Jump to content

goldenstar

Members
 • Content Count

  2,926
 • Donations

  $0.00 
 • Joined

 • Last visited

About goldenstar

 • Rank
  Elite Fan

Profile Information

 • Gender
  Array

Recent Profile Visitors

6,959 profile views
 1. అమరావతి: గత ప్రభుత్వంలో పేదల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన 6,032 ఇళ్లను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు జిల్లా కుప్పంలో 2వేల ఇళ్లు, విశాఖపట్నం జిల్లా చోడవరంలో 3,936, కృష్ణా జిల్లా కురుమద్దాలిలో 96 ఇళ్లను రద్దు చేస్తున్నట్లు గృహనిర్మాణ శాఖ ఆదేశాల్లో పేర్కొంది. వివిధ కారణాలతో అవసరమైన భూమి అప్పగించకపోవడం, ప్రాజెక్టు చేపట్టేందుకు భూమి లభ్యత లేకపోవడం, టెండర్లు ఖరారు కాకపోవడ తదితర కారణాలతో ఈ ఇళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు తగుచర్యలు తీసుకోవాలని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎండీని ప్రభుత్వం ఆదేశించింది.
 2. దిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సీబీఐ ప్రత్యేక కోర్టు కస్టడీకి అనుమతించింది. కేసు విచారణకు ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని సీబీఐ చేసిన విజ్ఞప్తికి న్యాయస్థానం అంగీకారం తెలిపింది. ఈనెల 26 వరకు నాలుగు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ నాలుగు రోజుల్లో కుటుంబసభ్యులు, న్యాయవాదులు చిదంబరంను కలవొచ్చని కోర్టు స్పష్టం చేసింది.
 3. అమరావతి: పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టు ఒప్పందం రద్దు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చుక్కెదురైంది. నవయుగ సంస్థ టెండర్లను రద్దు చేస్తూ ఏపీజెన్‌కో జారీ చేసిన ప్రిక్లోజర్‌ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. టెండర్‌ ప్రక్రియపై ముందుకు వెళ్లొద్దని స్పష్టం చేసింది. ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని నవయుగ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. దీంతో పోలవరం పనులు నవయుగ సంస్థే కొనసాగించే అవకాశముంది.
 4. దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరాన్ని సీబీఐ వెంటాడుతోంది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణానికి సంబంధించిన అవినీతి, నగదు అక్రమ చలామణీ కేసుల్లో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. సుప్రీంలోనూ ఆయనకు ఊరట లభించలేదు. మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు సీబీఐ అధికారులు దిల్లీలో ఆయన నివాసానికి చేరుకున్నారు. చిదంబరం అక్కడ లేరని తెలుసుకొని వారు వెనుతిరిగారు. ఆయన ఫోన్లను స్విచ్చాఫ్‌ చేసినట్లు కొందరు అధికారులు తెలిపారు. సీబీఐతోపాటు ఈడీ కూడా ఆయన కోసం గాలిస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ మరోసారి బుధవారం ఉదయాన్నే చిదంబరం ఇంటికి వెళ్లారు. దక్షిణ దిల్లీలోని జోర్‌బాఘ్‌ వద్ద ఉన్న చిదంబరం నివాసానికి వెళ్లగా ఆయన అక్కడ లేరు. తీర్పు వెలువడినప్పటి నుంచి సీబీఐ బృందం ఆయన ఇంటికి రావడం ఇది మూడోసారి. మరోవైపు ఆయన ఏ సమయంలోనైనా రావచ్చని భావించిన ఈడీ బృందం చిదంబరం నివాసం వద్దే కాచుకొని ఉన్నారు. కానీ, ఆయన రాకపోవడంతో వెళ్లిపోయారు.
 5. తిరుపతి: అంతర్జాతీయ స్మగ్లర్‌ కొల్లం గంగిరెడ్డికి బెయిల్‌ మంజూరైంది. కడప జిల్లాకు చెందిన గంగిరెడ్డి.. 27 ఎర్రచందనం కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. గాజులమండ్యం కేసులో ఆయనకు తిరుపతి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 2015 నుంచి కడప కేంద్ర కారాగారంలో ఉన్నారు. గతంలో గంగిరెడ్డిని కడప పోలీసులు శ్రీలంకలో అరెస్టు చేసి తీసుకొచ్చారు. తాజాగా కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో కాసేపట్లో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు.
