Jump to content

KING007

Members
 • Content count

  5,541
 • Donations

  $0.00 
 • Joined

 • Last visited

About KING007

 • Rank
  Gifted Fan

Recent Profile Visitors

435 profile views
 1. PADMAVATHI REAL STORY

  UK lo release avutundi ga 1st na, mana vallu chusi cheppandi, controversies unnaya leda ani...............
 2. కొత్త యుద్ధానికి సిద్ధమౌతోన్న జనసేనాని 24-11-2017 10:22:36 హైదరాబాద్: హోదా సాధనపై జనసేన దృష్టిపెట్టిందా? స్పెషల్‌ స్టేటస్‌ను అస్త్రంగా మలచుకుని జనంలోకి వెళ్లాలని జనసేనాని భావిస్తున్నారా? దీని కోసం గ్రౌండ్‌వర్క్‌ సిద్ధం చేసుకుంటున్నారా? అవుననే అంటున్నాయి జనసేన వర్గాలు. ఇప్పటికే పార్టీ పటిష్టతపై దృష్టిసారించిన జనసేన అధినేత...పాత అస్త్రంతో కొత్త యుద్ధానికి సిద్ధమౌతున్నారు. ప్రత్యేకహోదా సాధనే లక్ష్యంగా జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్తయాత్రకు పవన్‌కళ్యాణ్‌ శ్రీకారం చుట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏపీకి హోదాలేదని స్పష్టం చేసింది. ఈ స్థానంలో ప్యాకేజీని కూడా ప్రకటించింది. ఇది జరిగి చాలారోజులే అవుతున్నా... పవన్‌కళ్యాణ్‌ తాజాగా హోదా నినాదంతోనే జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. హోదాతో పాటు రైల్వేజోన్‌పై కూడా పోరాడనున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. విభజన చట్టంలోని హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని పవన్ మొదటి నుంచీ డిమాండ్ చేస్తున్నారు. ఇదే లక్ష్యంతో 2014 ఎన్నికల్లో తెలగుదేశం, బీజేపీకి పవన్ మద్దతు ప్రకటించారు. అప్పటి బీజేపీ ప్రచారకమిటీ చైర్మన్ ..ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీతో కలసి సాధారణ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని మోదీ పలుసభల్లో హామీ ఇచ్చారు. తర్వాత మోదీ అధికారంలోకి రావడం... నీతిఆయోగ్‌తో ప్రత్యేక హోదాకు చెక్‌పెట్టడం జరిగిపోయాయి. అప్పటి నుంచి పవన్‌ హోదాపై తన గళం వినిపిస్తూనే వచ్చారు. ఈమేరకు తిరుపతి, కాకినాడ, అనంతపురంలో భారీ సభలను ఏర్పాటు చేసి హోదాపై తన అంతరంగాన్ని వెల్లడించారు. తర్వాత కొంతకాలం సైలెంటైన పవన్‌ తాజాగా...హోదానే అస్త్రంగా మలచుకోవాలని భావిస్తున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లోనూ ఇదే అస్త్రాన్ని ఉపయోగించాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే వచ్చే ఏడాది జనవరి నుంచే హోదాపై యుద్ధం ప్రకటించనున్నట్టు తెలిసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని... దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని కేంద్రం చెబుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కూడా దానినే సమర్థిస్తోంది. హోదా కంటే ఎక్కువ ప్రయోజనాలే ప్యాకేజీలో ఉన్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే-పాత అస్త్రంతో కొత్త యుద్ధానికి సిద్ధమౌతున్న జనసేనానికి ఎలాంటి ఫలితాలు వస్తాయో కాలమే తేల్చాలి...
 3. Giddi Eeswari

  Ippudu emani party lo ki cherchukunte, tala ekkada pettukovali ? Ento ee karma ....
 4. Giddi Eeswari

