Jump to content

sonykongara

Members
  • Posts

    66,400
  • Joined

  • Last visited

  • Days Won

    89

Everything posted by sonykongara

  1. పిడుగుపాటును పసిగట్టే ‘వజ్రపథ్‌’ 05-07-2017 03:51:47 యాప్‌ను రూపొందించిన కుప్పం ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులు నేడు ఆవిష్కరించనున్న చంద్రబాబు ఇస్రో-ఉన్నత విద్యా మండలి మధ్య ఎంవోయూ ఏపీ స్పేస్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ ఏర్పాటు అమరావతి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): పిడుగుపాటును పసిగట్టేందుకు రూపొందించిన వజ్రపథ్‌ యాప్‌ను సీఎం చంద్రబాబు బుధవారం ఆవిష్కరించనున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఇస్రో, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఈ రెండు సంస్థల భాగస్వామ్యంలో ఏపీ స్పేస్‌ ఇన్నోవేషన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. కాగా, ఇస్రో, బెంగళూరులోని ఓ స్టార్టప్‌ కంపెనీ సాయంతో చిత్తూరు జిల్లాలోని కుప్పం ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులు ఈ యాప్‌ను రూపొందించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, ఉన్నత విద్యామండలి, విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్‌ కాలేజీల సంయుక్త సహకారంతో ఈ యాప్‌ సేవలను వినియోగించుకోనున్నారు. ఇందుకు అవసరమైన సాంకేతికతను ఇస్రో, నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ అందించనున్నాయి. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న యూనివర్సిటీలు, పలు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో పిడుగుపాటును గుర్తించి హెచ్చరికలు పంపే పరికరాలను అమరుస్తారు. పిడుగు పడే అవకాశం ఉండే వెంటనే ఆ సమాచారాన్ని వజ్రపథ్‌ యాప్‌ ద్వారా ప్రజలకు తెలియజేస్తారు.
  2. రైతు రథంపై మధ్యేమార్గం! ‘రొటోవేటర్‌’ కొనుగోలు నిబంధన తొలగింపు ఈనాడు, అమరావతి: రైతుల సూచనల నేపథ్యంలో ‘రైతు రథం’ పథకం నిబంధనలు మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ పథకంలో రాయితీపై 6 వేల ట్రాక్టర్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ట్రాక్టర్‌తో పాటు రొటోవేటర్‌, లేక మరేదైనా రూ.లక్ష విలువ చేసే పరికరాన్ని తప్పనిసరిగా కొనాలనే నిబంధన పెట్టారు. ఆ పరికరాలను విడిగా తీసుకుంటే రాయితీ వస్తోందని, ట్రాక్టర్‌తో కలపడంతో తమపై భారం పడుతోందని రైతులు వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ట్రాక్టర్లపై ఇస్తున్న రాయితీలో రూ.50 వేలు తగ్గించి.. రొటోవేటర్‌ నిబంధనను తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకంలో 2 వీల్‌ డ్రైవ్‌ ట్రాక్టర్‌పై రూ.2 లక్షలు, 4 వీల్‌ డ్రైవ్‌ ట్రాక్టర్‌పై రూ.2.50 లక్షల రాయితీ ప్రకటించారు.
  3. ఐటీ సంస్థలకు రెడీమేడ్‌ ఆఫీసులు! 04-07-2017 02:19:37 50 లక్షల చ.అడుగుల్లో భవంతులు నిర్మాణ సంస్థలకు 50ు అద్దె రాయితీ అమరావతి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఐటీ రంగాన్ని విస్తృతపరిచేందుకు ప్రభుత్వం కార్యోన్ముఖమైంది. ఇందుకోసం ‘డిజిగ్నేటెడ్‌ ఐటీ పార్కు(డీటీపీ)’ పాలసీని కేబినెట్‌ సోమవారం ఆమోదించింది. మూడేళ్లలో 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనాలను ఐటీ కంపెనీల కోసం నిర్మించాలని నిర్ణయించింది. ఆయా కంపెనీలు తరలివస్తే 50 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని భావిస్తోంది. కొత్త విధానం ప్రకారం..మొత్తం 50 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో ఐటీ రంగం కోసం భవనాలు నిర్మిస్తారు. నిర్మాణం చేపట్టిన సంస్థకు 50 శాతం దాకా అద్దె రాయితీని ఐటీ శాఖే చెల్లిస్తుంది. లక్ష చ.అడుగుల విస్తీర్ణం మేర భవనాన్ని నిర్మిస్తే.. 18 నెలలు, 2 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తే రెండేళ్లు, 3 లక్షల చ.అడుగుల్లో నిర్మిస్తే 30 నెలలు, 4 లక్షల చ.అడుగుల్లో భవనాన్ని నిర్మిస్తే .. 36 నెలల పాటు 50 శాతం అద్దె రాయితీని ఐటీ శాఖ భరిస్తుంది. 70 శాతం ఆక్యుపేషన్‌ రేటు ఉంటే కార్యాలయ భవన నిర్మాతలకు ప్రభుత్వం ఏమీ ఇవ్వదని, అంతకంటే తక్కువ ఉంటే అద్దెలో 50 శాతం రాయితీ ఉంటుందని మంత్రి లోకేశ్‌ తెలిపారు. ప్రభుత్వ కృషితో కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి సిద్ధపడిన కంపెనీలు.. స్థలాల్లేక ఆగిపోతున్నాయని, ఈ సమస్యను అధిగమించడానికి తాజా విధానం ఉపయోగపడుతుందని చెప్పారు.