 6. మా ఉద్యోగాలు మాకే.. గళమెత్తిన నటుడు ఉపేంద్ర బెంగళూరు: కర్ణాటకలోని ఉద్యోగాలన్నీ స్థానికులకే ఇవ్వాలని ప్రముఖ నటుడు ఉపేంద్ర డిమాండ్‌ చేశారు. ఇందుకోసం పోరాటం సాగిస్తానని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ‘కర్ణాటకలో ఉద్యోగాలు కన్నడిగులకే ఇవ్వాలి. దీని గురించి ఎన్నో సంవత్సరాలుగా పోరాటం జరుగుతోంది. రాష్ట్రంలోని ఉద్యోగాల్లో వారికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అందరి ఆకాంక్ష కూడా. ఇందుకోసం నేను పోరాటం చేస్తాను. ఈ మేరకు ఈ నెల 14, 15 తేదీల్లో గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేస్తాను. ఇందుకు నాకు యువత మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నాను. నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను’ అని ఉపేంద్ర వీడియోలో చెప్పుకొచ్చారు. స్వతహాగా బెంగళూరు ఐటీ రాజధాని కావడంతో దేశ నలుమూలల నుంచి ఉపాధి కోసం అక్కడికే వస్తుంటారు. దీంతో స్థానికులకు అన్యాయం జరుగుతుందనే వాదన ఎప్పటి నుంచో ఉంది. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ఇటీవలి కాలంలో ఉపేంద్ర గట్టిగానే పోరాటం చేస్తున్నారు. అప్పుడప్పుడు ప్రభుత్వాలపై విమర్శలు చేస్తూ ట్వీట్లు కూడా పెడుతున్నారు. కొద్దిరోజుల క్రితం కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపైనా ఆయన మాట్లాడారు. దీంతో పాటు ఈనెల 9న అవినీతిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఓ లేఖను విడుదల చేశారు. అధునాతన టెక్నాలజీని ఉపయోగించి అవినీతిని అంతం చేయవచ్చని తెలిపారు.
 7. ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు: హీరో ట్వీట్‌ హైదరాబాద్‌: ‘కొబ్బరిమట్ట’ సినిమాను ప్రదర్శించలేదని హీరో సంపూర్ణేష్‌బాబు అభిమాని వీరంగం సృష్టించాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ సెల్‌ టవర్‌ ఎక్కాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని మదనపల్లె చంద్రా కాలనీలో చోటుచేసుకుంది. మదనపల్లెలో ‘కొబ్బరిమట్ట’ సినిమాను ఏ థియేటర్‌లోనూ ప్రదర్శించడం లేదు. దీంతో సినిమాను పట్టణంలో ప్రదర్శించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం రెడ్డెప్ప అనే అభిమాని విలేకరుల సమావేశం నిర్వహించాడు. కానీ ఏ పత్రికలోనూ వార్త ప్రచురితం కాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు ఆదివారం చంద్రా కాలనీ సమీపంలోని సెల్‌ టవర్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై ఘటనా స్థలానికి చేరుకున్నాడు. కానిస్టేబుల్‌ సహాయంతో రెడ్డెప్పను కిందకు తీసుకొచ్చారు. ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనపై సంపూర్ణేష్‌బాబు సోషల్‌మీడియాలో స్పందించాడు. ‘దయచేసి ఇలాంటి పిచ్చి పనులు చేసి, మీ తల్లిదండ్రులకు బాధ కలిగించకండి. సినిమా ఇప్పుడు కాకపోతే రెండు రోజుల తర్వాత చూడొచ్చు’ అని ఆయన అభిమానులను ఉద్దేశించి అన్నాడు.
 8. Aa Kotam Reddy, tollywood lo manchi villian ga paniki vastadu. his dialogue delivery and his presence --Tollywood top villain qualities unnayi.
 9. కర్ణాటక లో ఉన్న ఆంధ్ర ఉద్యోగులు ఇక మూట ముల్లె సర్దుకొండి. ముక్యంగా నా రెడ్డి ఆంధ్రులు. ఎందుకంటే అక్కడ కూడా ఇక్కడి తుగ్లక్ రెడ్డి లాగా 75% స్థానికులకి అనే వివాదం మొదలైంది, బీజేపీ మద్దతు కూడా తెలిపింది. అందరం కలిసి నిరుపేద ఆంధ్ర రాష్టంలో మూటలు మోసి బతికేద్దాం. రండి
