Jump to content

sonykongara

Members
  • Posts

    66,400
  • Joined

  • Last visited

  • Days Won

    89

Everything posted by sonykongara

  1. విశాఖకే ఐఎన్‌ఎస్‌ విరాట్‌: చంద్రబాబు విజయవాడ: ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను రాష్ట్రానికి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు.విశాఖలో జరిగిన అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష(ఐఎఫ్‌ఆర్‌)పై ఆయన విజయవాడలో విలేకర్లతో మాట్లాడారు. ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను విశాఖలో పదిహేను వందల గదుల హోటల్‌లా మార్చాలని భావిస్తున్నామన్నారు. దీనికి హెలీప్యాడ్‌ కూడా ఉందన్నారు. ఐఎఫ్‌ఆర్‌కు 50దేశాల ప్రతినిధులు వచ్చారని చెప్పారు. ‘ఐఎఫ్‌ఆర్‌’కు అద్భుత స్పందన వచ్చిందన్నారు. 50 దేశాలకు సంబంధించిన అంతర్జాతీయ యుద్ధనౌకలను రాష్ట్రపతి సమీక్షించారని చెప్పారు. అన్ని దేశాల యుద్ధనౌకలు రాష్ట్రపతి, ప్రధానికి గౌరవ వందనం సమర్పించాయన్నారు. ఇంతటి అద్భుత కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భారత నౌకాదళాన్ని ఆయన అభినందించారు. నావికదళ కేంద్రంగా విశాఖను రక్షణమంత్రి ప్రకటించడం సంతోషకరమైన విషయం అని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలను చూస్తుంటే అసలు భారత్‌లోనే ఉన్నామా అనిపించిందన్నారు. అరకు కాఫీ అదుర్స్‌ ఐఎఫ్‌ఆర్‌ వీక్షించేందుకు వచ్చిన ప్రధాని మోదీ అరకు కాఫీ రుచి చూసి చాలా బాగుందని కితాబిచ్చారని చంద్రబాబు తెలిపారు. ఐఎఫ్‌ఆర్‌ వేడుకకు లక్షల మంది స్వచ్ఛందంగా వచ్చారన్నారు. దీనికి 15వేల మంది పోలీసులు భద్రత కల్పించారన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.130 కోట్లను ఖర్చు చేసిందన్నారు. విశాఖలో నిర్వహించిన ఇన్వెస్టర్స్‌ మీట్‌లో 44 దేశాల ప్రతినిధులు పాల్గొన్నట్లు చెప్పారు. దీనిలో మొత్తం రూ.4.75లక్షల ఎంవోయూలు కుదుర్చుకున్నామన్నారు. సముద్ర తీర నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి తీర ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని చంద్రబాబు అన్నారు. మనకు డీప్‌ వాటర్‌ పోర్టులు ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుంటే ఏపీ అత్యుత్తమ ప్రాంతంగా మారుతుంది. పలు రేవు పట్టణాలు ఉన్న ప్రాంతం ఇదేనని అని అన్నారు. డాల్ఫిన్‌లు, ఆక్వాకల్చర్‌, అత్యధిక తీరపట్టణాలు కేవలం ఇక్కడ మాత్రమే ఉన్నాయి. టూరిజంపై దృష్టి.. సముద్ర క్రీడలను ప్రోత్సహించి టూరిజంను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. దీని కోసం మరింత కృషి చేస్తామని చెప్పారు.
  2. పుట్లగూడెం - పులిచింతల మధ్య అటవీ ప్రాంతం ఎంపిక రాజధానికి 50 కిలోమీటర్ల పరిధిలో 2700 ఎకరాలు గుర్తింపు అప్పాకు దీటుగా అన్ని శిక్షణా కేంద్రాలు ఒకేచోట.. పోలీస్‌ శిక్షణ విభాగాలకు గుంటూరు జిల్లా కేంద్రం కానుంది. హైదరాబాద్‌లోని ఏపీ పోలీసు అకాడమీని తలదన్నేలా అచ్చంపేట మండలంలో నూతన అకాడమీ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు పుట్లగూడెం నుంచి పులిచింతల మధ్య 2700 ఎకరాల్లో ఉన్న అటవీ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. అన్ని విభాగాల శిక్షణ కేంద్రాలను ఇక్కడే నిర్మించనున్నారు. గుంటూరు : రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ పోలీసు అకాడమీతో పాటు మిగిలిన అన్ని విభాగాల శిక్షణా కేంద్రాలను ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ఏడాదిన్నరగా పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో డీజీపీ రాముడు, ఇతర ఉన్నతాధికారులు అచ్చంపేట అటవీప్రాంతాన్ని పరిశీలించి వెళ్లారు. అచ్చంపేట పరిధిలోని అటవీ ప్రాంతమే అనువుగా ఉంటుందని నిర్ధారించారు. ఆక్టోప్‌స, గ్రేహౌండ్స్‌కు శిక్షణ ఇవ్వాలంటే అటవీప్రాంతంలో కొండలు, గుట్టలు ఉండాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో