Jump to content

sonykongara

Members
 • Content Count

  57,734
 • Donations

  $0.00 
 • Joined

 • Last visited

 • Days Won

  79

sonykongara last won the day on July 16

sonykongara had the most liked content!

About sonykongara

 • Rank
  KING
 • Birthday 09/01/1987

Profile Information

 • Gender
  Male
 • Location
  PALNADU, CHENNAI

Recent Profile Visitors

14,219 profile views
 1. sonykongara

  Congress Chief ministers swearing

  కాంగ్రెస్‌ సీఎంల ప్రమాణస్వీకారానికి వెళ్లనున్న చంద్రబాబు 15-12-2018 22:31:16 అమరావతి: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలన్న రాహుల్ గాంధీ ఆహ్వానంపై ఏపీ సీఎం చంద్రబాబు... మంత్రుల అభిప్రాయం కోరారు. మంత్రులు కళా వెంకట్రావు, యనమల, లోకేష్, అచ్చెన్న, ఆనందబాబు, కాల్వ‌తో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన.. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారానికి వెళ్లాలా వద్దని అడిగారు. బీజేపీయేతర పక్షాల సమావేశానికి వచ్చిన నేతలను రాహుల్ గాంధీ ఆహ్వానించినట్లు మంత్రులకు చంద్రబాబు తెలిపారు. అయితే వెళ్లాలని కొందరు మంత్రులు...తుది నిర్ణయం తమదేనని మరికొందరు మంత్రులు చంద్రబాబు చెప్పారు. చివరికి వెళ్లాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీంతో డిసెంబర్ 17న జరగనున్న 3 రాష్ట్రాల సీఎంల ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు వెళ్లనున్నారు. టెలీకాన్ఫరెన్స్ అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ‘‘దేశం మొత్తం మోదీ పాలనకు వ్యతిరేకంగా ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాలి. దేశాన్ని కాపాడాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. లౌకిక వాద శక్తులన్నీ ఏకం కావాలి. బీజేపీకి వ్యతిరేకంగా అందరూ సంఘటితం కావాలి. అందుకు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం వేదిక కావాలి. కర్ణాటక ప్రమాణ స్వీకారానికి హాజరు అయినట్లే వీటికి కూడా అందరూ హాజరు కావాలి. నిరంకుశ పాలన అంతం కావాలి. పెత్తందారీ పాలన పోవాలి. అహంభావ పోకడలు అంతరించాలి’’ అని అన్నారు.
 2. sonykongara

