Jump to content

Kiriti

Members
 • Content count

  2,429
 • Donations

  $0.00 
 • Joined

 • Last visited

About Kiriti

 • Rank
  Elite Fan

Profile Information

 • Gender
  Male

Recent Profile Visitors

2,303 profile views
 1. కృష్ణా నీటి లభ్యత తగ్గింది.. గోదావరే దిక్కు: హరీశ్‌ . http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break131
 2. ముఖ్యమంత్రి మాట ఇది! ఢిల్లీ భేటీపై మంగళవారం జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆ శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఇంజనీరు ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు తదితరులతో సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత కేంద్రం సమీక్ష గురించి సీఎంకు మంత్రి ఉమా తెలియజేశారు. సావధానంగా విన్న సీఎం.. కేంద్రం నిర్ణయం ఏమిటో తెలియకుండా .. రాష్ట్రం తన వైఖరిని చెప్పేయడం సరికాదని సూచించారు. గోదావరి - కావేరి అనుసంధానంపై కేంద్రం మనసులో ఏముందో తెలుసుకోవాలని సూచించారు. ఇటీవల కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను నాగార్జున సాగర్‌ ద్వారా కావేరికి మళ్లించాలన్న ఆలోచనలో కేంద్రం ఉందనే ప్రచారమూ జరిగిందని మంత్రి ఉమాకు చంద్రబాబు గుర్తు చేశారు. ఇలాంటి తరుణంలో కేంద్ర నిర్ణయంపై స్పష్టత వచ్చేదాకా ఆగాలని పేర్కొన్నారు. బుధవారం సమావేశంలో కేంద్రం మనసులో ఏముందో తెలిస్తే .. అప్పుడు రాష్ట్రం వైఖరి ఏమిటో తేటతెల్లం చేసేందుకు వీలుంటుందని చెప్పారు. గోదావరి - కావేరి అనుసంధాన ప్రక్రియ కాళేశ్వరం నుంచి కావేరీ దాకా తీసుకువెళ్లే పరిస్థితి ఏమిటో, పోలవరం నుంచి వయా పెన్నా, కావేరీ దాకా తీసుకువెళ్తే ఎదురయ్యే ఫలితాలేమిటో అధ్యయనం చేద్దామని వివరించారు. సమావేశానికి ఈఎన్‌సీ ఎం వెంకటేశ్వరరావును పంపితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇదే సమయంలో బుధవారం నాటి సమావేశం ప్రాథమికమైనదే అయినందున .. గోదావరి - కావేరిపై కేంద్రం తన నిర్ణయాన్ని వెల్లడించాక .. నిర్వహించే సమావేశానికి ఈఎన్‌సీ హాజరైతే బాగుంటుందన్న అభిప్రాయమూ వచ్చింది. మొత్తానికి ఢిల్లీలో బుధవారం కేంద్ర జల వనరుల శాఖ నిర్వహించే సమీక్ష .. రెండు తెలుగు రాష్ట్రాలకూ అత్యంత కీలకం కానున్నదని జల వనరుల నిపుణులు చెబుతున్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటిస్తే, గోదావరి జలాల్లో వచ్చే వాటా ఎంతో తెలుస్తుంది. నామమాత్రంగా 10 టీఎంసీలో, 20 టీఎంసీలో ఇస్తామంటే రాష్ట్రానికి ఆమోదయోగ్యం కాదు. కనీసం 100 నుంచి 200 టీఎంసీలు వస్తే .. రాష్ట్రానికి ప్రయోజనం. ఇలాంటి అంశాలన్నింటిపైనా ఈ సమావేశం స్పష్టతనిస్తుందంటున్నారు. This Thought is Good.
 3. AP & Orissa - BJP endukila.

  BJP National Party laga behave chesthunnatlu ledhugaa.
 4. సాలూరు రూరల్‌, విజయనగరం, జనవరి 12: ఒడిశా-ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కొఠియా గ్రామాల వివాదాల తేనె తుట్టె మళ్లీ కదిలింది. ఈనెల 9న కొఠియా గ్రూప్‌ గ్రామాల పరిధిలోని గంజాయిభద్రలో ఏపీ ప్రభుత్వం జన్మభూమి నిర్వహణపై ఒడిశా ప్రభుత్వం మండి పడుతోంది. ఈ గ్రామాల విషయమై కోర్టుకు వెళ్లనున్నట్టు ఒడిశా రెవిన్యూశాఖ మంత్రి మహేశ్వర మహంతి ప్రకటించారు. అయితే... ఆయన ప్రకటన ఏపీ అధికారులను కొంత అయోమయంలోకి నెట్టింది. కోర్టులో ఒడిశా ఓటమి చెందనదే ఆయన చెప్పినట్టు పత్రికల్లో రావడంతో ఏపీ అధికారులు మరోసారి కేసు విషయమై పరిశీలన చేయాల్సి వచ్చింది. కొఠియా గ్రూప్‌ గ్రామాలపై సుప్రీం కోర్టులో 1967 నుంచి కేసు నడుస్తోంది. సుప్రీం కోర్టు స్టేటస్‌కో సైతం జారీ చేసింది. 2014లో ఇరు రాష్ట్రాలు చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. అయితే కోర్టు ఈ సూచన చేసిన తర్వాత ఇరురాష్ట్రాలు చర్చించిన దాఖలాల్లేవు. కాగా.. ఈ సూచన రాకముందు నుంచి ఇరు రాష్ట్రాలు కొఠియా గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. ఒడిశా మరింత ముం దుకు అడుగేసి నేరేళ్లవలస, దొరలతాడివలస వరకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది. ఏపీ నుంచి విజయనగరం జిల్లా కలెక్టర్‌ తొలిసారిగా కొఠియాలో పర్యటించి జన్మభూమి కార్యక్రమం నిర్వ హించడంతో ఒడిశాలో అధికార బీజేడీపై బీజేపీ ధ్వజ మెత్తింది. అలాగే ఒడిశా మీడియా సైతం జన్మభూమి జరగడంపై అక్కడి అధికారులపై విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో రెవిన్యూశాఖ మంత్రి మహేశ్వర మహంతి ఏపీ నిర్వహించిన కార్యక్రమంపై కోరాపుట్‌ జిల్లా కలెక్టర్‌ అనుపమ సాహుతో సమీక్షించారు. అనంతరం కోర్టుకు వెళ్లతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏపీ అధికారులు సైతం ఈ ప్రకటనపై దృష్టి సారించారు.
 5. ఓ కంపెనీకి 4.67కోట్ల ఐటీసీ రిటర్న్స్‌ చెల్లించడానికి రూ. 25 లక్షల లంచం వాణిజ్యశాఖ రాష్ట్ర కార్యాలయమే వేదిక డీల్‌ చేసుకొన్న అడిషనల్‌ కమిషనర్‌ వ్యవహారం నడిపిన కంపెనీ అడ్వైజర్‌ హైదరాబాద్‌నుంచి డబ్బుతో ప్రతినిధులు కార్యాలయంలో నగదు అందిస్తుండగా..నలుగురిని అరెస్టు చేసిన ఏసీబీ ఏసీబీ చరిత్రలోనే తొలిసారి 23.20 లక్షల లంచం స్వాధీనం చేసుకొన్న అధికారులు గోపాల్‌శర్మే కీలకం: ఠాకూర్‌ ‘‘తాము చేసిన కాంట్రాక్టు పనులకు సంబంధించి, తమకు రావాల్సిన ఐటీసీ రిటర్న్స్‌ కోసం ఐటీడీ సిమెంటేషన్‌ ఇండియా లిమిటెడ్‌ అనే కంపెనీ ప్రతినిధులు, వాణిజ్యశాఖ అధికారులు డిమాండ్‌ చేసిన లంచం అందిస్తుండగా అరెస్టు చేశాం. ఈ వ్యవహారంలో ఈ కంపెనీ లీగల్‌ అడ్వయిజర్‌ గోపాల్‌ శర్మ కీలకంగా వ్యవహరించారు. ఆయన ఉమ్మడి హైకోర్టులో ప్రాక్టీస్‌ చేస్తున్నారు. వాణిజ్య అధికారి ఏడుకొండలుతో నేరుగా గోపాల్‌ శర్మే వ్యవహారం నడిపారు. ఈ సమాచారమంతా ముందే మాకు చేరిపోవడంతో, సకాలంలో రంగంలోకి దిగాం. ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టే ప్రయత్నంలో ఉన్నవారిని పట్టుకున్నాం... అవినీతి ఏ రూపంలో ఉన్నా విడిచిపెట్టే ప్రసక్తిలేదు’’ అని ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ హెచ్చరించారు. ప్రజలను లంచాల కోసం పీడించే వారిని ట్రాప్‌ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఖర్చు చేస్తోన్న సొమ్మును మింగేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. ‘‘అవినీతి విషయంలో మాకు ఎన్నో మార్గాల్లో సమాచారం వస్తుంది. అది ఇంటర్నర్‌ విజిల్‌ బ్లోయర్‌ సమాచారం కావొచ్చు, ప్రైవేటు వ్యక్తి కావచ్చు, లేక కంపెనీ ప్రతినిధి కావచ్చు. అక్కడ జరిగిందా లేదా అన్నదే ముఖ్యం’’ అని ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఎవరికి వారు ఇలా దోచుకుంటే ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని ఆయన ప్రశ్నించారు. http://www.andhrajyothy.com/artical?SID=519909
 6. దేశం ఎలా వున్నా రాష్ట్ర ధీమా ఇదే అన్నదాత – పోలవరం పూర్తి అవుతుంది ఇక మనకు నీటి బాధలు లేవు, ప్రకృతి వ్యవసాయం గట్రా అంటున్నారు, వ్యవసాయం లాభసాటి అవ్వొచ్చు. నిరుద్యోగులు – పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ఇక భయం లేదు. వ్యాపారస్తులు & రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు – అమరావతి వస్తుంది మనకు మంచి కాలం వుంది. విశాఖ & తిరుపతి లు కూడా పెద్ద పట్టణాలు అవుతాయి. విద్యార్థులు – మంచి విద్యా సంస్థలు అవకాశాలు వస్తున్నాయి బాగా చదువుకోడానికి. వృద్ధులు – పెన్షన్ లు వస్తున్నాయి పదుల సంఖ్యలో ఆసుపత్రులు వస్తున్నాయి, నిశ్చింతగా బతకొచ్చు. ఆరోగ్యాన్ని కోరుకొనే వాళ్లు – పార్కులు వస్తున్నాయి, నడక, పరుగు సంస్కృతి పెరుగుతోంది, పరిస్థితులలో మార్పులు వస్తున్నాయి, హమ్మయ్య. కార్మికులు : ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి, ఒకటి కాకపోతే ఇంకొకటి. మూడేళ్లలో రాష్ట్రం లో ఇన్ని ఆశలు ఆనందాలు. ….చాకిరేవు.