అచ్చంపేట అటవీప్రాంతం గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ శిక్షణకు సరిగ్గా సరిపోతుందని పోలీసు అధికారులు అంటున్నారు. మరోవైపు ఆహ్లాదకర వాతావరణం, పక్కనే కృష్ణానది ఉండడంతో నీటి సదుపాయం పుష్కలంగా ఉంటుందని అధికారులు అంటున్నారు. డీనోటిఫైకు కేంద్రానికి ప్రతిపాదనలు.. ఈ నేపథ్యంలో అచ్చంపేటకు సమీపంలోని పుట్లగూడెం నుంచి పులిచింతల మధ్య 2700 ఎకరాల్లో ఉన్న అటవీ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. అటవీప్రాంతం కావడంతో ఆ భూమిని డీనోటిఫై చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్రం నుంచి కూడా సాధ్యమైనంత త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల కావచ్చని పోలీసు అధికారులు భావిస్తున్నారు. కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చిన వెంటనే ఏపీ పోలీసు అకాడమీ, ఏపీఎస్పీ బెటాలియన్లు, పోలీసు ట్రాన్స్‌పోర్టు అకాడమీ, గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ తదితర విభాగాల శిక్షణ కేంద్రాలకు అవసరమైన భవనాలు, క్వార్టర్స్‌, పరిపాలనా కేంద్రాలను నిర్మించాలని భావిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.7500 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఆ మొత్తం కూడా కేటాయించినట్లుగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం గుర్తించిన అటవీప్రాంతం ఏపీ రాజధానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక వైపు పులిచింతల ప్రాజెక్టు ఉంది. ఈ నేపథ్యంలో రాజధాని నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు ఈ మార్గం దగ్గరగా ఉండనుంది. ఈ నేపథ్యంలో అచ్చంపేట అటవీప్రాంతంలో పోలీసు అకాడమీకి అనుమతి లభించినట్లయితే పులిచింతల వద్ద ఏపీ, తెలంగాణ రాషా్ట్రలను కలిపేలా మరో బ్రిడ్జి నిర్మించే అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నారు.
  3. అచ్చంపేటలో.. అన్నీ ఒకే చోట! అకాడమీ, శిక్షణ కేంద్రాలు, ఫైరింగ్‌ రేంజీ అక్కడే పోలీసు నిలయం ఏడీజీపీ సురేంద్రబాబు ఈనాడు, అమరావతి: శాఖాపరంగా మరింత మెరుగ్గా సేవలు అందించేందుకు ఏపీ పోలీసు అకాడమీ, పోలీసు రవాణా శిక్షణ సంస్థ, గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ శిక్షణ కేంద్రాలు, ఫైరింగ్‌ రేంజీని ఒకే చోట నెలకొల్పనున్నామని ‘ఆక్టోపస్‌’ విభాగం చీఫ్‌, అదనపు డీజీపీ ఎన్‌వీ సురేంద్రబాబు అన్నారు. విజయవాడ పోలీసు కమిషనర్‌ గౌతం సవాంగ్‌ 12 రోజుల పాటు సెలవు వెళ్లిన నేపథ్యంలో ఇన్‌ఛార్జి సీపీగా సురేంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గురువారం ఆయన విలేకరుల మాట్లాడారు. ప్రధాన విభాగాలన్నీ ఒకేచోట ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. గుంటూరు జిల్లాలోని అచ్చంపేట వద్దే ఇవన్నీ ఏర్పాటవుతాయని వివరించారు. కార్యాలయాలు, సిబ్బంది నివాస సముదాయాలను ఇందులోనే నెలకొల్పుతారు. దీనికోసం 2700 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. దీనికి అవసరమైన అటవీభూమిని డీనోటిఫై చేయాలని కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి చేసిందన్నారు. భూమిని కేటాయించగానే కేంద్ర, రాష్ట్ర నిధులతో పకడ్బందీ ప్రణాళికతో వీటిని నిర్మించనున్నట్లు తెలిపారు. ఒకేచోట వివిధ సంస్థల ఏర్పాటు వల్ల సమర్థంగా వనరుల పంపకం, సద్వినియోగం సాధ్యపడుతుందన్నారు. గ్రేహౌండ్స్‌- ఆక్టోపస్‌ల ప్రధాన కార్యాలయం రాజధాని పరిసరాల్లోనే వస్తుందన్నారు. ఏపీలో శిక్షణ కేంద్రాలు నిర్మించేదాకా హైదరాబాద్‌లో ఉన్న శిక్షణ వసతులనే వినియోగించుకుంటామని చెప్పారు.
