Jump to content

mannam

Members
 • Content Count

  11,987
 • Donations

  $0.00 
 • Joined

 • Last visited

 • Days Won

  2

mannam last won the day on August 14

mannam had the most liked content!

About mannam

 • Rank
  Golden Fan

Recent Profile Visitors

The recent visitors block is disabled and is not being shown to other users.

 1. మీకు అలా అనిపించటంలో తప్పు లేదు, కానీ ఒకటి చెప్తాను, లైఫ్ ఈజ్ నాట్ షార్ట్. అంతా ఒక సంవత్సరమే కదా ఎలక్షన్స్ అయిపోయి. ఇంకా మూడున్నరేళ్ళు ఉందిగా పాలన. ప్రజాభిప్రాయం మారటానికైనా, మారకుండా ఉండటానికైనా ఎంతో సమయం పట్టదు. వ్యతిరేఖంగా ఉన్నామనో, అనుకూలంగా ఉన్నామనో రోజూ బయటకొచ్చి నినాదాలు చెయ్యలేరుగా; ఎవరి జీవితంలో వారు తమ కడుపు నింపుకోవటానికి పరుగెత్తటంతోనే సరిపోతుంది. నిన్నటికీ ఈరోజుకీ మార్పు రావాలంటే రాజకీయాల్లో అసాధ్యం. దేనికైనా ఓర్పు కావాలి. ఆల్రెడీ చాలామంది లోలోపల రగిలిపోతూ ఉండొచ్చు ఈ పరిపాలన మీద. కానీ అందరూ బయటపడకపోవచ్చు. అలాగని అవసరమొచ్చినప్పుడు వారి నిర్ణయాన్ని చూపించొచ్చు, లేకపోతే అప్పుడు కూడా ఏదైనా కారణం వలన బయటపడకపోవచ్చు. పట్టుదల, దీక్ష ఉంటే ఏదైనా సాధ్యమే. మనకు అనుకూలంగా జరగనప్పుడు అంతా కోల్పోయినట్టుగానే ఉంటుంది. అంతమాత్రాన నిరుత్సాహపడాల్సిన పనిలేదు. ముసలి వాడు ఐపోయాడు, జనాలకి కావాల్సింది సింగిల్ లైన్ పంచ్ లు, భావోద్వేగాలు అని అందరూ అంటున్నారు. అసలు 35 ఏళ్ళకే మూడు కిలోమీటర్లు పరిగెత్తటానికి ఆపసోపాలు పడే మనకి, 65 ఏళ్ళ వయసులో వేల కిలోమీటర్లు నడిచిన ఆయనకు పోటీనా? ఆలోచనలకి, వయసుకు పొంతన లేదనేది ఎన్నోసార్లు ఋజువైంది. మనకి అనుకూలంగా లేనప్పుడు ప్రతి విషయమూ, ప్రతి ఒక్కరూ మనకి వ్యతిరేఖమే అనుకోవటం చాలా సహజం. ఇదేనా మనం చంద్రబాబు ని చూసి నేర్చుకోవాల్సింది? రాజకీయాలు వదిలేసెయ్, జీవితానికి అన్వయించుకునే ఎన్నో మంచి లక్షణాలున్నాయి ఆయనదగ్గర. మొదటిది - జీవితం చాలా పెద్దది, ఒక్కరోజులోనే అన్నీ అయిపోవాలని ఆశించకు, రెండోది - గెలుపోటములు సహజం, మూడోది - నేడు నాటిన విత్తనం ఏదోరోజు కాయలు కాస్తుందని నమ్ము, నాలుగోది - ఎన్ని అవరోధాలెదురైనా ముందుకు సాగు, ఐదోది - చేసేపని ఏదైనా చిత్తశుద్ధితో చెయ్యి, ఫలితం దేవుడికి వదిలెయ్యి, ఆరోది - మనల్ని మోసం చేశారని పగ పెంచుకోవటం కన్నా క్షమాగుణంలోనే మన ఔన్నత్యం తెలుస్తుంది.
 2. చాలా బాగా అర్ధమయ్యేలా చెప్పారు. జన్మజన్మాలుగా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళని కూడా విధి లేక సపోర్ట్ చేసేంతగా ప్రజల్ని ప్రేరేపిస్తున్నారు. ఒక్కటంటే ఒక్కటన్నా ప్రజోపయోగ కార్యాలమీద వార్తా ప్రసారాలు కానీ, అవగాహన కల్పించే కార్యక్రమాలు కానీ లేవు.
 3. ప్రణాళికలు, ఐడియాలదేముందిలే. ఎన్నైనా వేసుకోవచ్చు. అన్నింటికీ ఆ దేవుడు ఉన్నాడు. చూస్తూ ఊరుకోడు. పెద్ద పెద్ద వాళ్ళే కాలగర్భంలో కలిసిపోయారు. దేనికైనా టైమ్ రావాలి. అంతవరకూ అవతలి వారు బాహుబలి అంత పెద్దగా అనిపిస్తారు. కర్మ సిద్ధాంతాన్ని నమ్మినవాళ్ళైతే మనం చెయ్యాల్సింది మనం చేసి మిగతాది దేవుడికి వదిలెయ్యటమే.