 7. కాంట్రాక్టర్‌, డిజైన్‌ ఏదన్నది కాదు రేపో, ఎల్లుండో గడ్కరీతో మాట్లాడతా ప్రతీ ప్రాజెక్టూ పరీక్షలా మారింది ఒక్కరి వల్లే అవి ఆగిపోతున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్రోశం అమరావతి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ‘‘నాకు కావాల్సింది పోలవరం ప్రాజెక్టు పూర్తికావడమే. కాంట్రాక్టరు ఎవరు? టెక్నికల్‌గా ఏంటి? అప్పర్‌ కాఫర్‌ డ్యాం ఉంటుందా? లేదా? ఇవన్నీ అనవసరం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రానికి చాలా ప్రాజెక్టులు ఉండొచ్చని... రాష్ట్రానికి జీవనాడి ఒక్క పోలవరం ప్రాజెక్టేనని చెప్పారు. దీనిపై రేపో, ఎల్లుండో కేంద్ర జలవనరుల శాఖమంత్రి నితిన్‌ గడ్కరీతో మాట్లాడతానని చెప్పారు. సోమవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... పోలవరంలో అప్పర్‌ కాఫర్‌ డ్యాం వద్దని కేంద్ర నిపుణుల బృందం నివేదిక ఇచ్చిందట కదా? అని ప్రశ్నించగా... ‘‘అప్పర్‌ కాఫర్‌ డ్యాం సగం కడితే సరిపోతుందని, లోయర్‌ కాఫర్‌ డ్యాం పూర్తిచేసి ప్రధాన డ్యామ్‌కు వెళ్తే చాలని... రెండు, మూడు ఆప్షన్లు సూచిస్తున్నారు. కాఫర్‌డ్యాం లేకుంటే నీళ్లను తోడేందుకు చాలా ఖర్చు అవుతుంది. టెక్నికల్‌ డిజైన్లు ఎలా ఉండాలన్నది కేంద్రం ఇష్టం. మాకు ప్రాజెక్టు పూర్తి కావడమే ముఖ్యం’’ అని చంద్రబాబు వివరించారు. గడ్కరీ కొత్తగా ఈ శాఖ బాధ్యతలు చేపట్టారని... ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పని పరిస్థితిని ఆయనకూడా బాగానే అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల పూర్తి విషయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్రాజెక్టుకోసం 99.9శాతం మంది కలిసొస్తే ఒక్కరు వివాదాస్పదం చేస్తున్నారని, దీంతో మొత్తం ప్రాజెక్టు ఆగిపోతోందని ఆక్రోశించారు. ప్రతి ప్రాజెక్టు తమకు అగ్నిపరీక్షలాగే తయారైందన్నారు. ఇవన్నీ రాజకీయ కేసులేనా? అని ప్రశ్నించగా... ‘‘ఎక్కువ రాజకీయ కేసులే. కొందరు అత్యాశకు వెళ్లి కూడా కేసులు వేస్తారు. సమాజంలో అంతా బాగుంటే ఓర్వలేనివారు, అత్యాశపరులు కొందరుంటారు. కొత్త సంవత్సరంలోనైనా అందరికోసం కలిసి రావాలి’’ అని హితవు పలికారు. ఒత్తిడితో పని చేయించలేం అధికారులపై ఒత్తిడి చేసి పనిచేయించలేమని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘అధికారులు హైదరాబాద్‌ నుంచి రావడం లేదని అంటున్నారు. అక్కడ మంచి సౌకర్యాలు, కుటుంబ అవసరాలు ఉండడంతో కొంతమంది రావడం లేదు. డిసెంబరు 31వ తేదీ రాత్రి భవానీ ఐల్యాండ్‌, ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర డిన్నర్‌ చేశాం. అంతకంటే బెస్ట్‌ ప్లేస్‌ ఎక్కడుంది?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. మౌలిక సదుపాయాలు పెరిగితే అంతా అమరావతికి వస్తారని... ఆ రోజు ఎంతో దూరంలో లేదని తెలిపారు.
 8. Love each one as a human being. We can always differ in our opinions.
 9. Signature dish of AP

