Jump to content

TDP888

Members
  • Posts

    1,034
  • Joined

  • Last visited

Posts posted by TDP888

  1. మంగళగిరిలో వాతావరణ కేంద్రం!

    భూకేటాయింపునకు ఐఎండీ లేఖ

    ఈనాడు, అమరావతి: రాష్ట్రానికి వాతావరణ కేంద్రం రాబోతోంది. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు సమాచారం ఇచ్చింది. కేంద్రం నిర్మాణానికి మంగళగిరిలో కనీసం 5 ఎకరాలు కేటాయించాలని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ)కు లేఖ కూడా రాశారు. అమరావతిలో శాశ్వత కేంద్రం అందుబాటులోకి వచ్చే వరకూ తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఆ శాఖ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం సీఆర్‌డీఏ తగిన కార్యాలయాన్ని చూపిస్తే వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభిస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి. సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్న రాష్ట్రంలో వాతావరణంపై హెచ్చరికలు, సూచనలు ఇచ్చేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. విశాఖలో ఉన్నది తుపాను హెచ్చరికల కేంద్రమేనని, ఎప్పటికప్పుడు వాతావరణంలో వచ్చే మార్పులను పూర్తిస్థాయిలో తెలుసుకోవాలంటే ఐఎండీ కేంద్రం తప్పనిసరి అని వెల్లడించారు. రాష్ట్ర వాతావరణానికి సంబంధించిన సమాచారం ఇప్పటివరకూ హైదరాబాద్‌ కేంద్రం నుంచే అందుతోంది.

    Mangalagiri lanti centre lo 5,acres yenduku jaaga bokka.. Amaravati side oo moolana padeyyandi.. Aada untey thelavada vathavaranam
  2.  

    160 ఎకరాల్లో ఏపీ అసెంబ్లీ, 8-10 అంతస్థులుగా సచివాలయం

     

     

    636306497133714019.jpg

     

    అమరావతి: పరిపాలన నగరంలో నూతనంగా నిర్మించబోయే రాష్ట్ర శాసనసభ భవంతిని రాజధానికే తలమానికంగా వుండేలా తీర్చిదిద్దడం కోసం 160 ఎకరాల విస్తీర్ణాన్ని వెచ్చిస్తున్నారు. ఇందులో 140 ఎకరాల మేర ప్రాంగణాన్ని కేవలం జల, హరిత అవసరాల కోసమే వదిలిపెడతారు. మొత్తం నగరానికే వన్నె తెచ్చేలా ఏపీ కొత్త శాసనసభ భవంతి నిర్మాణం అత్యంత ఆకర్షణీయంగా వుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన సూచన మేరకు తుది ప్రణాళికలో కొన్ని మార్పులు సూచించినట్టు రాజధాని ప్రాంత అభివృద్ధి సాధికార సంస్థ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తెలియజేశారు. ఈ మార్పుల ప్రకారం సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవంతులను ఉత్తర దిశగా కొద్దిగా ముందుకు జరిపారు.

     

    అమరావతి నగర నిర్మాణ పురోగతిపై బుధవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. పరిపాలన నగర నిర్మాణ ఆకృతులు, ప్రణాళిక 90 శాతం పూర్తయ్యాయని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్ ఈ babu.jpgసమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు. ఈనెల 12 నుంచి 16 వరకు లండన్‌లో ఆకృతులపై జరిగిన కార్యగోష్టిలో పాల్గొన్నామని తెలిపారు. ముఖ్యంగా శాసనసభ కట్టడం, ప్రజా రవాణా వ్యూహం, జల వనరులపై నార్మన్ ఫోస్టర్ బృందంతో చర్చించామని చెప్పారు. ఈనెల 22న ఫోస్టర్ బృందం మలి విడత ఆకృతుల్ని అందిస్తుందని అన్నారు. క్రిస్ బెర్గ్ ఆధ్వర్యంలో ఇప్పటికే 90 శాతం ప్రణాళిక పూర్తయ్యిందని తెలిపారు. ఈ ఆకృతుల్ని పరిశీలించి ఇంకా ఏవైనా సూచనలు, సలహాలు అందిస్తే వాటిని పొందుపరుస్తూ తుది ఆకృతులు సిద్ధం చేసి అందిస్తారని చెప్పారు.

