Jump to content

Royal Nandamuri

Members
  • Content Count

    1,116
  • Donations

    $0.00 
  • Joined

  • Last visited

About Royal Nandamuri

Profile Information

  • Gender
    Array

Recent Profile Visitors

The recent visitors block is disabled and is not being shown to other users.

  1. ఢిల్లీ: ఢిల్లీలో సీఎం చంద్రబాబు దూసుకుపోతున్నారు. ఢిల్లీలో ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, శరద్‌పవార్‌, శరద్‌యాదవ్‌, సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజాను వేర్వేరుగా చంద్రబాబు కలిశారు. ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం. ఫలితాల ముందే ఎన్డీయేతర పక్షాలను చంద్రబాబు ఏకం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం చంద్రబాబు ఢిల్లీ నుంచి లక్నో వెళ్లారు. ఎస్పీ, బీఎస్పీ అధినేతలతో భేటీ కాబోతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై వీరిద్దరితో చంద్రబాబు చర్చించబోతున్నారు. ఎన్డీయేతర పక్షాలను బలోపేతం చేసేందుకు ఏఏ చర్యలు చేపట్టాలి... ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది.. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఏఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి.. అనే అంశాలపై వీరిద్దరితో చంద్రబాబు చర్చించబోతున్నారు. ఇటీవల రాహుల్‌ను చంద్రబాబు కలిశారు. ఈ భేటీలో రాహుల్‌కు చంద్రబాబు ఓ రిపోర్టు కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితిల్లో కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం.. లేదా ఆ పార్టీ మద్దతుతో ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడే సూచనలు ఉన్నాయనేది రాజకీయ నిపుణులు అంచానా. ఇదే విషయాన్ని చంద్రబాబు, రాహుల్‌కు ఓ నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా చంద్రబాబు అంచనా ప్రకారం బీజేపీకి వంద సీట్లు కచ్చితంగా తగ్గిపోతాయని ఆయన అంచనా వేస్తున్నారు. మరోవైపు అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించబోతుందని చంద్రబాబు తన రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే బీజేపీ కన్నా కాంగ్రెస్‌కు యాభై సీట్లు తక్కువ వస్తాయని చంద్రబాబు జోస్యం చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రాంతీయ పార్టీలకు అత్యధిక సీట్లు వస్తాయని ఆయన చెబుతున్నారు. ఏపీలో గత ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని చంద్రబాబు, రాహుల్‌కు ఇచ్చిన రిపోర్ట్‌లో పేర్కొనట్లు సమాచారం.
  2. Kallu moosukoni....ee photo lu sarigga vastunnayo ledo ane tension ye baga paduntadu 🤣🤣🤣
  3. The non-veg friend whenever the waiter brings a vegetarian dish
  4. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూతు‌ల్లో రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే రీపోలింగ్ అక్కర్లేదని టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అటు టీడీపీ వద్దంటుండగా.. వైసీపీ నేతలు మాత్రం ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రగిరి రీ-పోలింగ్ వివాదంలోకి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం దిగినట్లు తెలుస్తోంది. సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సూచనల మేరకే సీఈఓ ద్వివేది రీ-పోలింగుకు సిఫార్సు చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నెల ఆరో తేదీన రీ-పోలింగ్ చేయాలంటూ సీఎస్ ఎల్వీని చెవిరెడ్డి కోరారు. చెవిరెడ్డి ఫిర్యాదు పరిగణనలోకి తీసుకోవాలని సీఎస్ కోరుకుంటున్నారంటూ ద్వివేదికి సీఎస్ ఓఎస్డీ లేఖ రాశారు. ఎన్నికల ప్రక్రియలో సీఎస్ జోక్యం స్పష్టంగా కన్పిస్తోందంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలింగ్ ముగిసిన 34 రోజుల తర్వాత రీ-పోలింగ్ జరపడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఈవోకు ఫిర్యాదు చేయకుండా సీఎస్ వద్దకు చెవిరెడ్డి ఎందుకెళ్లారని టీడీపీ ప్రశ్నిస్తోంది. తనకు సంబంధం లేని వ్యవహారంలో సీఎస్ జోక్యం ఎందుకు? అని టీడీపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. అయితే ఈ వ్యవహారంపై ఎల్వీ సుబ్రమణ్యం ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి. మరో పక్క, చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదుచోట్ల రీపోలింగ్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఫిర్యాదులను పట్టించుకోకుండా ఎలాంటి విచారణ నిర్వహించకపోవడం దారుణమని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. కాగా.. రీ పోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరమేంటి..? ఎన్నికలు జరిగిన ఇన్ని రోజులకు రీ పోలింగా..? చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కడా ఫిర్యాదులు లేవు.. అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ నేతలు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. అయితే టీడీపీ అధినేత లేఖకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.
  5. Chowkidars start their day by chanting .. #ModiHiAayega on their toilet seats. 🤣🤣🤣
×