  Include Avakaya Pachadi and Muddapappu combination also.
 10. ఏపీలో ఈ పది జిల్లాలు ఎందుకు వెనుకబడుతున్నాయో అన్వేసిస్తే.. సంతోషం సగం బలం అంటారు. అలా సంతోషంగా ఉండటానికి ఎన్నో కారణాలు ఉంటాయి. పరిసరాలు, స్థిర ఆదాయం, కూతుళ్లు, కొడుకుల నుంచి ఆదరణ- ఇలాంటి అంశాలన్నీ కూడా కుటుంబంలో ఆనందాన్ని కలిగిస్తాయి. చక్కని రహదారులు, 24 గంటల విద్యుత్, రోజూ మంచినీటి సరఫరా వంటి సామాజిక అంశాలు కూడా సంతోషాన్ని ఇస్తుంటాయి. అయితే ఈ సంతోషాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. హ్యాపీనెస్ ఇండెక్స్‌లో మూడు జిల్లాలు దూసుకువెళుతున్నాయి. మిగతా పది జిల్లాలు ఎందుకు వెనుకబడుతున్నాయనేది ఇప్పుడు సచివాలయంలో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కారణాలు కోసం అన్వేషిస్తే ఏమి తెలిసిందో ఈ స్టోరీలో చూద్దాం. ప్రజల అవసరాలను తీర్చడం, సమస్యలను వేగిరం పరిష్కారించడం, నిర్ణీత గడువులో ఈ పనులు పూర్తిచేయడం, పాలనలో సాంకేతికతను జోడించడం, తద్వారా పారదర్శకతను సాధించడం వంటి అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టిసారిస్తోంది. సమస్యల పరిష్కారం కోసం ఇదివరకులా ప్రజాప్రతినిధుల వద్దకు దరఖాస్తులు తీసుకుని పరుగులు తీయనక్కరలేదు. ఇంటి వద్దే కూర్చుని 1100కు ఫోన్‌చేస్తే చాలు. ఆయా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. అయితే ఈ చర్య పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి ఎంత ఉందనేది ప్రభుత్వం లెక్కలు తీస్తోంది. ఇందుకోసం సచివాలయంలోని రియల్ టైమ్‌ గవర్నెన్స్ సెంటర్.. సంక్షిప్తంగా చెప్పాలంటే ఆర్టీజీ నుంచి ప్రభుత్వం విశ్లేషణ చేస్తోంది. ప్రజలకి ఉన్న సమస్యలను పరిష్కరిస్తే సహజంగానే వారిలో సంతృప్తి స్థాయి పెరుగుతుందనేది ప్రభుత్వం అంచనా. మారుమూల గ్రామాలలో ఉన్న వారు సైతం ప్రస్తుతం 1100కు ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ఈ పరిష్కార వేదికకు కాల్ చేస్తే సమస్యలు తీరతాయనే భావం ప్రజల్లో బలంగా ఏర్పడింది. దీంతో ఈ సెంటర్‌కు ఆదరణ పెరిగింది. ప్రజల కోసం అమలుచేసే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును కూడా ఈ సెంటర్ ద్వారా ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. ప్రజలు ప్రభుత్వ పాలన పట్ల ఏ భావంతో ఉన్నారో తెలుసుకునేందుకు ఈ సెంటర్‌ ఉపయోగపడుతోంది. 1100 నుంచి రాష్ట్రంలోని లక్షలాది మందికి వారానికి ఒకసారి కాల్స్ వెళ్తూ ఉంటాయి. ప్రజల స్పందన ఆధారంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో, సమస్యల పరిష్కారంలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తేలింది. గుంటూరుజిల్లాలోని గుంటూరు, తెనాలి డివిజన్లు, ప్రకాశం జిల్లాలోని కొంత ప్రాంతంలో ప్రభుత్వ కార్యక్రమాల పట్ల 80 శాతం సంతృప్తి వ్యక్తమవుతోందని విశ్లేషణలో తేలింది. గుంటూరుజిల్లాలోని పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కనిగిరి తదితర ప్రాంతాలలో మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ప్రభుత్వం హ్యాపీనెస్ ఇండెక్స్ కోసం తీసుకున్న ఫీడ్‌బ్యాక్‌లో 50 శాతం వరకు సంతృప్తి రాగా, కడప జిల్లాలో పాస్ మార్కులు మాత్రమే వచ్చాయని చెబుతున్నారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల విషయానికి వస్తే విశాఖపట్టణంలో ప్రభుత్వ సంక్షేమ- అభివృద్ధి కార్యక్రమాల పట్ల సంతృప్తి వ్యక్తమవుతోంది. విశాఖపట్టణం నగరంలో కూడా అభివృద్ధి బాగా జరిగిందని పూర్తిస్థాయి సంతృప్తి వ్యక్తమైంది. ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని డివిజన్లలో ప్రజలు సంక్షేమ- అభివృద్ధి కార్యక్రమాల పట్ల పెదవి విరుస్తున్నారని చెబుతున్నారు. ఆర్టీజీ సెంటర్, పరిష్కార వేదిక అయిన 1100 నుంచి వెళుతున్న కాల్స్‌లో తీస్తున్న సగటు శాతాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న ప్రభుత్వం ఎక్కడైతే సంతృప్తిస్థాయి తక్కువ ఉందో.. ఆ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించడం ప్రారంభించింది. ఇదే కాకుండా ప్రజాప్రతినిధుల పనితీరుపై చంద్రబాబు రప్పించుకుంటున్న సర్వే కూడా సంతృప్తిస్థాయిని ప్రభావితం చేస్తోందని అంటున్నారు. ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పనితీరు, వస్తున్న అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉండటంతో అక్కడి ప్రజలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉంటున్నారని కూడా ఒక విశ్లేషణలో తేలింది. వీటన్నింటినీ సెట్‌రైట్ చేసేందుకు సీఎం కసరత్తును ప్రారంభించారు. కుటుంబంలో ఉండే సంతోషంతోపాటు సామాజిక అవసరాలను కూడా తీరిస్తేనే ఆ కుటుంబానికి పూర్తి సంతోషం కలుగుతుందనేది కొలమానంగా పెట్టుకున్నారు. సామాజిక అవసరాలు.. ముఖ్యంగా రహదారులు, మంచినీరు, నిరంతర విద్యుత్ సరఫరా, అందుబాటులో, సరసమైన ధరల్లో నిత్యావసర వస్తువులు, రైతుబజార్ల పనితీరు వంటివి మెరుగుపడితేనే పూర్తిస్థాయి సంతృప్తి వస్తుందనీ, అప్పుడే సామాన్య, మధ్యతరగతి ప్రజలు సైతం ప్రభుత్వం పట్ల సంతృప్తిని వ్యక్తంచేస్తారనీ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఎక్కడైతే సంతృప్తి తక్కువుగా ఉందో ఆ ప్రాంతాలపై ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలు సీరియస్‌గా దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
×