Jump to content

Vulavacharu

Members
  • Posts

    1,298
  • Joined

  • Last visited

  • Days Won

    2

Posts posted by Vulavacharu

  1. 45 minutes ago, swarnandhra said:

    6+4 service lanes vunna NH-5, 80 meters vuntundi. konni chotla 90 meters varaku vuntundi(at under passes). ee ORR ki  8+4 anukunna 100m chalu. 150 meters lekka ento mari.

    Future expansions, railway line and greenary kosam

  2. 2 hours ago, sonykongara said:
    కృష్ణా తీరంలో శ్రీవారి ఆలయం
    20 ఎకరాల్లో తితిదే ఆధ్వర్యంలో నిర్మాణం
    దొనకొండలో నిర్మాణ నగరం
    డిసెంబరు 15కి తాత్కాలిక హైకోర్టు భవనం సిద్ధం
    సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో పలు నిర్ణయాలు
    రాజధాని పనుల పురోగతిని సమీక్షించిన ముఖ్యమంత్రి
    4ap-main10a.jpg

    ఈనాడు, అమరావతి: కృష్ణానది ఒడ్డున పవిత్రసంగమం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించనున్నారు. ఇందుకు 20 ఎకరాలు కేటాయిస్తూ బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తితిదే వీలైనంత త్వరలో దేవాలయం ఆకృతులు సిద్ధంచేసి, వాటిపై ప్రజాభిప్రాయం తెలుసుకుని, వెంటనే పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతం, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ పవిత్రసంగమం వద్ద కట్టే ఐకానిక్‌ బ్రిడ్జి సమీపంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తారు. వైకుంఠపురం రిజర్వాయర్‌ దగ్గర కృష్ణానదిపై నిర్మించే వారధి ఐకానిక్‌గా ఉండాలని సీఎం ఆదేశించారు. వివిధ ప్రాంతాల్ని అమరావతికి అనుసంధానం చేస్తూ కృష్ణా నదిపై నిర్మించే డజనుకుపైగా వారధులన్నీ రాజధానికి మకుటాయమానంగా నిలవాలన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండ వద్ద నిర్మాణ నగరాన్ని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. మొదట 61.77 ఎకరాల్లో ట్రేడ్‌ సెంటర్‌లా దీన్ని నెలకొల్పుతారు. ఇక్కడ వ్యాపార కార్యలాపాలు ప్రారంభించేందుకు ఇప్పటికే 610 కంపెనీలు ముందుకొచ్చాయని ఏపీటిడ్కో అధికారులు వివరించారు. భవిష్యత్తులో ఈ నగరాన్ని తయారీ, నిర్మాణ రంగ సామగ్రి, పరికరాలకు సంబంధించిన హబ్‌గా తీర్చిదిద్దుతారు. మొదటి దశలో కార్పొరేట్‌ కార్యాలయాలు, నిర్మాణ సామగ్రి ప్రదర్శన కేంద్రాలు, గిడ్డంగులు, గ్రీన్‌ బెల్ట్‌, పార్కింగ్‌ ప్రాంతం, ఫుడ్‌ ప్లాజా, క్రేన్లు వంటి భారీ వాహనాలు, పరికరాల కోసం సింగపూర్‌ భాగస్వామ్యంతో ప్రదర్శన కేంద్రం ఏర్పాటు చేస్తారు. ‘‘కేవలం నిర్మాణ సామగ్రి తయారీకి నెలవుగానే కాకుండా, నిర్మాణరంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు, నవ్యావిష్కరణలకు ఆలవాలంగా, సాంకేతిక, వైజ్ఞానిక కేంద్రంగా ఉండాలి. దీర్ఘకాల మన్నిక, అందుబాటు ధర, ఆకట్టుకునే ఆకృతులు, ఆధునిక నగర ప్రణాళికలకు సంబంధించిన నూతన ఆలోచనలకు వేదికగా నిలవాలి’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు, చర్చకు వచ్చిన అంశాలు ఇలా ఉన్నాయి.
    * రాజధానిలో రహదారుల నిర్మాణ పురోగతి ఆశించినంత వేగంగా లేకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ 36 శాతం పనులే పూర్తయ్యాయని, రూ.కోట్లు వెచ్చించి పెట్టుకున్న కన్సల్టెన్సీ సంస్థలు ఏం చేస్తున్నాయని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
    * వీజీటీఎం-ఉడా కింద ఉన్న ప్లానింగ్‌, ఇంజినీరింగ్‌, అడ్మినిస్ట్రేషన్‌, నాలుగో తరగతి ఉద్యోగుల్ని సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు.
    * రాజధానిలో సొంత ఫ్లాట్ల కొనుగోలుకు ఉద్యోగులు, న్యాయవాదులు, ఇతర వర్గాల నుంచి వస్తున్న డిమాండ్‌ దృష్ట్యా సీఆర్‌డీఏ వెయ్యి ఫ్లాట్లను వాణిజ్య ప్రాతిపదికన నిర్మించేందుకు ఆమోదించింది.
    * దేశంలోనే అతిపెద్ద డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ వ్యవస్థను రాజధానిలో ఏర్పాటు చేయనున్నారు.
    * అమరావతిలో భూములు కేటాయించిన 8 పాఠశాలల నిర్మాణాలు త్వరలో ప్రారంభం.
    * త్వరలో ఒక ఫైవ్‌స్టార్‌, నాలుగు ఫోర్‌స్టార్‌, నాలుగు త్రీస్టార్‌ హోటళ్ల నిర్మాణాలు ప్రారంభం.
    * అమరావతిలోని శాఖమూరు పార్కులో భాగంగా 7.5 ఎకరాల్లో నిర్మించే ఎత్నిక్‌ విలేజ్‌లో ఎకరం విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌ క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో హస్తకళల కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
    * రాజధాని ప్రాంతంలోని కొండలన్నింటినీ  వివిధ రకాల పుష్పజాతులతో సుందరంగా తీర్చిదిద్దాలి.
    * నీరుకొండలో ఎన్టీఆర్‌ మెమోరియల్‌, మ్యూజియం ఆవరణలో ట్రాక్‌ రహిత టాయ్‌ ట్రైన్‌, స్టార్‌ హోటళ్లు, రిసార్టులు, స్పోర్ట్స్‌ రిక్రియేషన్‌ క్లబ్బుల ఏర్పాటుకి ప్రతిపాదనలు.
    * డిసెంబరు 15 నాటికి తాత్కాలిక హైకోర్టు భవనం సిద్ధం చేయాలని సీఎం ఆదేశం.
    * నగరాల్లో రోడ్డు మీద నీరు నిలిస్తే సంబంధిత అధికారిని సస్పెండ్‌ చేయాలి.