  Irrigation works @ AndhraPradesh

  అచ్చెన్నాయుడు చొరవతో.. 3,300 ఎకరాలు సస్యశ్యామలం! 15-12-2018 09:35:09 ప్రారంభానికి సిద్ధమైన మదనగోపాలసాగరం ఎత్తిపోతల పథకం టెక్కలి/శ్రీకాకుళం: మదనగోపాలసాగరం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సిద్ధమైంది. దీనివల్ల రెండు మం డలాల్లో 22 గ్రామాల్లోని 3,300 ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. దీంతో ఆయా ప్రాంతరైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా చినుకు పడితే తప్ప ఇక్కడి రైతులు పంట ముఖం చూసేవారు కాదు. ఏటా కరువు పరిస్థితులనే ఎదుర్కొనేవారు. సీజన్‌లో వర్షం పడితే వరినాటు.. లేదంటే పశువుల మేతగా మారేది. ఈ నేపథ్యంలో అప్పటి కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు ఈ ప్రాంతానికి గుర్తించి ఎలాగైనా సాగునీరు అందించాలని ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తర్వాత 2014లో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ ప్రాంత రైతులకు కరువు, కాటకాల నుంచి దూరం చేయాల ని భావించారు. మదనగోపాలసాగరం ఎత్తిపోతల పథకానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. రూ.34కోట్ల35లక్షల అంచనా వ్యయంతో టెక్కలి, నందిగాం మండలాల పరిధిలో 22 గ్రామాల్లో 3,300 ఎకరాలకు సాగునీరు అందించాలని భావించారు. వంశధార ప్రధాన ఎడమకాలువ నుంచి సీతాపురం దరి సంప్‌వెల్‌ వరకు 42మీటర్ల ఎత్తు మేర గ్రావిటీ సిస్టంతో పైపులైన్‌ ద్వారా సాగునీరు సరఫరా చేసేందుకు రూపకల్పన చేశారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామ హేశ్వరరావును ఒప్పించి నిధులు మంజూరు చేయించారు. ఈ మేరకు గత ఏడాది ఏప్రిల్‌ 19న మదనగోపాలసాగరం ఎత్తిపోతల పథ కం పనులకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల అభివృద్ధి సంస్థ అధికారులు రాత్రనక, పగలనక దీనిపై దృష్టి సారించారు. 20 నెలల వ్యవధిలోనే ఈ పథకాన్ని పూర్తిచే యగలిగారు. ఇదిలా ఉండగా గురువారం కాంట్రాక్టర్‌ ట్రైల్‌రన్‌ వేయగా.. ఇది విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల అభి వృద్ధి సంస్థ ఇంజనీరింగ్‌ అధికారుల గ్రీన్‌సిగ్న ల్‌తో ఈనెల 19న ప్రారంభోత్సవానికి ప్రతినిదులు, అధికారులు రంగం సిద్ధం చేశారు. సాగునీరు అందనున్న గ్రామాలివీ.. గూడెం, సవరసీతాపురం, పిట్టలసరియా, గొల్లూరు, నీలాపురం, సవరకిల్లి, డమర, నర్సి ంగపల్లి, కిట్టాలపాడు, రాంపురం, సొంటినూ రు, చిన్నారిగోకర్లపల్లి, సోమనాథపురం, బెల్లు కోల, నీలాపురం, రధజనబొడ్డపాడు, బైరూరు, కొల్లివలస, జగన్నాథపురం, చిరుతునాపల్లి, పాత్రపురం, నరహరిపురం తదితర గ్రామాల ప్రజలకు సాగునీరు అందనుంది. ఇక కొండల ప్రాంతంలో ఇన్నాళ్లు సాగునీటికి దూరమైన గ్రామాలకు ఈ పథకం వరంగా మారనుంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రస్తుతం జిల్లాలో అమలవుతున్న ఎత్తిపోతల పథకాల్లో ఈ పథకానిదే మొదటి స్థానంగా చెప్పొచ్చు. రెండు పంటలు పండించుకోవచ్చు కరువుతో అల్లాడుతున్న ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించాలన్నదే లక్ష్యంగా భావించాం. ఈ మేరకు మదనగోపాలసాగరం ఎత్తిపోతల పథకానికి రూ.34కోట్ల35లక్షలు చేయించగలిగాను. ఈ పథకం ద్వారా టెక్కలి, నందిగాం మండలాలకు సంబంధించి సుమారు 22 గ్రామాల రైతాంగానికి పుష్కలంగా సాగునీరు లభించనుంది. డెల్టా భూముల తరహాలో ఇక్కడ రైతులు రెండు పంటలు పండించుకోవచ్చు. దివంగత నేత ఎర్రన్నాయుడు కలలు గన్న ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తికావడం ఆనందంగా ఉంది. ఇది ఈ ప్రాంత ప్రజానీకం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తానని రైతాంగానికి ఇచ్చిన మాట నెరవేర్చుకున్నందుకు సంతోషంగా ఉంది. - కింజరాపు అచ్చెన్నాయుడు, మంత్రి 20 నెలల కాలంలో పూర్తిచేశాం మదనగోపాలసాగరం ఎత్తిపోతల పథకాన్ని 20 నెలల్లో పూర్తి చేయగలి గాం. సంపువెల్‌, పంప్‌హౌస్‌, మూడు కిలోమీర్లు మేర 1000ఎంఎం డయా మీటర్‌ గల ప్రజర్‌ పైపులైన్లు, డిస్టిబ్యూషన్‌ పీవీసీ పైపులైన్లు, 400ఎంఎం డయాస్‌ నుంచి 200 డయాస్‌ వరకు 16కిలోమీటర్లు మేర పైపులైన్లు వేయగలిగాం. ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించి 350 హెచ్‌పీ మోటార్లను నాలుగింటిని వినియోగించాం. సాంకేతిక పరికరాలు పూణే, సేలాం, గాజియాబాద్‌, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి తెప్పించాం. 1000కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు రెండింటిని వినియోగించి సాంకేతిక పరికరాల సహకారంతో పథకాన్ని విజయవంతంగా నిర్వహించగలిగాం. సుమారు 3,300 ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. - బి.లక్ష్మీపతిరావు, ఈఈ, ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల అభివృద్ధి సంస్థ
 3. sonykongara