  4. Sky Choppers Logistics Private Limited, a Chennai based company is going to start the seaplane services between Visakhapatnam-Amaravati and Kakinada-Amaravati with an investment around Rs.25crores. The seaplane would land on the Prakasam Barrage in Vijayawada, in Vizag near Bheemli and a creek near Harita Beach resorts in Kakinada. The first phase of the project would start in three months with one seaplane and another seaplane is in planning in six months. The price of ride will be around Rs. 3,000-Rs.3,500. This will be huge advantage to the businessman who can wrap the work in one day and come home. Apart from the above, the firm also looking to introduce helicopter rides from Vuda Park on the Vizag beach to Kailasgiri and further be extend it to Vuda Park and Araku in the next phase.
  5. nenu post vesa brother eenadu news 6months back, ippudu a news kanapadatala.
  6. yes brother."Amaravati Land policy ok ayithe inka dusukupovatame.
  7. Foxconn vadu amaravati 1500acer adigadu anta. 300000 cr pettupadibedtha ani.
  8. చైనాకు చెందిన గుజౌహూ అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ (జీఐఐసీ) అమరావతి నిర్మాణంలో పాలుపంచుకునేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సంస్థ విజయవాడలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. భాగస్వామ్య సదస్సులో జీఐఐసీ ఏపీ సర్కారుతో ఒప్పందం చేసుకోనుంది. ఏపీతో కలిసి పనిచేసేందుకు జీఐఐసీ ఆసక్తి చూపుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కనీసం 2-3 బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనతో ఉంది. ఒప్పందం కుదుర్చుకున్నా... టెండరు ప్రక్రియ, నిబంధనల మేరకు అర్హత సాధిస్తేనే ప్రాజెక్టులు దక్కుతాయని పేర్కొన్నాయి. చైనాలో పర్యటించిన ప్రభుత్వ అధికారుల బృందం ఈ సంస్థ చేసిన అభివృద్ధి పనులు పరిశీలించారు.
  9. hyderabad to bangalore expressway valla rayala seema ki baga use avuthundi.
  10. హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.40,800 కోట్ల ప్యాకేజీని ఇస్తున్నట్లు కేంద్ర రవాణా, జాతీయ రహదారులు, పోర్టుల మంత్రి నితిన్‌గడ్కరీ వెల్లడించారు. ఆ మొత్తంతో రాష్ట్రంలో 2,556 కిలోమీటర్ల మేరకు రహదారులను విస్తరించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన గడ్కరీ సోమవారం బేగంపేట విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌-బెంగళూరు మధ్య ఎక్స్‌ప్రెస్‌ వేను నిర్మిస్తామని, 550 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గానికి రూ.8,400 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ రహదారి తెలంగాణ రాష్ట్రం నుంచి 210 కిలోమీటర్లు వెళ్తుందన్నారు. హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి వరకు మొత్తం 270 కిలోమీటర్ల పొడవైన ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మిస్తామని, ఈ మార్గం తెలంగాణలో 190 కిలోమీటర్లు వెళుతుందని వివరించారు. ఇందుకుగాను రూ.1,600 కోట్లు వ్యయం అవుతుందని వెల్లడించారు. ఈ రెండు ‘ఎక్స్‌ప్రెస్‌ వే’లతో పాటు తెలంగాణలో 1,670 కిలోమీటర్లు పొడవైన జాతీయ మార్గా(నేషనల్‌ హైవే)లను అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. దీనికి గాను రూ.16,500 కోట్లు వ్యయం అవుతుందని చెప్పారు. రూ.5000 కోట్లతో 480 కిలోమీటర్ల మేరకు జాతీయ రదారుల విస్తరణకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయని, వచ్చే బడ్జెటులో రూ.900 కోట్ల విలువ చేసే పనులను మంజూరు చేయనున్నామని కేంద్ర మంత్రి వివరించారు.
  11. అవనిగడ్డ, నవంబరు 14 : కృష్ణాజిల్లా నాగాయలంక మండలం గుల్లలమోదలో నిర్మించనున్న క్షిపణి ప్రయోగ కేంద్రానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చిందని ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ తెలిపారు.ఈ ప్రయోగ కేంద్రం వల్ల యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.
