థాంక్స్ ఫర్ ది లగ్జరీ
కేదార్నాథ్ లో వరదలొచ్చినప్పుడు అధికారం లేదప్పుడు, టీడీపీ పార్టీ హెడ్ సహాయ కార్యక్రమాలు చేస్తా వెళ్లి వచ్చినట్లు గుర్తు - ఎయిర్పోర్ట్ కి వచ్చి మా నాయకుడట్లా అంత ఇంత... అని పొగడటం......ఆ తరువాత - కెసిఆర్ పార్టీ లోకి వెళ్లి రెండు మూడేళ్ళ తరువాత అనుకుంటా - దూషించటం పిచ్చి పట్టినట్లు -కెసిఆర్ ఉసిగొల్పటం వీళ్ళు ఎగబడటం మాటల్తో - తలసాని (లాంటోళ్ళు)
అప్పుడు ఇలాంటి పోస్ట్ ఒక్కటి పెట్టలేదు - బ్రదర్స్ అందరు 'లో మోరెల్', భావావేశాలతో మాట్లాడకూడని సమయం...
'ఏమీ సరకు లేదు ఆరోపణల్లో, గార్బేజ్ డంపింగ్ అంతే, ఇరికించేంత సీన్ లేదు'...అదే చెప్పటం రకరకాలుగా ఇక్కడ ...
అప్పుడు మనస్సు లో మెదిలిన భావం(బయటకు చెప్పంది) ....' బతకటానికి ఇంత బరితెగిస్తారా రాజకీయాల్లో....హు ... స్వతంత్రం మాట్లాడే శక్తి ఇచ్చావ్, ఇంత అన్నం కూర తినేగలిగే తాహతు ఇచ్చావ్, ఇటువంటి పనులకి,వృత్తులకి దూరంగా ఉంచావ్- థాంక్స్ ఈ లగ్జరీ ఇచ్చినందుకు స్వామీ...ఎవ్వెరిథింగ్ ఎల్స్ ఈజ్ బోనస్ '