 10. బెంగుళూరు నుంచి బస్సులు,ట్రైన్లలో అపసోపాలు పడి ఎలాగోలాగా వచ్చి అర్ధరాత్రుల వరకు ఓట్లు వేసి మరీకావాలి జగన్.... రావాలి జగన్ అని ఎగిరారుగా...💃🕺 ఏ మాటకామాట అన్నియ్య ఓటు వేసిన ఎవరిని వదలడం లేదుగా...😂🤣 ఇప్పుడు ఏసుకొండిరా సాంగ్....🎵 😄
 11. యలమంచిలి: మండలంలోని దొడ్డిపట్లలో వరదబాధితులకు నిత్యావసరాలు అందించాలని కోరుతూ.. పాలకొల్లు శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు శుక్రవారం వరదనీటిలోనే బైఠాయించారు. అధికారులు వచ్చి న్యాయం చేసేవరకు నిరసన కొనసాగిస్తామని ఆయన తెలిపారు. దొడ్డిపట్ల పరిధిలోని సుమారు 200 గృహాల చుట్టూ గోదావరి వరదనీరు చేరింది. ఇక్కడ నివసించేవారంతా మత్స్యకారులు కావడంతో గతవారం రోజులుగా ఉపాధి కోల్పోయి నిత్యావసరాలకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అధికారులెవ్వరూ ఈ ప్రాంతానికి రాలేదని స్థానిక మహిళలు ఆవేదన చెందడంతో ఎమ్మెల్యే నిరసనకు దిగారు.
 12. need this momentum till end. Until May 2019, i did not considered Lokesh and did not liked him also. NBK & jr NTR busy with movies. Pawan is not active in politics. So, obviously Lokesh is hope. By default following him in twitter daily.
 13. 2024 or 2029-- he will be CM
 14. Lokesh so far so good. Active in twitter also..
 15. సైబర్‌ చౌర్యం సొమ్ముతో ఆయుధాలు ఐరాస నివేదిక ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తర కొరియా ఆయుధాల తయారీ వెనుక ఉన్న ఆర్థిక శక్తిని ఐరాస గుర్తించింది. ఆంక్షలు ఉన్నా విదేశీ కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయో తెలుసుకొని నోరెళ్లబెట్టింది. ఆ దేశ హ్యాకింగ్‌ నిపుణులు సైబర్‌ దాడులకు తెగబడి కొల్లగొట్టిన సొమ్మును ఆయుధాల ముడిపదార్థాల కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపులు చేసేందుకు ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది. ఐరాస మొత్తం 35 సైబర్‌ దాడులను పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించినట్లు ఓ ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. సైబర్‌ దాడులు చేసి దోచుకున్న మొత్తం 2 బిలియన్‌ డాలర్లను (దాదాపు రూ.14వేల కోట్ల)ను ఆయుధ అభివృద్ధి కార్యక్రమానికి వెచ్చించింది. ఈ మేరకు ఓ నివేదిక ఐరాస ఆంక్షల కమిటీకి చేరింది. ముఖ్యంగా ఆర్థిక సేవలు అందించే సంస్థలను, క్రిప్టోకరెన్సీ ఎక్స్‌ఛేంజిలను లక్ష్యంగా చేసుకొని ఉ.కొరియా సైబర్‌ నేరగాళ్లు దాడులకు తెగబడుతున్నట్లు పేర్కొంది. దీంతో పాటు అత్యంత శక్తివంతమైన కంప్యూటర్లను వినియోగించి సైబర్‌ మైనింగ్‌ నిర్వహించి వర్చువల్‌ కరెన్సీలను కూడా ఉ.కొరియా నిపుణులు సృష్టించి విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదిస్తున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీలపై సొమ్ము ఎటు వెళుతోందో గుర్తించలేకపోవడం, ప్రభుత్వ నియంత్రణ తక్కువగా ఉండటంతో వీటిని లక్ష్యంగా చేసుకొంది. ఈ నివేదికపై అమెరికా ప్రతినిధి మాట్లాడుతూ.. సభ్య దేశాలు ఉ.కొరియా సైబర్‌ దాడులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 2006లో తొలిసారి ఉత్తరకొరియాపై ఐరాస భద్రతా మండలి ఆంక్షలను విధించింది. వీటి ప్రకారం ఆ దేశం నుంచి బొగ్గు, ఇనుము, దుస్తులు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతిని నిషేధించింది. అదే సమయంలో పెట్రోలియం, ముడి చమురు దిగుమతులపై కూడా ఆంక్షలను విధించింది. రెండు వారాల వ్యవధిలో ఉత్తర కొరియా నాలుగు క్షిపణి పరీక్షలను నిర్వహించడంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖండాంతర క్షిపణులను పరీక్షంచనని కిమ్‌ హనోయ్‌ సమావేశం సందర్భంగా వెల్లడించారు. కానీ, ఆ తర్వాత నుంచి క్షిపణి పరీక్షలను మాములుగానే నిర్వహిస్తున్నారు.
×