    Is this the new temple he is talking about instead developing Vaikunthapuram temple?

    or

    both in plans?

  3. 10 hours ago, sonykongara said:

    gannavaram ante ne vasthara db ki

    Ledu brother. Ee madhya koncham busy aiyyanu. News paper choose time kooda dorakadam ledu.

    Quick ga ikkada meeru post chestunna news choostunnanu.  Really appreciate your efforts.

    Koncham time dorakagane malli post chesta. 

  4. 17 hours ago, sonykongara said:
    మేలో.. హెచ్‌సీఎల్‌
    26-04-2018 10:07:50
     
    636603340703416739.jpg
    • ఎయిర్‌పోర్టు ఎదురుగా భూమిపూజ
    • ప్రారంభం రోజు మేథలో కార్యకలాపాలు
    • టవర్‌లో పూర్తి కావస్తున్న ఇంటీరియర్‌ పనులు
    విజయవాడ కేంద్రంగా హిందుస్తాన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌) టెక్నాలజీస్‌ పార్క్‌ ఏర్పాటుకు ముహూర్తం సిద్ధమౌతోంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎదురుగా ఆర్టీసీ జోనల్‌ కాలేజీ స్థలంలో హెచ్‌సీఎల్‌ టవర్‌ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. హెచ్‌సీఎల్‌ టవర్‌ నిర్మాణ పనులకు భూమిపూజతో పాటు, విజయవాడ వేదికగా మేథ టవర్‌ నుంచి కార్యకలాపాలు ప్రారంభించటానికి అడుగు పడబోతోంది. మే రెండు, మూడో వారాల్లో టవర్‌కు భూమిపూజ, మేథ టవర్‌లో కార్యకలాపాలను ప్రారంభించటానికి ఇటు హెచ్‌సీఎల్‌, అటు ఏపీఐఐసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
     