 4. నా ఉద్దేశ్యంలో ఐతే జమిలి ఎన్నికలు దేశానికి మంచిదే. పార్టీ ఫిరాయింపుదారుల మీద నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ కాబట్టి, ఒకసారి స్పీకర్ అనర్హత వేటు వేశాక ఆ స్థానానికి స్పెషల్ ఎన్నికలు నిర్వహిస్తే సరిపోవచ్చు. అలాకాకుండా, అదే పార్టీకి చెందిన వ్యక్తిని ఎన్నికలు లేకుండా గవర్నర్ అనుమతితో పార్టీ అధ్యక్షుడు సెలక్ట్ చేస్తే ఇంకా బెటర్. అప్పుడు ఫిరాయింపులు తగ్గుతాయని నా నమ్మకం. ఎందుకంటే తను ఫిరాయించిన స్థానానికి ఎన్నిక లేకుండా పోతుంది కాబట్టి. ఇకపోతే ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ రాజీనామా చేసినా, ఒకవేళ గవర్నమెంట్ నే భర్తరఫ్ చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించినా, ఆ కొత్త గవర్నమెంట్ పదవీకాలాన్ని ఆల్రెడీ గడిచిపోయిన కాలాన్ని తీసివేసి మిగిలిన కాలానికి మాత్రమే పరిమితం చేస్తే గవర్నమెంట్లని పడదోసే సంస్కృతి తగ్గవచ్చేమో. నో ట్రస్ట్ ఓట్ల వలన గవర్నమెంట్ పడిపోయినా, అపోజిట్ పార్టీకి అవకాశమిచ్చాక గవర్నమెంటు ని ఏర్పాటు చేయలేకపోయినా, తిరిగి ఎన్నికలు నిర్వహించి కొత్త గవర్నమెంటును ఏర్పాటు చేసే వెసులుబాటు కల్పించొచ్చు. కానీ కొత్త గవర్నమెంటు పదవీకాలాన్ని పైన చెప్పిన విధంగా కుదిస్తే నో ట్రస్ట్ వలన గవర్నమెంట్లని పడగొట్టడం తగ్గొచ్చేమో. విడతల వారీగా ఎన్నికలను నిర్వహించే అనుభవం ఉన్న మన ఎన్నికల కమీషన్ కి రెండు నెలల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చెయ్యగల సమర్ధత ఉందనే అనుకుంటున్నాను. రెండు నెలల పాటు అభివృద్ధి ఆగితే అడిగేంత జన చైతన్యం ప్రజల్లో ఉంటే అసలు ఇండియా ఈపాటికే ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని నా నమ్మకం. జమిలి ఎన్నికలు నిర్వహించానికి సరిపడా సెక్యూరిటీ వనరులున్నాయా అంటే, ఒక్క పార్లమెంట్ కి ఎన్నికలు నిర్వహించినప్పుడైనా దేశం మొత్తం నిర్వహిస్తారు కదా? అప్పుడు సరిపోయిన వనరులు అసెంబ్లీకి, పార్లమెంటుకి కలిపి ఎన్నికలు నిర్వహించటానికి సరిపోతాయనే అనుకుంటున్నాను. మంచి ప్లానింగ్ చేస్తే మేనేజ్ చెయ్యొచ్చనే అనుకుంటున్నాను. చివర్లో డిజాస్టర్ అవ్వటం అవ్వకపోవటం అనేది పూర్తిగా ఎన్నికలు నిర్వహించేవారి చిత్తశుద్ధి మీద ఆధార పడి ఉంటుంది.
 5. నా అంచనా ఐతే కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మిగిలిపోయిన సంవత్సరాల వరకూ ఉంటుంది అనుకుంటా. ఒకవేళ ఎవరూ ముందుకురాకపోతే రాష్ఠ్రపతి పాలన పెడతారనుకుంటా. అంతేకానీ గవర్నమెంట్ ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోవటానికి వీలు లేకుండా నిబంధనలు పెడతారనుకుంటా. దీని వలన గవర్నమెంట్స్ పడిపోయినా కొత్త గవర్నమెంట్స్ రావాలే కానీ ఎన్నికలు రావనుకుంటున్నా.
 6. He is an alumni of Ag college, Bapatla; where I did my B.Sc (Ag).?🤪
 7. ఏం పరిశోధనలు లే. ఉపయోగపడేవి ఒక్కటైనా ఉన్నాయా? నేను బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్ధిని.
×