Jump to content

RamaSiddhu J

Members
 • Content count

  23,604
 • Donations

  $0.00 
 • Joined

 • Last visited

About RamaSiddhu J

 • Rank
  Platinum Club
 • Birthday 09/03/1987

Profile Information

 • Gender
  Male
 • Location
  Palnadu Jilla
 • Interests
  politics and reading books

Recent Profile Visitors

12,636 profile views
 1. RamaSiddhu J

  Indo-Pak laser fence

  2 lacs less
 2. RamaSiddhu J

  Indo-Pak laser fence

  14 lacs tourists visit kashmir in 2012 4.5 lacs in 2016 Topic closed
 3. వరంగల్: ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్(85) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్ మంగళవారం స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1932 డిసెంబర్ 28న మట్టెవాడలో వేణుమాధవ్ జన్మించారు. 1947లో పదహారేళ్లకే నేరెళ్ల తన కెరీర్‌‌ను ప్రారంభించారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, ఉర్దూ, తమిళంలో ఆయన ప్రదర్శనలు చేశారు. దేశవిదేశాల్లో నేరెళ్ల వేణుమాధవ్ చేసిన ప్రదర్శనలు ఎంతో పేరుతెచ్చిపెట్టాయి. 2001లో ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి వేణుమాధవ్‌ను సత్కరించింది. తెలుగు వర్సిటీలో మిమిక్రీ అధ్యాపకుడిగా నేరెళ్ల సేవలందించారు. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో మిమిక్రీ డిప్లొమా ప్రారంభించేందుకు వేణుమాధవ్‌ కృషి చేశారు. ధ్వని అనుకరణ ప్రక్రియ 'మిమిక్రీ కళ' పుస్తకం రాసిన ఆయన మిమిక్రీ కళలో ఎంతోమంది శిష్యులను తయారుచేశారు. నేరెళ్లపై ఐవీ చలపతిరావు, పురాణం సుబ్రమణ్యశర్మ పుస్తకాలు రాశారు. 1981లో రాజాలక్ష్మి ఫౌండేషన్‌ అవార్డును నేరెళ్ల అందుకోగా, 1978లో కళాప్రపూర్ణ బిరుదుతో ఏయూ ఆయనను సత్కరించింది. నేరెళ్ల వేణుమాధవ్‌కు ఏయూ, కేయూ, ఇగ్నో గౌరవ డాక్టరేట్లు లభించాయి. నేరెళ్ల వేణుమాధవ్ 12 సినిమాల్లో కూడా నటించారు. ఆయన సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ వెనుక సినీప్రముఖులు బీఎన్.రెడ్డి ప్రమేయం ఉంది. ఆయన ప్రోత్సాహంతోనే నేరెళ్ల సినిమాల్లో నటించారు. రాజకీయాల్లోనూ నేరెళ్ల తన సేవలను అందించారు. మాజీ ప్రధాని పీవీ.నర్సింహారావు ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. 1972 నుంచి 1978 వరకు వేణుమాధవ్ ఎమ్మెల్సీగా పనిచేశారు. నేరెళ్ల వేణుమాధవ్‌కు నలుగురు సంతానం కాగా, కుమార్తె తులసిని మిమిక్రీ కళాకారిణిగా తీర్చిదిద్దారు. హన్మకొండ పబ్లిక్‌గార్డెన్‌లోని ఆడిటోరియానికి నేరెళ్ల వేణుమాధవ్‌ ప్రాంగణంగా ప్రభుత్వం నామకరణం చేసింది. నేరెళ్ల మృతితో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రతీ వ్యక్తి సొంతంగా ఓ కళతో ఎదగాలని, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని వేణుమాధవ్ చెప్పేవారని నేరెళ్ల అభిమానులు చెబుతున్నారు. అభిమానుల సందర్శనార్ధం నేరెళ్ల భౌతికకాయాన్ని ఆయన నివాసంలోనే ఉంచనున్నట్లు తెలుస్తోంది.