    (ఆంధ్రజ్యోతి, విజయవాడ): హిందుస్తాన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌) ఆర్టీసీ జోనల్‌ ట్రైనింగ్‌ కళాశాలకు చెందిన 27 ఎకరాల్లో ఏర్పాటు కానున్నది. అక్కడ చెట్ల తొలగింపు, నేల చదును పనులను సంస్థ ముమ్మరం చేసింది. ఈ పనులు ఒక కొలిక్కి రాగానే సెజ్‌లో భాగంగా ప్రాజెక్టును ఏర్పాటు చేయటానికి వీలుగా ఽకేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవటం జరిగింది. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఈ ప్రతిపాదన పరిశీనలలో ఉంది. దాదాపుగా సెజ్‌ ప్రతిపాదనకు ఆమోదం దక్కనుందని తెలుస్తోంది. ఇదే క్రమంలో టవర్‌ నిర్మాణ పనులు ప్రారంభించటానికి భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించటానికి కూడా హెచ్‌సీఎల్‌ సమాయత్తమైంది. టవర్‌ నిర్మాణ పనులు పూర్తి కావటానికి ఎంత లేదన్నా ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు ఆగకుండా తక్షణం కార్యకలాపాలు ప్రారంభించటానికి వీలుగా హెచ్‌సీఎల్‌ సంస్థ మరో అడుగు ముందుకు వేసింది. ఒక వైపు టవర్‌ నిర్మాణ పనులతో పాటే మరోవైపు ‘మేథ’ టవర్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా చర్యలు తీసుకుంది.
     
    కేసనపల్లిలోని ఎల్‌అండ్‌టీ - ఏపీఐఐసీ హైటెక్‌ సిటీలోని మేథ టవర్‌లో ఏకంగా ఒక ఫ్లోర్‌నే లీజుకు తీసుకుంది.కొద్ది రోజులుగా ఇంటీరియర్‌ వర్క్స్‌ నడుస్తున్నాయి. ఒకవైపు టవర్‌కు భూమిపూజ, రెండోవైపు అద్దె భవనంలో కార్యకలాపాలు ఒకేసారి ప్రారంభించేందుకు హెచ్‌సీఎల్‌ సంస్థ సన్నద్ధమైంది. ఏప్రిల్‌ నెలాఖరుకు మేథ టవర్‌లో ఇంటీరియర్‌ పనులు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నందున మేలో రెండింటికీ ఒకేసారి ప్రారంభిస్తే బాగుంటుందన్న ఆలోచనలో యాజమాన్యం ఉంది. దీనికి అనుగుణంగా మే రెండు, మూడు వారాలలో ముహూర్తపు తేదీని ప్రకటించాలని భావిస్తున్నారు.
     
    zdg.jpgశరవేగంగా శంకుస్థాపనలు
    జిల్లాలో శంకుస్థాపన కార్యక్రమాలను శరవేగంగా నిర్వహించటానికి ఏపీఐఐసీ చర్యలు చేపడుతోంది. శంకుస్థాపన కార్యక్రమాలకు జాబితాను తయారు చేస్తోంది. మల్లవల్లి ఇండస్ర్టియల్‌ పార్క్‌లో భారీ పరిశ్రమల కేటగిరిలో ఇటీవలే అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీకి భూమిపూజ నిర్వహించటం జరిగింది. ఇదే శ్రేణిలో మోహన్‌ స్పిన్‌టెక్స్‌కు సంబంధించి కూడా ముహూర్త తేదీని నిర్ణయించే పనిలో అధికారులు ఉన్నారు. ఇక మధ్యశ్రేణి పరిశ్రమలకు సంబం ధించి వివిధ అసోసి యేషన్లకు ప్లాట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అసోసియే షన్లకు కేటాయించిన ప్లాట్లకు సంబంధించి సేల్‌డీడ్‌ ప్రక్రియను త్వరితగతిన ముగించేం దుకు చర్యలు చేప ట్టాలని అధికారులు భావిస్తున్నారు. సేల్‌డీడ్‌ ప్రక్రియ ముగిస్తే కానీ వెంటనే భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించటానికి వీలు ఉండదు.

    HCL panulu fast ga jarugutunnayanta.

  5. 14 hours ago, sonykongara said:

    Kesarapalli IT park ki repu bhumi Pooja anta L&T vadu kadutunnadu anta  edi hcl vadi da leda vereda evari ki ayina telisthe news post cheyyandi

    This is expansion of Medha towers. L&T building  second tower/building. This is 2nd tower/building out of proposed 4 buildings. 

    HCL di .25 kilometers towards Gannavaram ooru from this Medha towers. HCL and Medha are at two different locations. 

×
×
  • Create New...