  12. SECON Private Limited, Bengaluru, has said it will prepare Environment Impact Assessment (EIA) report for the Missile Test Launch Facility project proposed by the Defence Research and Development Organisation (DRDO) at Nagayalanka in Krishna district. The SECON, in its official website, has claimed that the DRDO is one of its major clients in India following the National Highways Authority of India and the oil industry. A few key studies such as oceanographic and seismic studies apart from onshore and offshore investigations will be taken up to prepare the EIA report for the project. In January, the National Board for Wildlife’s Standing Committee chaired by Union Minister for Environment, Forest and Climate Change Prakash Javadekar has approved the missile test launch facility project to be set up at Nagayalanka. A total of 154.42 hectares has been proposed for the project, covering test facility in above six hectares and technical facility in 130 hectares. The test site is falling in the limits of the Krishna Wildlife Sanctuary. “The feasibility of using barges along the Krishna creek for transportation of equipment and articles is being explored,” said Chief Construction Engineer (R&D), South, DRDO, B. Suresh Kumar during the site inspection by the AP Forest authorities. DRDO Scientific Chief Engineer K. Radha Krishna has informedo the AP Forest authorities that the mangroves would be retained with cross drainage system. Nagayalanka is the most appropriate for Missile Test Launch Facility in view of technical, safety and security considerations. K. Radha Krishna DRDO Scientific Chief Eingineer
  13. (ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి రాజధాని నిర్మాణ చరిత్ర ఢిల్లీ, కోల్‌కతా, చెన్నైలోని పేరుగాంచిన జాతీయ మ్యూజియంలో పదిలంగా ఉంది. నాడు బుద్ధుడు నడయాడిన చరిత్ర విశేషాలు, రాజులు బౌద్ధానికి ఇచ్చిన ప్రాధాన్యం, నాటి కళాకారుల ప్రతిభకు నిదర్శనాలైన పురాతన శిల్పాలు సందర్శకులతో ఔరా అని పించుకుంటున్నాయి. భారతదేశంలో 1, 2 దశాబ్దాలలోనే ఇంతటి గొప్ప కళారూపాల సృష్టి, బుద్ధుడి బోధనలు, గొప్ప పరిపాలనా పద్ధతులు అవలంభించారా? అంటూ విదేశీయులు ఆశ్చర్యపోతున్రాఉ. నాటి అమరావతి ప్రాంతంలోని విశేషాలను వివరించే అద్భుత కళారూపాలు, శిలాశాసనాల ఏవేవి ఎక్కడ ఉన్నాయనే అంశాలపై ఆంధ్రజ్యోతి పరిశీలన.. నేషనల్‌ మ్యూజియం, న్యూఢిల్లీ అమరావతి పాంత్రాన్ని 1, 2, శతాబ్దాలలో శుద్ధోధనుడు సందర్శించాడని తెలిపే శిలాశాసనం. ఇది సత్వధానుడి పరిపాలనా కాలంలో జరిగినట్లు శిలాశాసనంలో పేర్కొన్నారు. 1, 2, కాలంలో సత్వధానుడి పరిపాలనలో బుద్ధుడు అమరావతి ప్రాంతంలో ప్రసంగిస్తున్నట్లు తెలిపే శాసనాలు. అమరావతిలో బుద్ధుడి పర్యటన విశేషాలను వివరించే శిలా విగ్రహాలు రెండో శతాబ్దంలో తయారు చేసిన పురుషుల కళారూపాలు ఇండియన మ్యూజియం, కోల్‌కతా రెండో శతాబ్దంలో రూపొందిన ధర్మచక్రం, అశ్వదళాలతో రూపొందించిన శిలాశాసనాలు. సింహాసనంపై ఏర్పాటు చేసిన బోధి మొక్కను భక్తులు కొలుస్తున్న శిలా విగ్రహాలు. రెండో శతాబ్దంలో రూపొందించినబుద్ధుడి నిలుచున్న కళారూపం. గవర్నమెంట్‌ మ్యూజియం, చెన్నైలో మరికొన్ని శిల్పాలు, శాస నాలు ఉన్నాయి. లండనలోని బ్రిట న మ్యూజియంలో బౌద్ధం విశేషాల ను తెలిపే ఆధారాలతో కూడిన శి లావిగ్రహాలు, శాసనాలు ఉన్నాయి. ఇవన్నీ తెలుగు రాష్ర్టాలకు బయట ప్రాంతాల్లో ఉన్న చరిత్ర విశేషాలు.
  14. http://www.andhrajyothy.com/Artical?SID=167765
×
×
  • Create New...