 4. ఇంటర్నెట్‌ డెస్క్‌ : వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ కేంద్రంలోని భాజపాకు మరో షాక్‌ తగిలింది. పార్టీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ బృందంలోని కీలక సభ్యుడైన శివం శంకర్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన రాసిన సుదీర్ఘమైన లేఖ దేశంలో సంచలనానికి దారితీసింది. ఆయన ఈ లేఖలో ఏం రాశారంటే? దేశంలో రాజకీయపరమైన చర్చ అన్న అంశం చాలా తక్కువ స్థాయిలో ఉంది. ఎలాంటి ఆధారాలు లేకుండానే ప్రజలు తమకు నచ్చినవారికి మద్ధతు పలుకుతున్నారు. కొందరు బూటకపు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నా ఎలాంటి పశ్చాతాపానికి లోనుకావడం లేదు. దీనికి ఏ ఒక్క రాజకీయపక్షాన్నో నిందించడం సబబు కాదు. అందరూ దీనికి కారణమే అని చెప్పాలి. నాలుగేళ్ల పాలనాకాలంలో భాజపా అనేకమైన అద్భుతమైన పనితీరు ప్రదర్శించింది. అయితే గత ప్రభుత్వాల కంటే భిన్నంగా లేకపోవడం విశేషం అయితే భాజపా పాలన పలు నష్టాలను కూడా తీసుకువచ్చింది. ప్రజాస్వామ్య భారత దేశ నిర్మాణం ఒక్కరోజులో జరగలేదు. దశాబ్దాల కాలంగా జరిగిందన్న విషయం గుర్తించుకోవాలి. కానీ భాజపా ఈ వ్యవస్థలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. నష్టాలివే.. 1. ఎలక్ట్రోల్‌ బాండ్స్‌ వీటితో అవినీతిని చట్టబద్ధంగా చేసినట్టయింది.కార్పొరేట్లు, విదేశీ శక్తులు మన రాజకీయ పక్షాలను కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తున్నాయి. విరాళాన్ని ఇచ్చే వారు భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించి తమకు అనుకూలమైన విధానాలను తీసుకువచ్చేందుకు వీలుగా రాజకీయపక్షాలపై ఒత్తిడి చేసే ప్రమాదముంది. 2. ప్రణాళిక సంఘ నివేదికలు ప్రణాళిక సంఘం రద్దు సమంజసం కాదు. అన్ని ప్రభుత్వ విభాగాల పనితీరును అధ్యయనం చేసి ప్రణాళికా సంఘం నివేదికలు ఇస్తుంది. అయితే దీని స్థానంలో ప్రవేశపెట్టిన నీతిఆయోగ్‌ మాత్రం మేధావులతో ఏర్పాటైన సంస్థ మాత్రమే. 3. కేంద్ర ఏజెన్సీల దుర్వినియోగం కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలను రాజకీయప్రయోజనాలకు వినియోగించుకోవడం బాధాకరం. ప్రజాస్వామ్యానికి ఇలాంటి ధోరణులు పనికిరావు. 4. నోట్ల రద్దు నోట్ల రద్ధు మంచి ఫలితాలను ఇవ్వలేదు. అయితే భాజపా దీన్ని అంగీకరించకపోవడం గమనార్హం. 5. జీఎస్టీ వస్తుసేవల విధానాన్ని పూర్తిగా అధ్యయనం చేయకుండానే తీసుకువచ్చారు. ఫిల్లింగ్‌విధానం సంక్లిష్టంగా ఉంది. 6. విదేశాంగ విధానం విదేశాంగ విధానం లోపభూయిష్టంగా మారింది. శ్రీలంకలోని నౌకాశ్రయాన్ని చైనా ఆధీనంలోకి తీసుకోవడం, బంగ్లాదేశ్‌లో చైనా ప్రభావం పెరగడం, మాల్దీవుల్లో భారత కార్మికులకు వీసా ఇవ్వకపోవడం.. తదితర అంశాలు విదేశాంగ విధానం సక్రమంగా లేదని చెబుతున్నాయి. 7. పెట్రో ఉత్పత్తుల రేట్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో పెట్రో ఉత్పత్తుల ధరలు అధికంగా ఉన్నాయని భాజపా ఆందోళనలు నిర్వహించింది. అయితే భాజపా అధికారంలో ఉన్న సమయంలోనూ రేట్లు పెరగడం ఆందోళనకరమే. ఇవే కాదు ప్రాథమికమైన అనేక కీలకాంశాలను భాజపా ప్రభుత్వం విస్మరించింది. ప్రత్యేకించి ఆరోగ్యం, విద్యా రంగాల్లో ఎలాంటి పురోగతి లేదు. కేంద్రప్రభుత్వ ప్రకటనలకే 4 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించడం ఆశ్చర్యంగా ఉంది. ఇవే కాకుండా దేశంలో ప్రజల మధ్య విషబీజాలు నాటడం ఎంతో బాధను కలిగిస్తోంది. ఇన్ని పరిణామాలు చూసిన అనంతరం భాజపా నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను.