  CBN tala narukutha ani annadi eeme kada???
 5. ఐటీకి షాక్‌.. 10వేల కోట్ల పన్నుకు నోటీసులు ముంబయి: ఐటీ పరిశ్రమలో ప్రకంపనలు! కంపెనీలకు పన్నుల శాఖ వణుకు పుట్టిస్తోంది. దేశంలోని ఐటీ, ఐటీ ఆధారిత సేవల కంపెనీలు పదివేల కోట్ల రూపాయల సేవా పన్ను చెల్లించాలని పన్నుల శాఖ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రక్షణాత్మక ఆర్థిక విధానాలతో చిన్న కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో 200 సంస్థలు సేవా పన్ను చెల్లించాలని నోటీసులు రావడం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. ఎగుమతుల కిందకు రావు! ఐదేళ్ల కాలంలో (2012-2016) విదేశాలకు సాఫ్ట్‌వేర్‌ను ఎగుమతి చేసి పొందిన ప్రజయోనాల రిటర్న్స్‌ దాఖలు చేయాలని సేవా పన్నుల శాఖ ఐటీ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఆలస్యం చేసినందుకు వడ్డీ, జరిమానాలతో పాటు అదనంగా 15 శాతం సేవా పన్ను చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం. భారత్‌కు వెలుపల వినియోగదారులకు సాఫ్ట్‌వేర్‌ను అందించడం ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీలకు ఎగుమతి చేసినట్టు కాదు. ఎందుకంటే.. క్లైంటు ప్రత్యేకమైన వివరాలతో భారత ఐటీ కంపెనీలు ఎలాంటి సాఫ్ట్‌వేర్‌ ఎగుమతి చేయాలో ముందే మెయిల్‌ పంపిస్తారు. అయితే ఇది అందుబాటులో ఉన్న వస్తువులను విదేశీ వినియోగదారుకు విక్రయిస్తున్నట్టే అని పన్నుల శాఖ వాదిస్తోంది. రెండు రకాలుగా దెబ్బ కంపెనీలు ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌కు వెళ్లినా ఫలితం ఉండదని నిపుణులు అంటున్నారు. అక్కడికి వెళ్లాలన్నా ముందు ఆ మొత్తంలో 10 శాతం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ దెబ్బతో ఏం చేయాలో పాలుపోని కొన్ని కంపెనీలు వేరే దేశాలకు తరలిపోవాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ పన్ను గతంలో 15 శాతమే ఉంటే.. జీఎస్‌టీ రాకతో ఇప్పుడది 18 శాతానికి పెరగడంపై సంస్థలు లబోదిబోమంటున్నాయి.
 6. ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాక్కుంటున్నారు పన్నురేట్లు తగ్గాయ్‌ సరకు ధరలు పెరిగాయ్‌ వినియోగదారుకు అందని ప్రయోజనం వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) విధానంలో వినియోగదారులకు పెద్దగా ప్రయోజనం ఉండటం లేదనే మాట వినిపిస్తోంది. పన్ను రేట్లు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు గగ్గోలు పెట్టడంతో.. ఇటీవల కొన్ని వస్తువులపై ప్రభుత్వం పన్ను రేట్లను తగ్గించింది. అయినా వినియోగదారులకు లభించిన వూరట శూన్యమే. ప్రభుత్వం ఎంతైతే పన్ను తగ్గించిందో.. ఆ మేరకు కొందరు వ్యాపారులు వస్తువుల ధర పెంచేస్తున్నారు. దీంతో పన్ను తగ్గింపు ప్రయోజనం వినియోగదారులకు పూర్తి స్థాయిలో అందకుండా పోతోంది. నవంబరు 15కు ముందు.. ఏసీ రెస్టారెంటులో అల్పాహారం లేదా భోజనం