  CBN promoted list of AP industries

  రోజులన్నీ సీమవే! 15-12-2018 02:09:57 ఆటోమొబైల్‌ నుంచి ఐటీ దాకా.. ఏ పరిశ్రమైనా రాయలసీమలోనే యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యం శ్రీశైలం నుంచి సమృద్ధిగా తాగు-సాగునీరు ఉత్పత్తి దశలో 1695 పరిశ్రమలు ప్రాథమిక దశలో మరో 937 ప్లాంట్లు పరిశ్రమలు రాకుండా కేంద్రం అడ్డుపుల్ల అయినా ముందుకు సాగుతున్నాం రాష్ట్రానికేం జరిగిందని విపక్షాలు అంటున్నాయి వాటికి పారిశ్రామికీకరణే సమాధానం: సీఎం రామ్‌కో ఫ్యాక్టరీకి వీసీ ద్వారా భూమిపూజ బనగానపల్లె/అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యో తి): రాబోయే రోజులన్నీ రాయలసీమవేనని సీఎం చం ద్రబాబు స్పష్టం చేశారు. గోదావరి-కృష్ణా అనుసంధానం తో సీమ ప్రాంతానికి సమృద్ధిగా సాగు, తాగు నీటిని సరఫరా చేస్తున్నామని.. తెలిపారు. యువతకు అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆటోమొబైల్‌ నుం చి ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ దాకా సీమలోనే స్థాపించేలా చూస్తున్నామన్నారు. ఫలితంగా.. ఇటు చెన్నై, అటు బెంగళూరుకు సమీపంలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు వస్తున్నారన్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పరిశీలన చేసుకుంటున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామ సమీపంలో రూ.1500 కోట్లతో నిర్మిస్తున్న రామ్‌కో గ్రీన్‌ఫీల్డ్‌ సిమెంటు ఫ్యాక్టరీకి శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భూమి పూజ చేశారు. సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రానికి రూ.15,73,172 కోట్ల పెట్టుబడులు తెచ్చే 2,632 పరిశ్రమలను ఆకర్షించగలిగామన్నారు. వీటి స్థాపన సాకారమైతే 33,03,671 మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. ఇందులో రూ.6,30,457 కోట్ల పెట్టుబడులతో 1695 పరిశ్రమలు.. అనుమతుల నుంచి ఉత్పత్తి దశలో ఉన్నాయని.. వాటిలో 795 యూనిట్లు ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించాయని తెలిపారు. ఇంకో 638 పరిశ్రమలు డీపీఆర్‌ దశలో ఉన్నాయని తెలిపారు. భూ కేటాయింపుల దశకు చేరిన పరిశ్రమల ద్వారా 10,23,782 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పారు. ప్రారంభించిన పరిశ్రమల్లో రెండున్నర లక్షల మందికి పైగా ఉద్యోగాలు దక్కాయన్నారు. రాష్ట్రానికి జరిగిందేమిటన్న విపక్షాలకు పరిశ్రమల ఏర్పాటే సమాధానమని చెప్పారు. కేంద్రం సహకరించకున్నా.. ‘పరిశ్రమల స్థాపనకు కేంద్రం సహకరించకున్నా ముందుకు సాగుతున్నాం. కర్నూలును పారిశ్రామిక హ బ్‌గా తీర్చిదిద్దుతాం. కొలిమిగుండ్లను సిమెంటు హబ్‌గా మారుస్తాం. సంజామల నుంచి కొలిమిగుండ్లకు ప్రత్యేక రైల్వే లైన్‌ వేసి పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తాం. కొలిమిగుండ్లలో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనాలనుకున్నాను. కొన్ని కారణాల వల్ల పర్యటన ర ద్దయింది. అయినా అభివృద్ధి ఆగకూడదన్న ఉద్దేశంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేశాను. రామ్‌కో సిమెం టు దేశంలోనే ఐదో పెద్ద కంపెనీ. విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో రూ.2500 కోట్లతో ఫ్యాక్టరీలు పెట్టింది. 3 వేల మంది వాటిలో పనిచేస్తున్నారు. 14.45 లక్షల మెట్రిక్‌ టన్నుల సిమెంటును రామ్‌కో ఉత్పత్తి చేస్తోంది. కొలిమిగుండ్ల ఫ్యాక్టరీ ద్వారా 300 మంది ప్రత్యక్షంగా, 3 వేల మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఈ గ్రీన్‌ఫీల్డ్‌ పరిశ్రమను 14 నెలల్లోనే పూర్తి చేయాలని రామ్‌కోని ఆదేశించాం. రైతుల నుంచి గతంలో ఎకరా రూ.76 వేలకు రామ్‌కో కొనుగోలు చేసింది. వారికి మరో రూ.76 వేలు చెల్లించేలా ఒప్పించాం’ పరిశ్రమలు సహా ఏ ప్రాజెక్టునూ పునాదిరాళ్లతో వది లిపెట్టడం లేదు. ప్రారంభోత్సవ తేదీలనూ ఖరారు చేస్తున్నాం. కాలికి బలపం కట్టుకుని దేశవిదేశాలు తిరిగాం. దాని ఫలితాన్ని ఇప్పుడు చూస్తున్నాం’ బనగానపల్లె ఎమ్మెల్యేకు అభినందనలు.. ‘కర్నూలు జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా ఎందుకు రాలేదో ఆలోచిస్తే నాయకుల స్వార్థం ఏంటో అర్థమవుతుంది. స్థానిక బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి వచ్చి రైతులకు న్యాయం చేయాలని కోరారు. పరిహార ప్రక్రియను కొలిక్కి తెచ్చేవరకూ ఉత్సాహాన్ని కనబరిచారు. ఎమ్మెల్యేలు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి’ చెడగొట్టడం సులువు.. ఒక పరిశ్రమను సాధించడం చాలా కష్టం. చెడగొట్టడం మాత్రం సులభం. కొంతమంది అభివృద్ధి నిరోధకులు పరిశ్రమలు రాకుండా, అభివృద్ధి జరగకుండా అడ్డుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే... స్థానిక యువతకు నష్టం వాటిల్లుతుంది. రాష్ట్రం కూడా నష్టపోతుంది! మళ్లీ చీకటి రోజులే! ధనిక రాష్ట్రాలూ చేయనన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాల్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. అప్రమత్తంగా ఉండి ప్రభుత్వానికి అండగా ఉండకపోతే అరాచక శక్తులు మళ్లీ విజృంభిస్తాయి. చీకటి రోజులు వస్తాయి కేసీఆర్‌ను పొగడటమా? ప్రత్యేక హోదా మన హక్కు. ఒకప్పుడు మనకు హోదా ఇవ్వాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు ప్రధాని మోదీ చేతిలో కీలుబొమ్మగా మారి హోదాకు అడ్డు పడుతున్నారు. ఇలాంటి వ్యక్తిని జగన్‌, పవన్‌ కల్యాణ్‌ ఆకాశానికెత్తేస్తూ తెగ పొగిడేస్తున్నారు. వారి ఉద్దేశాన్ని ప్రజలే గ్రహించాలి. - చంద్రబాబు
 4. sonykongara