 5. అమరావతి : ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి డాక్టర్ పరకాల ప్రభాకర్ రాజీనామా చేశారు. రెండు పేజీల తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పంపించారు. ప్రతిపక్ష పార్టీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై తీవ్ర మనస్తాపం చెందినట్లు లేఖలో పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తనపై నిందా ప్రచారం చేస్తుండటంతో కలత చెందానని.. తక్షణం తన రాజీనామాను ఆమోదించాలని లేఖలో కోరారు. నాలుగేళ్లుగా ప్రభుత్వానికి అండగా నిలిచి- నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో తనవంతు భూమిక పోషించే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. విపక్షానికి చెందిన కొందరు నాయకులు తాను ప్రభుత్వంలో సలహాదారు బాధ్యతల్లో ఉండడాన్ని పదే పదే ఎత్తి చూపుతున్నారని.. కేంద్రంపై, భాజపాపై జరుగుతోన్న ధర్మ పోరాటం మీద ప్రజల్లో అనుమానాలు లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వంలో తన ఉనికిని, ముఖ్యమంత్రి చిత్తశుద్ధిని శంకించేలా ప్రకటనలు చేస్తున్నారని ఆవేదన చెందారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుని స్థానంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయాన్ని లేవనెత్తి.. కేంద్రంపై చేస్తోన్న పోరాటాన్ని శంకించేలా మాట్లాడారని విమర్శించారు. తన వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలకు రాజకీయ ప్రయోజనాలను ఆపాదించడం సరికాదన్నారు. తన కుటుంబంలోని వ్యక్తులు వేరే పార్టీలో ఉన్నందువల్ల, తన కంటే భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నందువల్ల రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాను రాజీ పడతానని కొందరు ప్రచారం చేయడం తనకు బాధిస్తోందని పరకాల తన లేఖలో ఆవేదన చెందారు. పరిణతి చెందిన వ్యక్తులు ఎవరి రాజకీయాభిప్రాయాలకు వారు నిబద్ధులై ఉండగలరని, వారి వారి అభిప్రాయాల పట్ల వారికున్న అంకిత భావానికి బాంధవ్యాలు అడ్డు రాలేవనే ఇంగితం కూడా వీరికి భగవంతుడు ప్రసాదించకపోవడం దురదృష్టకరమన్నారు. తాను ప్రభుత్వంలో కొనసాగడం వల్ల రాష్ట్ర హక్కుల సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్ష మీద, చిత్తశుద్ధి మీద నీలినీడలు పడకూడదన్నది తన కోరిక అని పరకాల పేర్కొన్నారు. తన వల్ల ముఖ్యమంత్రికి... ప్రభుత్వ ప్రతిష్ఠకు స్వల్ప నష్టం కూడా జరగరాదని దృఢ అభిప్రాయంతో ఉన్నానని.. అందువల్లే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బాధ్యతల నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నానని పరకాల తెలిపారు. సీఎంపైన, ప్రభుత్వం మీద బురదజల్లడానికీ, లేనిపోని ఆరోపణలు చెయ్యడానికీ తన పేరు, తన కుటుంబ సభ్యుల పేర్లూ ఎవ్వరూ వాడుకోకూడదన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా మన రాష్ట్రానికి సేవ చేసుకునే భాగ్యాన్ని కలుగ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
 6. RamaSiddhu J

  Lagadapati rg flash team survey

  Jai Yarapathineni
 7. RamaSiddhu J

  Cbn mamata kumaraswamy

  Waiting mode
×