చేస్తే 18% జీఎస్‌టీ చెల్లించాలి. అదే నాన్‌ ఏసీ/ ఇతర సాధారణ హోటళ్లలో తింటే పన్ను రేటు 12%. నవంబరు 15 నుంచి.. జీఎస్‌టీ మండలి సిఫారసు అమల్లోకి రావడంతో ఏ రకం రెస్టారెంటు (ఏసీ/ నాన్‌ ఏసీ)లోనైనా భోజనం, అల్పాహారం అయినా జీఎస్‌టీ 5% మాత్రమే. పై రెండింటిని పరిగణనలోకి తీసుకుంటే నవంబరు 15 ముందుతో పోలిస్తే ఆ తర్వాత పన్ను రేటు 7- 13% వరకు తగ్గింది. మనం చెల్లించే బిల్లు మొత్తంలో కూడా ఈ మేరకు తగ్గింపు కనిపించాలి. కాని వాస్తవ పరిస్థితి అలా లేదు. పన్ను రేటు ఏ స్థాయిలో తగ్గిందో.. ఇంచుమించు దానికి సమానంగా ఆహార పదార్థాల ధరలు, పెంచేసి లెక్క సరిచేస్తున్నారు కొందరు వ్యాపారులు. ఇలా చేయడం ద్వారా వినియోగదార్లకు చేరాల్సిన ప్రయోజనాన్ని వ్యాపారులే తమ జేబులో వేసుకుంటున్నారనే అభిప్రాయాన్ని సామాజిక మాధ్యమాల్లో కొందరు వ్యక్తం చేస్తున్నారు. వినియోగదార్లకు పన్ను ప్రయోజనం దక్కనప్పుడు ప్రభుత్వం పన్ను రేట్లు తగ్గించి లాభమేంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు. నిజానికి వీళ్లు అడుగుతోంది సబబే. మరి వ్యాపారులు ఎందుకు అలా చేస్తున్నారు. ఏదైనా కారణముందా? నవంబరు 10న గువాహటిలో జరిగిన సమావేశంలో ప్రభుత్వానికి పలు సిఫారసులను జీఎస్‌టీ మండలి సూచించింది. పన్ను రేట్ల తగ్గింపు, రిటర్న్‌ల దాఖలు ప్రక్రియ సరళీకరణ, రిటర్న్‌ల దాఖలు ఆలస్యంపై విధించే రుసుం లాంటివి ఇందులో ముఖ్యమైనవి. వ్యాపార, పరిశ్రమ సంఘాల వినతులు, సాధారణ ప్రజల ప్రయోజనాలు, ముడి సరుకు - అంత్య ఉత్పత్తి మధ్య పన్ను రేట్ల సమతౌల్యం, గుజరాత్‌ ఎన్నికలు లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని వీటిని నిర్ణయించింది. ఈ సిఫారసులకు సంబంధించి ఇప్పటికే 35 నోటిఫికేషన్లను ప్రభుత్వం జారీ చేసింది. జీఎస్‌టీ మండలి ప్రధాన సిఫారసులు ఇవే.. * 178 వస్తువుల పన్ను రేటు 28% నుంచి 18 శాతానికి తగ్గింపు. * 13 వస్తువుల పన్ను రేటు 18 శాతం 12 శాతానికి సవరణ * రెండు వస్తువుల పన్ను రేటు 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గింపు * ఆరు వస్తువుల పన్ను రేటు 18 శాతం నుంచి 5 శాతానికి కుదింపు. * 8 వస్తువులు 12 శాతం పన్ను స్లాబు నుంచి 5 శాతం పన్ను స్లాబులోకి * అంతకుముందు 5 శాతంగా ఉన్న ఐదు వస్తువులపై పన్ను రద్దు. * స్టార్‌ హోటళ్లు మినహా అన్ని రకాల (ఏసీ/ నాన్‌ ఏసీ) హోటళ్లు, రెస్టారెంట్లకు 5 శాతం జీఎస్‌టీ వర్తిస్తుంది. అయితే ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ సౌలభ్యం ఉండదు. * ట్రేడర్లు, తయారీదార్ల కాంపోజిషన్‌ పన్ను రేటు 1 శాతానికి తగ్గింపు. ఇంతకుమునుపు ఈ విధానంలో తయారీదార్లు 3 శాతం పన్ను స్లాబ్‌లో ఉండేవారు. * రూ.1.50 కోట్లకు మించి టర్నోవరు ఉన్న ట్రేడర్లు 2018 మార్చి 30 వరకు నాలుగు కాకుండా రెండు రిటర్న్‌లను (జీఎస్‌టీఆర్‌ 3బీ, జీఎస్‌టీఆర్‌-1) దాఖలు చేస్తే