  Congress Chief ministers swearing

  కాంగ్రెస్‌ సీఎంల ప్రమాణస్వీకారానికి చంద్రబాబు! 15-12-2018 22:31:16 అమరావతి: మధ్యప్రదేశ్, రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలన్నరాహుల్ గాంధీ ఆహ్వానంపై ఏపీ సీఎం చంద్రబాబు... మంత్రుల అభిప్రాయం కోరారు. మంత్రులు కళా వెంకట్రావు, యనమల, లోకేష్, అచ్చెన్న, ఆనందబాబు, కాల్వ‌తో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన.. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారానికి వెళ్లాలా వద్దని అడిగారు. బీజేపీయేతర పక్షాల సమావేశానికి వచ్చిన నేతలను రాహుల్ గాంధీ ఆహ్వానించినట్లు మంత్రులకు చంద్రబాబు తెలిపారు. అయితే వెళ్లాలని కొందరు మంత్రులు...తుది నిర్ణయం తమదేనని మరికొందరు మంత్రులు చంద్రబాబు చెప్పారు. దీంతో వెళ్లాలా?.. వద్దా? అనే డైలామాలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. కాగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు డిసెంబర్ 17న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
 5. sonykongara

  prakasam politics

 6. sonykongara

  Tirupati smart city.

 7. జ్వెల్ లో వంటేరు ప్రతాప్ రెడ్డి కి 2014 లో ఎన్ని ఓట్లు వచ్చాయో... ఇప్పుడ అదే సంఖ్య తో అన్నే ఓట్లు వచ్చాయి అప్పుడు 3 పార్టీల మధ్య పోటీ వుంది..ఇప్పుడు ఇద్దరి మధ్య పోటీ... ఎక్కడన్న సేమ్ ఓట్లు వస్తాయ? ఇంత మోసం...జరిగితే యెట్ల ఇదొక గెలుప ?
 8. sonykongara

  Amaravati

×