల వద్ద ఉన్న బంగారానికి ఇప్పటికే ఉన్న పరిమితికి మించి మరికొంత మినహాయింపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రెవెన్యూ శాఖ సంయుక్తంగా ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వ శాఖ తమ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్‌ ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి అక్టోబరు 2వ వారంలో దీనిపై చర్చించాల్సి ఉండగా.. మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల దృష్ట్యా వాయిదా వేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇక దేవాలయాల్లోని బంగారాన్ని ఉత్పాదక పెట్టుబడిగా మలిచేందుకు మరో ప్రకటన ఇవ్వాలని కూడా కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. దేశంలో నల్లధనం నిర్మూలించేందుకు 2016లో రూ.1000, రూ.500నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి కొందరు పెద్దమొత్తంలో నల్ల ధనాన్ని పసిడిలో పెట్టుబడి పెడుతున్నారు. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు.
 12. Mari teachers, lectures etc. ki extra income yela vastundi ? Ee teachers batch asale mamulu rakalu kaadu. my mother is retired govt. employee. prathi nela Pension 5th or 6th ki vastondi. Inthaka mundu exact ga 1st ki vachedi. Chala mandiki 10th ki gaani ravatamledu
 13. Sand issue ki main ga 3 reasons cheptunnaru 1. Prathi cement basta meeda Rs 10/- Commision adigadanta companies ni. They denied and seeing this crisis now they are telling can give Rs 5/- only. 2. Real estate ventures and construction companies lo mostly kammas vunnarani, vaallani debbakottataniki. 3. As usual income for MLAs
 14. Matter emitante RK garu, jagan ki Ichina time 1 year matrame. Tharuvatha jail guarantee ani cheppesaru రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ, పథకాల అమలు విషయంలో వెనకడుగు వేయకపోవడంలో జగన్మోహన్‌రెడ్డికి పక్కా వ్యూహం ఉందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదో ఒకరోజు తనకు ముప్పు తప్పదని జగన్మోహన్‌రెడ్డి బలంగా నమ్ముతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. జగన్‌ ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత పెరిగిందన్న నమ్మకం కుదిరాక ఆయనకు బెయిల్‌ రద్దు చేయించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పావులు కదపడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకు బీజేపీ పెద్దలు పెట్టుకున్న గడువు మరో ఏడాది మాత్రమే! పరిస్థితులు వికటించి తనకు బెయిల్‌ రద్దు అయినా, అవినీతి కేసులలో శిక్ష పడినా ప్రజలలో మాత్రం మంచివాడుగా మిగిలిపోవడానికై జగన్మోహన్‌రెడ్డి తనదైన శైలిలో వ్యూహరచన చేసుకున్నారని చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుమతించకపోయినా ప్రజాధనాన్ని పంచిపెట్టే కార్యక్రమాన్ని కొనసాగించాలనీ, తద్వారా ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలనీ జగన్‌ భావిస్తున్నారట. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆలోచనా ధోరణిని కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా గమనిస్తున్నారు. రాష్ట్రం ఆర్థికంగా కుదేలై పథకాల అమలుకు నిధులు కొరత ఏర్పడి అవి నిలిచిపోయే వరకు జగన్‌ జోలికి వెళ్లకూడదన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తున్నది. ఈ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిళ్లు, విమర్శలు వస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం సంయమనంగా ఉంటోందని చెబుతున్నారు. తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్‌ చుట్టూ ఉచ్చు బిగించడానికి సన్నద్ధం అవుతున్న కేంద్ర ప్రభుత్వం.. జగన్మోహన్‌రెడ్డి విషయంలో తొందరపడకూడదన్న నిర్ణయానికి వచ్చింది. జరగబోయే పరిణామాలను గ్రహించడం వల్లనే ముఖ్యమంత్రి జగన్‌ కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద వినయాన్ని ప్రదర్శిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా తిప్పుకొన్నా.. ఓపికగా వేచివుండి మరీ ఆయన్ను పుట్టినరోజునాడు కలిసి అభినందనలు తెలపడానికి ఇదే కారణమని పరిశీలకులు అంటున్నారు. కమ్మ సామాజికవర్గానికి చెందినవారిని ఆర్థికంగా దెబ్బతీస్తే తెలుగుదేశం పార్టీ దానంతట అదే బలహీనపడుతుందన్నది తమ నాయకుడి అంచనాగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే కమ్మ సామాజికవర్గానికి చెందినవారు పోలీసు శాఖలో.. కనీసం పోలీస్‌ స్టేషన్లలో కానిస్టేబుల్‌ పోస్టులలో ఒకేచోట ఎక్కువ మంది లేకుండా బదిలీ చేస్తున్నారని ఆయన వివరించారు. డీఎస్పీ ఆ పైస్థాయి అధికారులు 40 మందిని వేకెన్సీ రిజర్వ్‌లోకి పంపగా అందులో 30 మంది కమ్మ సామాజికవర్గానికి చెందినవారే కావడం యాధృచ్ఛికం కాకపోవచ్చు. కమ్మ సామాజికవర్గానికి చెందినవారికి ఏ మాత్రం సహాయం చేసినట్లు తెలిసినా మీపై చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్వయంగా చెబుతున్నారని ఒక అధికారి చెప్పుకొచ్చారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందిన కమ్మ సామాజికవర్గానికి చెందిన వారినందరినీ ముందుగా టార్గెట్‌ చేయండి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను ఆర్థికంగా దెబ్బతీయండి అని ముఖ్యమంత్రి చెబుతుంటే మేం మాత్రం ఏం చేయగలం?’’ అని ఆ సీనియర్‌ పోలీస్‌ అధికారి పేర్కొనడం గమనార్హం. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారమే ఇందుకు నిదర్శనమని సదరు అధికారి వెల్లడించారు. కమ్మ సామాజికవర్గానికి చెందినవారు బతికి బట్టకట్టాలంటే వైసీపీ పంచన చేరాల్సిన పరిస్థితులను రాష్ట్రంలో కల్పించారు. వైసీపీలో చేరినా ద్వితీయ శ్రేణి పౌరులుగానే ఉండాల్సిన పరిస్థితి ఉందనీ, అయితే మనుగడ కోసం తప్పడంలేదనీ ఇటీవలే ఆ పార్టీకి చెందిన ఒక కమ్మ సామాజికవర్గం నాయకుడు ఆవేదన వ్యక్తంచేశారు. డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉదంతమే ఇందుకు నిదర్శనమనీ ఆయన గుర్తుచేశారు. నిజానికి కమ్మవాళ్లను ఇంతగా టార్గెట్‌ చేయవలసిన అవసరం లేదనీ, అయితే ఆ విషయాన్ని మేమెవ్వరం కూడా ముఖ్యమంత్రికి చెప్పలేకపోతున్నామనీ రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఒక మంత్రి సైతం వ్యాఖ్యానించారు.
×