Jump to content

srohith

Members
 • Content Count

  148
 • Donations

  $0.00 
 • Joined

 • Last visited

About srohith

Profile Information

 • Gender
  Array
 • Location
  Array

Recent Profile Visitors

1,172 profile views
 1. ఇండియన్ ఆర్మీ & భారత ప్రభుత్వం కి మద్దతు ఇస్తాం కానీ మోడీ కి కాదు
 2. అణచివేసేలా ఆంక్షలు.. టెక్నాలజీ చౌర్యం.. అమెరికా- చైనా వాణిజ్య యుద్ధం.. కరోనా వైరస్‌ పుట్టుక.. పొరుగు దేశాలతో ఉద్రిక్తత.. ఇలా డ్రాగన్‌ కీర్తి క్రమంగా మసకబారుతుండటంతో అక్కడ పెట్టుబడులు పెట్టిన విదేశీ కంపెనీలు మెల్లిగా విదేశాలకు తరలివెళ్తున్నాయి. ముఖ్యంగా సులభతర వాణిజ్య విధానాలు, మౌలిక వసతులు, తక్కువ పన్నులు అమల్లో ఉన్న దేశాల వైపు ఇవి మొగ్గు చూపుతున్నాయి. మరోపక్క వివిధ రకాల వాణిజ్య ఒప్పందాల్లో వియత్నాం ఎటువంటి జంకు లేకుండా భాగస్వామి అవుతోంది. దీంతో ఆ దేశ వస్తువులకు డిమాండ్‌ పెరిగే కొద్దీ అక్కడకు పెట్టుబడులు రావడం మొదలైంది. తాజాగా వియత్నాం-ఐరోపా సంఘం మధ్య వాణిజ్య ఒప్పందానికి ఆమోద ముద్ర పడింది. ఇరు పక్షాలు ఎదుటి వారిపై విధించే పన్నులు 99శాతం తగ్గిపోయాయి. ఇదే జరిగితే త్వరలో వియత్నాం ఉత్పత్తిలో మినీ చైనాగా మారడం ఖాయం. యుద్ధాలతో చితికిపోయి.. వియత్నాం.. 1980 వరకు యుద్ధాల్లో మునిగిపోయిన దేశం. అప్పట్లో దీనిని మింగేసేందుకు అమెరికా, చైనా వంటి తిమింగలాలు ప్రయత్నించాయి. కానీ, వారిని ప్రతిఘటించి ఈ దేశం నిలిచింది. ఇప్పుడు అదే వియత్నాం దక్షిణాసియా దేశాల్లో ప్రబల ఆర్థిక శక్తిగా వేగంగా ఎదుగుతోంది. చైనా నుంచి వెళ్లిపోయే కంపెనీలకు వియత్నాం ఓ పెద్ద ప్రత్యామ్నాయంగా మారింది. ఉ.కొరియా, అమెరికా వంటి దేశాలకు సయోధ్య కుదిర్చేందుకు వేదికగా మారింది. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ను అడ్డుకొనే ఓ శక్తిగా అవతరిస్తోంది. కమ్యూనిస్టు దేశమైన చైనా డెంగ్‌ జియావో పింగ్‌ అనుసరించిన విధానాలను ఆదర్శంగా తీసుకొంది. సోషలిస్ట్‌ మార్కెట్‌ ఎకానమీ విధానం వైపు మళ్లింది. ప్రజలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఇచ్చింది. వియత్నాం 2007లో తొలిసారి డబ్ల్యూటీవోలో ప్రవేశించింది. అప్పటికే ఈ దేశ ఆర్థిక వృద్ధిరేటు దాదాపు 17ఏళ్లుగా నిలకడగా పెరుగుతోంది. భౌగోళికంగా వ్యాపారానికి అవసరమైన కీలకమైన ప్రదేశంలో ఉండటం.. చౌకగా లభించే కార్మికులు, మంచి రవాణ సౌకర్యాలు, పర్యాటక రంగం వంటి కారణలతో ఈ దేశం పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఫలితంగా గత 30 ఏళ్లలోనే ఇది నిరుపేద దేశం నుంచి మధ్యాదాయ దేశంగా రూపుదాల్చిందని ప్రపంచబ్యాంక్‌ నివేదికలు చెబుతున్నాయి. గత ఏడాదికి కూడా 6శాతానికి పైగా జీడీపీ వృద్ధిరేటు సాధించింది. ప్రైవేటు సెక్టారుకు బాటలు.. * ఇక్కడ ఇన్‌ఫ్రా రంగంలో ప్రైవేటు సెక్టార్‌కు బాటలు పరిచింది. దీంతో 2019 నుంచి రాన్నున్న ఐదేళ్లలో జీడీపీలో 7.5శాతం సమానామైన మొత్తం ఇన్ఫ్రా రంగంలో పెట్టుబడులుగా రానున్నాయి. వీటిల్లో ఎఫ్‌డీఐలే ఎక్కువ. ఎగుమతులకు అవసరమైన రవాణ సౌకర్యాలు.. పర్యాటక రంగానికి అవసరమైన సౌకర్యాలను సమకూర్చనుంది. * ఇక్కడి ప్రభుత్వం 2019లో బిజినెస్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ నేషనల్‌ కాంపిటేషన్‌ విధానాన్ని 2023 వరకు అమలు చేయాలని నిర్ణయించింది. కచ్చితమైన కాలావధితో వ్యాపారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించనున్నారు. వ్యాపార సంస్థలకు అనుమతులను కూడా డిజిటలైజ్‌ చేసేశారు. దీంతో కంపెనీలకు వేగంగా అనుమతులు లభించనున్నాయి. 