     

    సచివాలయ భవంతి 8 నుంచి 10 ఫ్లోర్లతో కనీసం 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వుంటుందని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్ ముఖ్యమంత్రికి వివరించారు. మొత్తం 26 వేల మంది ఉద్యోగులకు కార్యస్థానంగా వుండేలా సచివాలయ నిర్మాణం చేపడతామన్నారు. రాష్ట్ర సచివాలయ భవంతి చూడ్డానికి బాగుండటమే కాకుండా పని చేసే వాతావరణం ఉట్టిపడేలా జల, హరిత ఆకర్షణలతో తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నిర్ధేశించారు. ఫోస్టర్ అండ్ పార్టనర్స్ రూపొందిస్తున్న ప్రజా రవాణా ప్రణాళిక రానున్న కాలపు అవసరాలకు తగినట్టుగా ఉండేలా చూడాలన్నారు.

     

    ప్రస్తుత ప్రపంచంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ హైపర్ లూప్ తరహా వినూత్న రవాణా వ్యవస్థలు తెర ముందుకు వస్తున్నాయని చెబుతూ, ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికను రూపొందించేలా ఫోస్టర్ బృందానికి సూచించాలని అన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ నగరాల్లో ఓన్ యువర్ కార్, లీజ్ యువర్ కార్, రెంట్ యువర్ కార్ అనే కాన్సెప్ట్ నడుస్తోందని, అమరావతిలో డ్రైవర్‌లేని ఎలక్ట్రికల్ కార్లు నడుస్తాయని చెప్పారు. హైపర్ లూప్ టెక్నాలజీ, మెట్రో రైలు వ్యవస్థ, ఎలక్ట్రికల్ కార్లు, జల రవాణా, బీఆర్‌టీఎస్ వంటి అన్ని రకాల రవాణా వ్యవస్థలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ప్రజా రవాణా వ్యవస్థ బృహత్ ప్రణాళికను రూపొందించాలని సూచించారు.

     

    నగర ముఖ్య కూడలి నుంచి సచివాలయం వరకు డ్రైవర్ లేని ఎలక్ట్రికల్ బస్సులు నడుస్తాయని, ఇవి నిర్ణీత బస్సు స్టాపులలో ఆగుతూ సాగుతాయని అధికారులు తెలిపారు. పరిపాలన నగరంలో ఒక రోడ్డు నుంచి మరొక రోడ్డుకు కాలినడకన చేరుకోవడానికి కేవలం 5 నిమిషాలే పట్టేలా వుంటుందన్నారు. బస్సు, రైలు, వాటర్ ట్యాక్సీలన్నింటికీ కలిపి ఒకే టికెట్ విధానం వుండే పద్దతిని ప్రవేశపెడదామని ముఖ్యమంత్రి చెప్పారు.

     

    అమరావతిలోని పరిపాలన నగరంలో నిర్మించబోయే సాంస్కృతిక భవనం మన తరతరాల మన సంస్కృతి, వారసత్వ సంపద, చరిత్రలకు అద్దం పట్టేలా నిలవాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర శాసనసభ తరువాత ఇదే నగరానికి తలమానికంగా వుండే నిర్మాణమని అన్నారు. రాజధానికి వచ్చే ప్రతి ఒక్కరూ దీన్ని చూసి స్పూర్తి పొందేలా వుండాలని చెప్పారు. రాజధానిలో ఫ్లైవోవర్లు లేనిదే నగరానికి ఆకర్షణ వుండదంటూ ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా వున్న తొలి వంద ఫ్లైవోవర్లను పరిశీలించి అత్యుత్తమంగా ఉన్న ఆకృతులను తీసుకోవాలని కోరారు.

     

    లండన్ పర్యటనలోనే కేంబ్రిడ్జికి వెళ్లి అక్కడ కాలువల వ్యవస్థపై అధ్యయనం చేశామని సీఆర్‌డీఏ కమిషనర్ తెలియజేశారు. త్వరలో అమరావతి పోర్టల్‌ను ప్రారంభిస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ పోర్టల్ అమరావతి నగర నిర్మాణానికి సంబంధించిన మొత్తం నిర్మాణ ప్రక్రియను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ, నిర్వహణ, పర్యవేక్షణలకు వీలుగా ఉంటుందని వివరించారు.

     

    Yekkadaina kukkala morugudu common
  3. include emundi brother, better infact, yellow is closer to Tenali than Blue. Town most likely will expand towards mangalagiri/nara koduru i mean towards capital. for that side expansion ORR along Yellow line comes in handy.

    Tenali antha dooram pola ..inka angala kuduru ye kalavala ..pedravuru ki 4 lane padindi adhi kalavala ...let see
×
×
  • Create New...