సరిపోతుంది. * రూ.1.50 కోట్ల లోపు టర్నోవరు ఉన్న ట్రేడర్లు 3 నెలలకో సారి జీఎస్‌టీఆర్‌-1 దాఖలు చేయాలి. * జీఎస్‌టీఆర్‌-3బీ రిటర్న్‌ గడువును 2017 డిసెంబరు నుంచి 2018 మార్చికి పొడిగింపు. శూన్య లావాదేవీలు, శూన్య టర్నోవరుకు సరళీకృత జీఎస్‌టీఆర్‌-3బీ. * 2017 అక్టోబరు, ఆ తర్వాతి నుంచి రిటర్న్‌ల దాఖలు ఆలస్య రుసుం రోజుకు రూ.200 నుంచి రూ.50కి తగ్గింపు. శూన్య లావాదేవీల రిటర్న్‌లకైతే రోజుకు రూ.20. నవంబరు 15 నుంచే అమల్లోకి వచ్చాయి..: జీఎస్‌టీ మండలి సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం సుమారు 35 నోటిఫికేషన్లను జారీ చేసింది. వీటిలో చాలా వరకు 15 నవంబరు నుంచి అమల్లోకి వచ్చాయి. పన్ను రేట్ల తగ్గింపు నవంబరు 15 నుంచే వర్తింపజేశారు. ఈ తేదీ కంటే ముందు నిర్ణయించిన ఎంఆర్‌పీని, పన్ను రేట్ల తగ్గింపు మేరకు వ్యాపారులు సవరించుకోవాలి. ఇన్‌పుట్‌ క్రెడిట్‌ లేదనే రేట్ల పెంపా? పన్ను రేట్లను ప్రభుత్వం తగ్గించినప్పటికీ వినియోగదారులకు ఆ ప్రయోజనం చేరడం లేదనే మాట వినిపిస్తోంది. అయితే వ్యాపారుల నుంచి దీనిపై భిన్న వాదన వస్తోంది. ఉదాహరణకు పక్కనున్న రెస్టారెంట్‌ బిల్లులనే చూద్దాం. మొదటిది జీఎస్‌టీ పన్ను రేట్ల తగ్గింపు సిఫారసు అమల్లోకి రాకముందు. రెండోది.. సిఫారసు అమల్లోకి వచ్చిన తర్వాతి రోజు. మొదటి బిల్లు ప్రకారం.. 2017 నవంబరు 14న భోజనం ధర రూ.105.88గా ఉంది. దీనిపై 18 శాతం జీఎస్‌టీ రూ.19.06 కలిపితే మొత్తం అమ్మకం విలువ రూ.125 అయ్యింది. రెండో బిల్లులో.. నవంబరు 16న పన్ను రేటు 5 శాతం తగ్గడంతో భోజనం ధర రూ.124కి పెంచారు. జీఎస్‌టీ 5 శాతం (రూ.6.10) కలిపితే మొత్తం అమ్మకం విలువ రూ.130కి చేరింది. ఇక్కడ పన్ను రేటు తగ్గినప్పటికీ బిల్లు మాత్రం రూ.5 పెరిగింది. వాస్తవానికి పాత ధర (రూ.105.88)కు జీఎస్‌టీ కలిపితే మొత్తం బిల్లు రూ.111.18. ఈ లెక్కన చూస్తే రూ.19 అధికంగా చెల్లించామన్నమాట. పై ఉదాహరణ ప్రకారం వినియోగదారునికి పన్ను రేట్ల ప్రయోజనం చేరలేదనే విషయం అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం మరోటి ఉంది. రెస్టారెంట్లు/ హోటళ్ల జీఎస్‌టీ రేటును 5 శాతానికి ప్రభుత్వం తగ్గించినప్పటికీ, మునుపు ఉన్న ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) సౌలభ్యాన్ని ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు ఇదే కారణాన్ని కొందరు వ్యాపారులు వల్లెవేస్తున్నారు. ఐటీసీ పొందే వీలు లేకపోవడం వల్లే నిర్వహణ భారాన్ని దృష్టిలో ఉంచుకొని పదార్థాల ధరలు పెంచాల్సి వచ్చిందని అంటున్నారు. ప్రభుత్వం ఐటీసీ వర్తింపజేసి, పన్ను రేట్లు తగ్గించి ఉంటే కనుక పన్ను ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేసేవాళ్లమని చెబుతున్నారు. మరి జీఎస్‌టీ అమల్లోకి రాకముందు కూడా పూర్తి స్థాయిలో ఐటీసీ పొందే వీలు లేదనే విషయాన్ని ఇక్కడ వాళ్లు