2020 చివరి నాటికి దాదాపు దేశంలో 10లక్షల సంస్థలు ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కార్పొరేట్‌ కంపెనీలు చెల్లించే పన్ను దాదాపు 10శాతం ఉంటుంది. సాధారణ వ్యాపారాలు 20శాతం వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వాణిజ్య యుద్ధం కారణంగా పన్నులను తప్పించుకోవడానికి చాలా కంపెనీలు వియత్నాంకు వెళ్లిపోయాయి. ముడి సరకులు చైనాలో తయారైనా.. వాటి అసెంబ్లింగ్‌ వియత్నాంలో చేసి ‘మేడిన్‌ వియత్నాం’ కింద చూపేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి తోడు చైనాతో పోలిస్తే వియత్నాంలో చౌకగా కార్మికులు అందుబాటులో ఉంటున్నారు. దీంతో చైనా కంపెనీలు కూడా వియత్నాం వైపు మొగ్గుచూపుతున్నాయి. 2018లో ఎఫ్‌డీఐలకు ఆసియాలో అత్యంత అనుకూల ప్రాంతంగా వియత్నాంను ఫోర్బ్స్‌ పత్రిక గుర్తించింది. ఇటీవల కాలంలో శాస్త్రసాంకేతిక రంగాల్లో కూడా ఇక్కడ విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయి. దీంతో ఆ దేశంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించే మూడో రంగంగా ఇది మారింది. ఇక్కడ సోలార్‌ రంగంలో భారత్‌కు చెందిన కంపెనీలు కూడా పెట్టుబడులు పెడుతున్నాయి. టాటా, అదానీ, సుజ్లాన్‌ వంటి సంస్థలు వీటిల్లో ఉన్నాయి. భారత్‌ కంపెనీలు 2019 నాటికి 176 ప్రాజెక్టుల్లో 814 మిలియన్‌ డాలర్లను పెట్టుబడిగా పెట్టాయి. శామ్‌సంగ్‌, యూనివర్సల్‌ అలాయ్‌, ఐకియా, లెనోవా ఇలా దిగ్గజ కంపెనీలు 2019లో తమ పెట్టుబడులను, ప్రాజెక్టులను ఇక్కడికి తరలించాయి. కీలక వాణిజ్య ఒప్పందాలకు సై.. వియత్నాం సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టాక స్వేచ్ఛగా వాణిజ్య ఒప్పందాల్లో భాగస్వామి అవుతోంది. ఏసియాన్‌ ఫ్రీట్రేడ్‌ ఏరియా, డబ్ల్యూటీవో, అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం, ట్రాన్స్‌ పసిఫిక్‌ పార్టనర్‌ షిప్‌ ఒప్పందం , ఈయూ-వియత్నాం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకొంది. తాజాగా ఈయూ-వియత్నాం ఒప్పందాన్ని ఆ దేశ చట్టసభ ఆమోదించింది. ఈ ఒక్క ఒప్పందంతోనే వియత్నాం జీడీపీలో 15శాతం మేరకు పెరుగుదల ఉండొచ్చని అంచనా. ఇక ట్రాన్స్‌పసిఫిక్‌ ఒప్పందంతో మరో 15శాతం వృద్ధి చెందొచ్చని భావించారు. ఈ ఒప్పందాలతో వచ్చే 30ఏళ్లపాటు వియత్నాంకు ఎటువంటి ఢోకాలేదు. భారత్‌కు పెనుసవాల్‌.. వాణిజ్య యుద్ధం నేపథ్యంలో విదేశీ పెట్టుబడులపై ఆశలు పెట్టుకొన్న భారత్‌కు వియత్నాం, థాయ్‌లాండ్‌, బంగ్లాదేశ్‌ రూపంలో పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. తాజా ఐరోపా-వియత్నాం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రతికూల ప్రభావం భారత్‌లోని దుస్తుల తయారీ పరిశ్రమలపై పడనుంది. ఇప్పటికే మన దేశ ఎగుమతులు ఏటా 4శాతం మేరకు తగ్గుతున్నాయి. జులై నుంచి వియత్నాం దుస్తుల తయారీ కంపెనీలకు ఐరోపాలో పన్ను రహిత ఎంట్రీ లభించే అవకాశం ఉంది. తొలుత చైనా మార్కెట్‌ షేర్ వియత్నాంకు దక్కనుంది. మరోపక్క జపాన్‌, దక్షిణ కొరియాలు చైనా నుంచి తమ సంస్థలను వేరే ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ముఖ్యంగా జపాన్‌ దీనికోసం ఏకంగా రెండు బిలియన్‌ డాలర్ల నిధిని కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు భారత్‌, వియత్నాం మధ్య కంపెనీలను దక్కించుకొనేందుకు తీవ్రమైన పోటీ నెలకొంది.
 3. Ma friend HCL bpo Chennai lo work chestunnadu, very soon valla process Vijayawada ki transfer avutundi annaru.
×