  4. https://www.facebook.com/TDP.Official/videos/1732833176730266/
  5. Titan Aviation to set up hub at Donakonda DONAKONDA (Prakasam): The sleepy town of Donakonda in Prakasam district is going to turn into a major industrial hub as three major industrial houses are set to launch operations in the industrial corridor here. With the firms signing MoUs with the state government at the just-concluded CII-Partnership Summit in Visakhapatnam, the face of Donakonda is set to change big time. The three industries are expected to provide direct employment to about 5,000 people and indirect employment to another 20,000. Works on Rs 6,000-crore aviation hub owned by Titan Aviation, a subsidiary of Titan Metals and Minerals Ltd, are expected to kickstart soon as the company is making arrangements for laying the foundation stone for the project in 5000 acres. "At least three firms are getting ready for foundation laying in next few weeks," district minister Sidda Raghava Rao said. Titan Aviation will set foot in collaboration with Ukrainian companies, which have strong presence in aviation and aerospace businesses. Titan Aviation is contemplating to make spares for fixed wing and Boguslaev helicopters and maintenance repair and overhauling. It also has plans to produce engines for various aircraft, helicopters, missiles and space shuttle programmmes in association with Antonov company. A food park will come up in 500 acres at Tripuranthakam, while an automobile industry is planning to set up a unit at an investment of Rs 1,500 crore in 500 acres. "Works on all the three major projects will commence between February and March," said Raghava Rao.
  6. విజయవాడ నుంచి అరగంటలో గుంటూరు..! అమరావతి: విజయవాడ- గుంటూరు నగరాల మధ్య దూరం కేవలం 40 కిలోమీటర్లు. ప్రయాణ సమయం గంటకు పైగా పడుతోంది. కొన్ని సందర్భాల్లో జాతీయ రహదారి మీదుగా వెళ్లినా గంట సమయం మించుతోంది. ఇక ముందు ఈ దూరాన్ని కేవలం 30 నిమిషాల్లో చేరుకునే విధంగా రవాణా వ్యవస్థ రూపొందబోతోంది. అంతే కాదు గుంటూరు-అమరావతి, అమరావతి- విజయవాడ మధ్య వేగవంతమైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కాలం చెల్లిన రవాణా సదుపాయాలు కాకుండా అధునాతన వ్యవస్థ, ఆధునిక సాంకేతిక మేళవించి ఏర్పాటు చేయనున్నారు. రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్‌, రవాణాపై ఏపీ సీఆర్‌డీఏ జపాన్‌ దేశానికి చెందిన ‘జైకా’ సంస్థతో అవగాహన కుదుర్చుకున్న విషయం తెలిసిందే. యూనిఫైడ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సిస్టం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఆర్‌డీఏ, జైకా ప్రతినిధులతో పాటు రవాణా, రహదారులశాఖకు చెందిన అధికారులు సమాలోచనలు జరిపారు. 2015 నాటి జనాభా, రవాణా రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2018 నాటికి నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరం ఒక రూపు దాల్చాలని, పూర్తి స్థాయి పాలన ప్రారంభం కావాలని, మౌలిక వసతులు ఏర్పాటు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తలపెట్టిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా సీఆర్‌డీఏ, ఏడీబీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అమరావతి ప్రాంతంలో ప్రజారవాణా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఏకీకృత రవాణా విధానాన్ని దేశంలోనే తొలిసారిగా అమరావతిలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2050 రద్దీని, జనాభాను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు రూపొందించనున్నారు. ప్రస్తుతం సీఆర్డీఏ పరిధిలో మొత్తం సుమారు 60 లక్షల జనాభా ఉంది. రాజధాని పూర్తి స్థాయిలో ఏర్పాటు జరిగితే ఇది రెండింతలు అవుతుందని అంచనా. అమరావతి నగరం పరిధిలో ప్రస్తుతం లక్ష జనాభా మాత్రమే ఉన్నారు. భవిష్యత్తులో రానున్న పదేళ్లలో దాదాపు 20లక్షల నుంచి 30లక్షలకు చేరుకొనే అవకాశం ఉందని అంచనా. విద్యాసంస్థలు, వైద్య సంస్థలు వివిధ వాణిజ్య సంస్థలు, వ్యాపార కార్యకలాపాలు పెరగనున్నాయి. ప్రస్తుతం విజయవాడ, గుంటూరు నగరాలు, వాటి శివారు ప్రాంతాల్లో జనసాంద్రత పెరిగింది. రానున్న రోజుల్లో ఈప్రాంతాల్లోనూ జనాభా పెరగనుందని అంచనా దీనికి అనుగుణంగా ప్రజారవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు. * ప్రస్తుతం మొదటి దశలో రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించారు. రోడ్లను విస్తరించే విధంగా ప్రణాళికలు రూపొందించి ఆకృతులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, ఇతర ఏడు ప్రధాన రహదారులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం చేయనున్నారు. వీటికి దాదాపు రూ.1215 కోట్లు ఖర్చు చేస్తున్నారు. * విజయవాడ, తెనాలి, గుంటూరు, అమరావతి నగరాన్ని కలుపుతూ వలయ రహదారి నిర్మాణం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను వస్తున్న ప్రధాన, జాతీయ రహదారులను కలుపుతూ బాహ్యవలయ రహదారిగా ఇది ఉంటుంది. ఈ వలయ రహదారిపై ప్రజారవాణా వ్యవస్థలో భాగంగా బస్సులను నడుపుతారు. * విజయవాడ నుంచి బయలుదేరి తిరిగి విజయవాడ చేరుకొనే విధంగా తెనాలి, గుంటూరు, అమరావతిలను కలుపుతూ రైల్వే ట్రాక్‌ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిపై అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ అధ్యయనం చేస్తోంది. సీఆర్డీఏతో కలిసి ఈ ట్రాక్‌ను ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక. * ప్రజా రవాణా వ్యవస్థకు అవసరమైన పెట్టుబడిని జైకా అందించాలనేది ప్రణాళిక. ఆధునిక బస్సులను, మెట్రో రైలును వలయ రైళ్లను కొనుగోలు చేస్తారు. * అమరావతి ప్రాంతంలో దాదాపు 9వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అధ్యయనం చేయనున్నారు. గుంటూరు, విజయవాడ నగరాలతో పాటు పురపాలక పట్టణాలు ఉన్నాయి. * వచ్చే ఏడాది ప్రారంభంలో జైకా దీనిపై అధ్యయన నివేదిక అందించనున్నట్లు తెలిసింది. * బస్సులు, రైళ్లలో ప్రయాణించినా ఒకే కార్డు చెల్లుబాటు అయ్యేవిధంగా ఏకీకృత రవాణా విధానం రూపొందించనున్నారు. దీనికి గాను ఆర్టీసీ, రైల్వేతోనూ అంగీకారం కుదరాల్సి ఉంటుందని చెబుతున్నారు. * రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏపీ రాజధాని ప్రాంత ఏకీకృత రవాణా అథారిటీ ఏర్పాటు చేయనున్నారు. అధ్యయనం ప్రగతిని సమీక్షించేందుకు సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో సంయుక్త సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలనేది నిర్ణయం.
  7. దొనకొండలో హెలికాప్టర్ల పరిశ్రమ ఆగస్టులో శంకుస్థాపనకు ఏర్పాట్లు భూములు పరిశీలించిన ‘టైటాన్‌’ ప్రతినిధులు 15 వేల మందికి ఉపాధి కల్పిస్తామని వెల్లడి దొనకొండ, జూలై 3: ప్రకాశం జిల్లా దొనకొండలో హెలికాప్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఉక్రెయిన్‌ దేశానికి చెందిన టైటాన్‌ ఏవియేషన్‌ ఏరోస్పేస్‌ సంస్థ చీఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గిరికుమార్‌, డైరెక్టర్‌ ఎం. శ్రీధర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌, సంస్థ చీఫ్‌ ఇంజనీర్‌ అనిల్‌హసన్‌ల బృందం సోమవారం భూములను పరిశీలించారు. దొనకొండ మండలంలోని కొచ్చర్లకోట, మల్లంపేట, మంగినపూడి గ్రామాల్లో టైటాన్‌కు కేటాయించిన 5,316 ఎకరాల పట్టా, ప్రభుత్వ, అసైన్‌మెంట్‌ భూములకు సంబంధించిన హద్దులు గుర్తించి మార్కింగ్‌ చేసుకున్నారు. ఆ భూములకు సంబంధించి మౌలిక సౌకర్యాలను మ్యాపుల ద్వారా పరిశీలించి స్వల్ప మార్పులపై తహశీల్దార్‌ కె. వేంకటేశ్వర్లు, సర్వేయర్‌ వెంకటరావులకు సూచించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, కొద్ది రోజుల్లో తమ సంస్థ ఇంజనీర్ల బృందం, నైపుణ్య సిబ్బంది వచ్చి భూములను స్వాధీనం చేసుకొని చుట్టూ కంచె ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. టైటాన్‌ ఏవియేషన్‌ ఆధ్వర్యంలో రూ.26 వేల కోట్ల పెట్టుబడితో 7 కిలోమీటర్ల పొడవు, 3.25 కిలోమీటర్ల వెడల్పులో రన్‌వేతో పాటు అత్యాధునిక హంగులు, సాంకేతిక పరిజ్ఞానంతో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పూర్తి సహకారం మరువలేనిదని కొనియాడారు. ఆగస్టు నెలలో శంకుస్థాపన చేయనున్నట్టు వివరించారు. మొదటి దశలో హెలికాప్టర్ల తయారీ, పైలెట్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటవుతాయని చెప్పారు. దాదాపు 15 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.
×
×
  • Create New...