గుర్తుంచుకోవాలి. అయితే ఎవరి వాదనలు ఎలా ఉన్నప్పటికీ వినియోగదారులకు తగ్గిన పన్ను రేట్ల ప్రయోజనం బదిలీ కావటం లేదని మాత్రం అర్థమవుతోంది. మొత్తానికి గతంతో పోలిస్తే పన్ను రేటు తగ్గిందని భావించి రెస్టారెంటులో అడుగుపెట్టిన వినియోగదారునికి ఆఖర్లో బిల్లును చూశాక ‘ఆశ.. దోశ.. అప్పడం’ అనే మాట గుర్తుకు వస్తుందేమో. ఎంఆర్‌పీ స్థానంలో మరోటి.. ప్రజలకు పన్ను రేట్ల ప్రయోజనాన్ని దరి చేర్చాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరు స్వాగతించాల్సిందే. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల ఫలితం వినియోగదారునికి మాత్రం చేరటం లేదు. అందువల్ల ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకొని సామన్య ప్రజల ప్రయోజనాలను పరిరక్షించాలి. అదే సమయంలో కొందరు వ్యాపారులు జీఎస్‌టీ ముసుగులో చేస్తున్న మాయాజాలానికి అడ్డుకట్ట వేయాలి. జీఎస్‌టీ చట్టంలో వినియోగదారుల ప్రయోజనాలు పరిరక్షించాలంటే ప్రస్తుతమున్న ఎంఆర్‌పీ విధానం సరిపోదు. ఎందుకంటే దీనిని రూపొందించి చాలా ఏళ్లవుతోంది. కొందరు వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట వేసి, పన్ను రేట్ల ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తే కనుక.. ‘బేసిక్‌ సెల్లింగ్‌ ప్రైస్‌ ప్లస్‌ అప్లికేబుల్‌ ట్యాక్సెస్‌’ విధానాన్ని అనుసరించొచ్చు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు దీనిని అమలు చేస్తున్నాయి. గమనిక: పన్ను రేట్ల కోత అనంతరం పరిస్థితి ఎలా ఉందోనని చెప్పేందుకు ఉదాహరణగా పై బిల్లులు చూపించాం. సామాజిక మాధ్యమాల్లో కూడా ఇలాంటివి చాలానే పోస్ట్‌ అవుతున్నాయి. బిల్లులో రెస్టారెంటు పేరును ఉద్దేశపూర్వకంగానే తొలగించాం. అటు వ్యాసకర్తకు కానీ, పత్రికకు కానీ దీంతో ఎలాంటి సంబంధం లేదు.
 7. AP Govt Serious On Nandi Awards Issue

  arhulu ki kolamanam enti?? AP awards lo anarhulu evaru unnaru?? Anarhula list unte veyyandi please....
 8. AP Govt Serious On Nandi Awards Issue

  The government does not want to retain the old name, Nandi, for the film awards; it was awarded in undivided Andhra Pradesh since 1964. Nandi was named after the famed granite bull of Lepakshi in Anantapur district in AP. wanted to continue ekkadini nunchi vachhindi????
 9. AP Govt Serious On Nandi Awards Issue

  Hyd lo ichhedi simha awards, AP lo ichhedi nandi awards.. kabja ela Abba????
 10. sivaji

  It's not about offence or defence, SS rakapoyina AP lo development jarugutundi, so SS promise anedi ikkada closed chapter.....
 11. sivaji

  Special status rakapovadam valla, ippativaraku kaligina nastham enti? AP ki industries rakunda poyaya? Employment jaragatleda?
×